iDreamPost
android-app
ios-app

OTTలో క్రైమ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘పల్ప్ ఫిక్షన్’.. బ్రెయిన్ కు బాగా పని పెడుతుంది

  • Published Aug 09, 2024 | 5:41 PM Updated Updated Aug 09, 2024 | 5:41 PM

OTT Crime Comedy Thriller: కొన్ని సినిమాలు చూడడానికి కాస్త కంఫ్యూజింగ్ గా ఉంటూ ఉంటాయి. కానీ అవి కచ్చితంగా లైఫ్ లో చూడాల్సిన సినిమాలలో కొన్ని అయ్యి ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే . ఫిల్మ్ లవర్స్ కు ఈ సినిమా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది. మరి అదేంటో చూసేయండి.

OTT Crime Comedy Thriller: కొన్ని సినిమాలు చూడడానికి కాస్త కంఫ్యూజింగ్ గా ఉంటూ ఉంటాయి. కానీ అవి కచ్చితంగా లైఫ్ లో చూడాల్సిన సినిమాలలో కొన్ని అయ్యి ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే . ఫిల్మ్ లవర్స్ కు ఈ సినిమా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది. మరి అదేంటో చూసేయండి.

  • Published Aug 09, 2024 | 5:41 PMUpdated Aug 09, 2024 | 5:41 PM
OTTలో క్రైమ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘పల్ప్ ఫిక్షన్’..  బ్రెయిన్ కు బాగా పని పెడుతుంది

ఒక సినిమా చూసేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. అది ఎలా జరుగుతుంది అనే తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మూవీని ఎలా చూశాము అనే ఆలోచన.. ఆల్రెడీ తెలిసిన కథను కూడా కొత్తగా మనకు పరిచయం చేసినట్లు అనిపిస్తుంది. చెప్పాలంటే రామాయణం గురించి అందరికి తెలుసు కానీ.. దానిని ఎన్ని సార్లు ఎంత మంది మూవీ రూపంలో చూపించినా కూడా.. ప్రతి సారి దానిని ఇంట్రెస్టింగ్ గానే చూస్తారు. అలాగే ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా.. ఇది రాయణం అయితే కాదు కానీ ఇదొక క్రైమ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ జోనర్ లో ఎన్నో సినిమాలను చూసి ఉంటారు కానీ.. ఈ సినిమా మాత్రం మూవీ లవర్స్ కు ఓ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ను ఇస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. అనే విషయాలను చూసేద్దాం

ఈ సినిమా కథ విషయానికొస్తే.. సినిమా స్టార్టింగ్ లో ఇద్దరు భార్య భర్తలను చూపిస్తారు. వారిద్దరూ ఒక రెస్టారెంట్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు భార్య తన భర్తతో.. మనిద్దరం కలిసి ఒక ఇంటిని దొంగతనం చేద్దాం అని చెప్తుంది. దానికి భర్త ఇంటిని రాబరీ చేస్తే.. చాలా కేసులు అవుతాయి.. దానికి బదులు ఏదైనా రెస్టారెంట్ ను కానీ.. కాఫీ షాప్ ను కానీ రాబరీ చేస్తే బెటర్ అని చెప్పి చెప్పగానే ఆ ప్లాన్ ను అమలు చేస్తారు . కట్ చేస్తే మూవీ నెక్ట్ సీన్ లో ఓ కార్ లో ఇద్దరు రౌడీలు జర్నీ చేస్తూ ఉంటారు. వారిద్దరూ వాళ్ళ బాస్ కు సంబంధించిన ఓ సూట్ కేసును తీసుకురావడానికి వెళ్తారు. అలా వాళ్ళ బాస్ చెప్పిన ప్లేస్ కు వెళ్లి ఆ సూట్ కేసును తీసుకుని అక్కడున్న వారిని చంపేస్తారు. నెక్ట్ కథను మూడు పార్ట్శ్ గా చూపిస్తారు. ఆ మూడు పార్ట్స్ ఏంటి అసలు ఎందుకు ఈ సినిమాను కచ్చితంగా చూడాలి ? అసలు దీనిలో ఏముంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. చూడడానికి కాస్త కంఫ్యూజింగ్ ఉంటుంది. కానీ లింక్స్ అర్ధం చేసుకుంటే మాత్రం దీనిని మించిన మూవీ మరొకటి లేదనిపిస్తుంది.

Pulp Fiction

ఈ సినిమా పేరు “పల్ప్ ఫిక్షన్” . ఈ సినిమా కథ మొత్తం మూడు రోజుల్లో జరుగుతుంది. అందుకే కథను మూడు పార్ట్స్ గా చూపిస్తారు. మూవీ స్టార్టింగ్ నుంచి ఒక ఐదు క్యారెక్టర్స్ ను ఫాలో అవుతూ ఉంటే ఈ సినిమా ఈజీగా అర్థమైపోతుంది. ఒక మాఫియా డాన్ , అతని వైఫ్ , ఒక బాక్సార్, ఇద్దరు క్రిమినల్స్ ఈ ఐదుగురు మధ్య మూడు రోజుల్లో జరిగే క్రైమ్, మిస్ అడ్వెంచర్స్ ఏ ఈ సినిమాలో అసలు కథ. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇది ఈ మధ్య కాలం వచ్చిన సినిమా అయితే కాదు. కానీ ఈ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకుని తీసిన సినిమాలు మాత్రం చాలానే ఉన్నాయి. కాబట్టి ఓ మంచి క్రైమ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలంటే మాత్రం.. ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.