Swetha
ప్రతి వారం ఓటీటీ లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ.. అందులో చూడదగిన సినిమాలు మాత్రం కేవలం కొన్నే ఉంటాయి. గత వారం అంతగా తెలుగు సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందిన మాట వాస్తవమే. కానీ ఈ వారం అలా కాదు, మరికొద్ది గంటల్లోనే ఓ మంచి కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ లోకి వచ్చేస్తుంది.
ప్రతి వారం ఓటీటీ లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ.. అందులో చూడదగిన సినిమాలు మాత్రం కేవలం కొన్నే ఉంటాయి. గత వారం అంతగా తెలుగు సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందిన మాట వాస్తవమే. కానీ ఈ వారం అలా కాదు, మరికొద్ది గంటల్లోనే ఓ మంచి కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ లోకి వచ్చేస్తుంది.
Swetha
థియేటర్ లో హిట్ అవ్వని సినిమాలు కూడా ఓటీటీ లో మాత్రం చాలా ఈజీగా మంచి పేరు సంపాదించుకుంటున్నాయి. దీనితో థియేటర్ లో రిలీజ్ అయినా కొద్దీ రోజులకే ఆయా సినిమా ఓటీటీ లలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీనితో ప్రేక్షకులు కూడా ఓటీటీ లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి వారం ఓటీటీ లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ.. అందులో చూడదగిన సినిమాలు మాత్రం కేవలం కొన్నే ఉంటాయి. గత వారం అంతగా తెలుగు సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందిన మాట వాస్తవమే. కానీ ఈ వారం అలా కాదు, మరికొద్ది గంటల్లోనే ఓ మంచి కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ లోకి వచ్చేస్తుంది. థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులు.. ఓటీటీ లో అసలు మిస్ కాకండి.
ఈ సినిమా మరేదో కాదు.. శ్రద్ధా దాస్, చైతన్య రావు, సునీల్ ముఖ్య పాత్రలు పోషించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ పారిజాత పర్వం. తెలుగులో ఈ మధ్య కాలంలో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నాయి. చాలా వరకు సినిమాలు థియేటర్ లో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీ లలోకి వచ్చేస్తున్నా.. ఈ సినిమా ఓటీటీ లోకి రాడానికి మాత్రం రెండు నెలలు సమయం పట్టింది. ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే అంటే ఈ అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ను అసలు మిస్ కాకుండా చూసేయండి. గత వారం మిస్ అయినా ఎంటర్టైన్మెంట్ ను ఈ వారం ఈ సినిమాతో ఎంచక్కా స్టార్ట్ చేసేయండి.
మరి ఈ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ రావాలంటే.. కొంచెం అయినా కథ తెలియాలి కదా మరి.. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇంద్ర సినిమా విడుదలైన రోజుల్లో భీమవరం నుంచి హైదరాబాద్ కు వస్తాడు సునీల్. ఈ క్రమంలో సినిమా ఆఫర్ల కోసం ఎవరో చెప్పారని బారులో అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. మరో వైపు కొరియోగ్రాఫర్ గా వచ్చి.. అదే బార్ లో డ్యాన్సర్ గా చేస్తుంటుంది శ్రద్దా దాస్. అయితే ఆమెను ఓ సమస్య నుంచి కాపాడబోయి సునీల్ ఓ హత్య చేస్తాడు. ఆ తర్వాత బార్ శ్రీనుగా మారి దందాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఇతని స్టోరీని కథగా రాసుకుని.. డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు చైతన్య. నిర్మాతలకు కూడా కథ నచ్చుతుంది. కానీ హీరోగా తన ఫ్రెండ్ ను ఉంటానంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు. దీనితో ఆ నిర్మాత భార్యనే కిడ్నప్ చేసి ఆ డబ్బుతో సినిమా తీయాలని అనుకుంటారు. సరిగ్గా అదే టైమ్ కి మరో గ్యాంగ్ కూడా కిడ్నప్ చేయడానికి వస్తారు. ఎవరు ఎవరిని కిడ్నప్ చేశారు ! ఎవరు ఎవరిని ఎంత డబ్బు డిమాండ్ చేశారు ! చివరి వరకు కథ ఎలా కొనసాగింది ! చివరికి కథ ఎలా ముగిసింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.