iDreamPost
android-app
ios-app

OTTలో చెమటలు పట్టించే కాన్సెప్ట్.. గెట్ అవుట్ మూవీకి పిచ్చెక్కిపోతారు!

OTT Weekend Suggestions- Best Thriller Get Out Movie: ఓటీటీలో మీరు ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే మాత్రం ఈ మూవీ మీకోసమే. ఈ సినిమాలో ఉండే ట్విస్టులకు మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. మీకు తెలియకుండానే మిమ్మల్ని హిప్నటైజ్ చేసేస్తారు.

OTT Weekend Suggestions- Best Thriller Get Out Movie: ఓటీటీలో మీరు ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే మాత్రం ఈ మూవీ మీకోసమే. ఈ సినిమాలో ఉండే ట్విస్టులకు మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. మీకు తెలియకుండానే మిమ్మల్ని హిప్నటైజ్ చేసేస్తారు.

OTTలో చెమటలు పట్టించే కాన్సెప్ట్.. గెట్ అవుట్ మూవీకి పిచ్చెక్కిపోతారు!

థ్రిల్లర్స్ లో చాలానే రకాలు ఉంటాయి. వాటిలో యాక్షన్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఉంటాయి. యాక్షన్, సస్పెన్స్ అంటే తరచూ చూస్తూనే ఉంటారు. కానీ, సైకలాజికల్ థ్రిల్లర్స్ చాలా తక్కువగా వస్తాయి. ఒక సరైన కథగానీ మీకు తగిలితే అస్సలు మైండ్ లోనుంచి పోదు. ఇప్పుడు మీకోసం అలాంటి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ని తీసుకొచ్చాం. ఇది ఎంతలా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది అంటే.. అంత తేలిగ్గా మీరు ఈ మూవీని మర్చిపోలేరు. ఇందులో మంచి కథ ఉండటమే కాకుండా.. మంచి మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, టన్నుల కొద్దీ ట్విస్టులు ఉంటాయి. ఒక మనిషిని హిప్నాటిజంతో కీలుబొమ్మని చేసి ఆడించడం ఎలా అనేది ఈ మూవీలో చూపించారు.

ఒక నల్లజాతి కుర్రాడు ఉంటాడు. అతను ఒక తెల్లజాతికి చెందిన అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్లిద్దరు ఎంతో సంతోషంగా కలిసి ఉంటారు. ప్రేమ తర్వాత ఎలాగైనా పెళ్లిచేసుకోవాలి కదా. అందుకే పెద్దలను కలిసేందుకు ఇద్దరు వెళ్తారు. వాళ్లు దారిలో వెళ్లే సమయంలోనే పెద్ద ప్రమాదం తప్పుతుంది. ఏదో కీడు శంకిస్తారు కానీ.. పట్టించుకోకుండా వెళ్లిపోతారు. ఆ ప్రాంతంలో నల్లజాతీయులు అంటే అస్సలు రెస్పెక్ట్ ఉండదు. హీరోయిన్ వాళ్ల ఇంట్లో ఉన్న పనివాళ్లు అంతా నల్లజాతికి చెందిన వాళ్లే. ఆమె తల్లిదండ్రులు ముందు అతనితో బాగానే ఉంటారు. కానీ, ఆ తర్వాతే వాళ్ల అసలు రూపం చూపిస్తారు.

ఆ ప్రాంతంలో ఎంతో మంది నల్లజాతీయులు అదృశ్యం అవుతూ ఉంటారు. అందుకు సంబంధించి చాలానే మిస్సింగ్ కేసులు ఉంటాయి. ఆ లిస్టులోకి హీరో కూడా చేరతాడు అని అతనికి కూడా తెలియదు. హీరోకి తెలియకుండానే హీరోయిన్ వాళ్ల తల్లిదండ్రులు హిప్నటైజ్ చేస్తారు. ఆ తర్వాత అతడిని ఒక ల్యాబ్ లో ఎలుకలా ట్రీట్ చేస్తారు. అతడిని కుర్చీకి కట్టేసి ప్రయోగాలు చేసేందుకు రెడీ అయిపోతారు. వాళ్లు చేసే ప్రయోగాలు ఏంటి? అసలు వాళ్లకి నల్లజాతీయులు అంటే ఎందుకు అంత కోపం? వాళ్లని హిప్నటైజ్ చేసి వాళ్ల అధీనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంతకీ హీరో ప్రాణాలతో బయటపడ్డాడా? అనే చాలానే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు కావాలి అంటే మీరు ఈ ‘గెట్ అవుట్’ చిత్రం చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.