iDreamPost
android-app
ios-app

OTT లో డాగ్ లవర్స్ మెచ్చే ‘వాలట్టి’ మూవీ.. వెంటనే చూడండి.

  • Published Aug 12, 2024 | 6:20 PM Updated Updated Aug 12, 2024 | 6:20 PM

OTT Best Telugu Romcom: ఇప్పటివరకు యాక్షన్ , హర్రర్ , సస్పెన్స్ కామెడీ మూవీస్ చాలానే చూసి ఉంటారు. కానీ ఈ టైప్ ఆఫ్ మూవీని మాత్రం చూసి ఉండరు. ఇదొక డిఫరెంట్ కామెడీ మూవీ. ముఖ్యంగా డాగ్ లవర్స్ ను ఈ సినిమా బాగా మెప్పించేస్తుంది. మరి ఈ సినిమా ఏంటో చూసేయండి.

OTT Best Telugu Romcom: ఇప్పటివరకు యాక్షన్ , హర్రర్ , సస్పెన్స్ కామెడీ మూవీస్ చాలానే చూసి ఉంటారు. కానీ ఈ టైప్ ఆఫ్ మూవీని మాత్రం చూసి ఉండరు. ఇదొక డిఫరెంట్ కామెడీ మూవీ. ముఖ్యంగా డాగ్ లవర్స్ ను ఈ సినిమా బాగా మెప్పించేస్తుంది. మరి ఈ సినిమా ఏంటో చూసేయండి.

  • Published Aug 12, 2024 | 6:20 PMUpdated Aug 12, 2024 | 6:20 PM
OTT లో డాగ్ లవర్స్ మెచ్చే ‘వాలట్టి’ మూవీ.. వెంటనే చూడండి.

మలయాళీ సినిమాలు చేసే మ్యాజిక్ కు అందరు ఫిదా అయిపోతారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఓటీటీ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో చాలానే మలయాళ సినిమాలను చూసి ఉంటారు. అలాంటి వాటిలో ఈ సినిమా కూడా ఒకటి. అయితే రెగ్యులర్ యాక్షన్ , హర్రర్ , సస్పెన్స్ , కామెడీ మూవీస్ చూసి బోర్ కొట్టేస్తే మాత్రం.. ఈ సినిమా ఓ డిఫరెంట్ ఫీల్ గుడ్ ఎక్స్పీరియెన్స్ ను ఇస్తుంది. ముఖ్యంగా డాగ్ లవర్స్ ను ఈ సినిమా బాగా మెప్పించేస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా పేరు “వాలట్టి”. ఈ సినిమా టామీ అనే ఓ గోల్డెన్ రిట్రీవర్ డాగ్ కు , బ్రాహ్మణ కుటుంబంలో పెరిగే అమలు అనే ఓ కాకర్ స్పెనియర్ డాగ్ కు మధ్య జరిగే లవ్ స్టోరీలో.. వాటికి ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయి. ఇంటి నుంచి వెళ్ళిపోయినా తర్వాత ఒక స్ట్రీట్ డాగ్ వాటికి ఎలా హెల్ప్ చేస్తుంది అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ. కాస్త కామెడీగా, కాస్త ఎమోషనల్ గా సాగిపోతూ ఉంటుంది ఈ మూవీ కథ. సినిమా గురించి చెప్పడం కంటే చూస్తూనే ఇంకాస్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది. ఈ సినిమా నిడివి కేవలం 1 గంట 53 నిముషాలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈజీగా ఈ మూవీని చూసేయొచ్చు. మళయాలంతో పాటు.. ఈ సినిమా తెలుగు , హిందీ , తమిళం , కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంది. చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాల్సిందే.

కాగా ఈ సినిమాను దేవన్ జయకుమార్ డైరెక్ట్ చేయగా.. రోషన్ మాథ్యూ, రవీనా రవి, సౌబిన్ షాహిర్, సన్నీ వైన్, సైజు కురుప్, అజు వర్గీస్, ఇంద్రన్స్, రజినీ హరిదాస్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో డాగ్స్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. థియేటర్ లో ఈ సినిమా రిలీజ్ అయినా సమయంలో పాజిటివ్ రివ్యూలతో పాటు.. బాక్స్ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టింది. ఇక ఓటీటీ లో కూడా ఈ సినిమాకు మంచి రివ్యూస్ ఏ వచ్చాయి. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.