iDreamPost
android-app
ios-app

OTTలో క్రేజీ లవ్ స్టోరీ.. ‘లవ్ అండ్ అదర్ డ్రగ్స్’ మూవీకి పిచ్చెక్కిపోతారు!

OTT Suggestions- Watch Alone Movie Love And Other Drugs: ఓటీటీలో మీరు ఒక క్రేజీ లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇది అలాంటి ఇలాంటి క్రేజీ కాదు. చూస్తున్నంతసేపు పిచ్చెక్కిస్తుంది.

OTT Suggestions- Watch Alone Movie Love And Other Drugs: ఓటీటీలో మీరు ఒక క్రేజీ లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇది అలాంటి ఇలాంటి క్రేజీ కాదు. చూస్తున్నంతసేపు పిచ్చెక్కిస్తుంది.

OTTలో క్రేజీ లవ్ స్టోరీ.. ‘లవ్ అండ్ అదర్ డ్రగ్స్’ మూవీకి పిచ్చెక్కిపోతారు!

లవ్ స్టోరీలకు వరల్డ్ వైడ్ గా ఉండే క్రేజ్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి లవ్ స్టోరీ చూస్తే వచ్చే ఫీల్ వేరే లెవల్లో ఉంటుంది. అలాగే లవ్ స్టోరీస్ అన్నీ ఫీల్ గుడ్ లా ఉండవు కదా. కొన్ని స్టోరీల్లో మలుపులు, ట్విస్టులు, షాకింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉంటాయి. అలాంటి ఒక క్రేజీ లవ్ స్టోరీనే మీ ముందుకు తీసుకొచ్చాం. ఇది జస్ట్ లవ్ స్టోరీ అనుకుంటే పొరపారపాటే అవుతుంది. ఎందుకంటే ఇందులో ప్రేమతో పాటుగా చాలానే కోణాలు, కథాంశాలు ఉంటాయి. అలాగే మైండ్ బ్లాంక్ చేసే అంశాలు చాలానే ఉంటాయి. ఒక ప్లే బాయ్ అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనేది ఈ కథలో చూపించారు.

ఒక మంచి ప్రేమకథ చూడాలి అనుకుంటే ఇది మీకు సెట్ కాదేమో. ఎందుకంటే ఇది మంచి ప్రేమకథ మాత్రమే కాదు.. కిక్కిచ్చే ప్రేమకథ. ఇందులో ఉండే పాత్రలు దాదాపుగా మిమ్మల్ని నోరెళ్లబెట్టేలా చేస్తాయి. హీరో ఒక డాక్టర్ ఇంటర్న్. అతను ఒక మంచి ప్లే బాయ్ కూడా. తన చుట్టూ ఉండే అమ్మాయిల్ని ఎలా బుట్టలో వేసుకోవాలో అతనికి బాగా తెలుసు. ఆ విషయంలో అతనికి చాలా మంచి టాలెంట్ కూడా ఉంది. అయితే ఒకరోజు ఆస్పత్రికి వచ్చిన అమ్మాయితో మాటా మాటా కలుపుతాడు. అతను పులిహోర కలుపుతున్నాడు అని తెలిసినా కూడా ఆమె కూడా మాట కలుపుతుంది. కాసేపటికే అతడిని అంచనా వేస్తుంది. అతనొక ప్లే బాయ్ అని.. అతను కేవలం తనకు కావాల్సిన దానికోసమే అలా చేస్తున్నాడని తెలుసుకుంటుంది. కానీ, ఆమెకు కూడా అలాంటి వాడే కావాలి అనడం కొసమెరుపు.

అతను దేనికోసం దగ్గరవుతున్నాడో ఆమెకు తెలిసే అతడికి దగ్గరవుతుంది. అంతేకాకుండా.. వాళ్లు విచ్చలవిడగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అతను కేవలం ఈమెతోనే కాకుండా.. తనకు నచ్చిన వాళ్లతో కూడా తిరుగుతూనే ఉంటాడు. అంటే వాళ్ల మధ్య ఉన్నది కేవలం పరస్పర అవసరాలు తీర్చుకోవాలి అనే ఉద్దేశం మాత్రమే. అయితే కొన్నిరోజుల జర్నీ తర్వాత ఇద్దరిలో మార్పు మొదలవుతుంది. తాను లేకుండా నేను బతకలేను అనే పరిస్థితికి ఇద్దరూ వచ్చేస్తారు. అయితే వాళ్లిద్దరిలో ఫీలింగ్స్ వచ్చిన తర్వాతే వారి మధ్య గొడవలు ఎక్కువ అవ్వడం విశేషం. అయితే వాళ్లు ప్రేమికులుగా మారారా? పరస్పర అవసరాల కోసం స్టార్ట్ చేసిన రిలేషన్ ని కంటిన్యూ చేశారా? తెలియాలి అంటే మీరు ఈ ‘లవ్ అండ్ అదర్ డ్రగ్స్’ అనే సినిమా చూడాల్సిందే. ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు బో*గా కూడా ఉంటాయి. కాబట్టి సోలోగా చూస్తే సో బెటర్. ఈ మూవీ ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.