iDreamPost
android-app
ios-app

OTT లో ‘ది గార్డియన్’ మూవీ క్లైమాక్స్ చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

  • Published Aug 11, 2024 | 12:30 AM Updated Updated Aug 11, 2024 | 12:30 AM

OTT Best Horror Suspense Thriller: హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉంటే కనుక ఇప్పుడు చెప్పుకోబోయే మూవీని అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే. ఇదొక డిఫరెంట్ కథ. ముఖ్యంగా ఈ మూవీలో క్లైమాక్స్ అసలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. మరి ఆ మూవీ ఏంటో చూసేయండి.

OTT Best Horror Suspense Thriller: హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉంటే కనుక ఇప్పుడు చెప్పుకోబోయే మూవీని అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే. ఇదొక డిఫరెంట్ కథ. ముఖ్యంగా ఈ మూవీలో క్లైమాక్స్ అసలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. మరి ఆ మూవీ ఏంటో చూసేయండి.

  • Published Aug 11, 2024 | 12:30 AMUpdated Aug 11, 2024 | 12:30 AM
OTT లో ‘ది గార్డియన్’ మూవీ క్లైమాక్స్ చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

హర్రర్ కథలకు అందరూ అలవాటు పడి ఉన్నారు. దెయ్యాలను చూపించి భయపెట్టే స్క్రీన్ ప్లే కు ఇప్పుడు ప్రేక్షకులు ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వారిని ఇంప్రెస్స్ చేయాలంటే.. కథలో ఎదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాల్సిందే. డైరెక్ట్ గా దెయ్యాలను చూపించి భయపెట్టడం కాకుండా.. క్షుద్ర పూజలు , బొమ్మలో ఉండే ఆత్మలు ఇలా రకరకాలుగా చాలానే కథలు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు మేకర్స్. ఈ కథ కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. స్టార్టింగ్ సీన్ లో ఓ అపార్ట్మెంట్ లో ఉండే ఓ బొమ్మను చూపిస్తారు. అదే ఇంట్లో ఉండే మహిళ రెడీ అవుతూ ఉంటుంది. కొద్దిసేపటికి ఆమె అదే బొమ్మ ముందు బాత్ టబ్ లో కూర్చుని సూసైడ్ చేసుకుని చనిపోతుంది. కట్ చేస్తే ఇంకొక సీన్ లో ఈ మూవీ హీరోయిన్ ఇంస్టాలో సాంగ్స్ పాడుతూ లైవ్ ఇస్తూ ఉంటుంది. ఎదో ఒక రోజు పెద్ద సింగర్ అవ్వాలి అనుకోవడమే ఆమె కోరిక. కానీ వాళ్ళ నాన్నకు ఈ విషయం తెలియదు. తెలిస్తే ఆమెను ఇంటి నుంచి బయటకు కూడా పంపరని.. సైలెంట్ గా ఈ విషయాన్నీ మేనేజ్ చేస్తూ ఉంటుంది. అయితే, స్టార్టింగ్ సీన్ లో చనిపోయిన ఆ లేడి ఓ గ్రేట్ సింగర్. ఈ విషయం హీరోయిన్ కు తెలియడంతో.. ఈమె షాక్ లో ఉంటుంది. అలాగే చనిపోయింది ఓ సెలెబ్రిటీ కాబట్టి ఆ న్యూస్ వెంటనే అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇక హీరోయిన్ కూడా బాధపడుతూ తన తండ్రి దగ్గరకు వెళ్తుంది. అయితే అక్కడకు అనుకోకుండా పోలీసులు వచ్చి.. చనిపోయిన సింగర్ మీకు బాగా క్లోజ్ కాబట్టి.. మిమ్మల్ని ఇంటరాగేట్ చేయాలనీ చెప్పి.. ఆమెను అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తారు.

ఈ క్రమంలో పోలీసులు ఆమెను ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. చనిపోయిన సింగర్ కు ఏదైనా అబ్ నార్మల్ డిసీజ్ ఉందా.. ఎందుకంటే తన రూమ్ లో ఒక బొమ్మ కూడా ఉందని చెప్తారు పోలీసులు. అయితే హీరోయిన్ మాత్రం తనకేం తెలియదని చెప్తుంది. కానీ తన మైండ్ లో మాత్రం వారిద్దరి గతానికి సంబంధించిన స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. ఇక హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు ఇంట్లో భయంకరమైన సంఘటనలు ఎదురౌతాయి. ఆ తర్వాత హీరోయిన్ ఆ సింగర్ అంత్యక్రియలకు వెళ్లి.. బాధపడుతూ నేనలా చేసి ఉండకూడదు నన్ను క్షమించు అని మనసులో అనుకుంటుంది. అసలు ఆ సింగర్ ఎలా చనిపోయింది ? ఆమెకు హీరోయిన్ కు ఉన్న సంబంధం ఏంటి ? బొమ్మకు వీరికి ఉన్న సంబంధం ఏంటి ? ఆమె అనుకున్నట్లుగా సింగర్ అవ్వడానికి ఎలాంటి పనులు చేస్తుంది? ఇవన్నీ తెలియాలంటే.. “ది గార్డియన్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.