iDreamPost
android-app
ios-app

చనిపోతామని తెలిసి పార్టీ చేసుకునే ఫ్యామిలీ.. OTT లో వెరైటీ డార్క్ కామెడీ మూవీ

  • Published Jul 25, 2024 | 6:00 AMUpdated Jul 25, 2024 | 6:00 AM

OTT Dark Comedy Movie : కొన్ని సినిమాలలో ఎక్కువగా ట్విస్ట్ లు లేకపోయినా సరే.. తర్వాత ఏం జరుగుతుందా అనే ఇంట్రెస్ట్ మాత్రం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీ ఏంటో ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Dark Comedy Movie : కొన్ని సినిమాలలో ఎక్కువగా ట్విస్ట్ లు లేకపోయినా సరే.. తర్వాత ఏం జరుగుతుందా అనే ఇంట్రెస్ట్ మాత్రం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీ ఏంటో ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 25, 2024 | 6:00 AMUpdated Jul 25, 2024 | 6:00 AM
చనిపోతామని తెలిసి పార్టీ చేసుకునే ఫ్యామిలీ.. OTT లో వెరైటీ డార్క్ కామెడీ మూవీ

ఇప్పుడు చాలా వరకు హర్రర్ , సస్పెన్స్ , మిస్టరీ థ్రిల్లర్స్ తో పాటు.. డార్క్ కామెడీ మూవీస్ ను కూడా ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఈ తరహా మూవీస్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఇలాంటి మూవీని ఇంతకముందెప్పుడు చూసి ఉండరు. ఇక కొన్ని సినిమాలలో మరి అంతగా ట్విస్ట్స్ లేకపోయినా కానీ.. తర్వాత ఏం జరుగుతుందా అనే ఇంట్రెస్ట్ ను మాత్రం క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రజలు చనిపోవడానికి.. ప్రభుత్వమే మందులు ఇస్తుంది. త్వరలో చనిపోతామని తెలిసినా కానీ.. ప్రజలంతా పార్టీ చేసుకుంటారు. అసలు వినడానికే చాలా కొత్తగా ఉన్న ఈ కథ ఏంటి.. ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో సైమన్ , నెల్ అనే ఇద్దరు వారి ఇంట్లో క్రిస్మస్ పార్టీని సెలెబ్రేట్ చేస్తూ ఉంటారు. ఆ పార్టీకి వారి ఫ్రెండ్స్ అందరిని పిలుస్తారు. ఇక వారికి ముగ్గురు పిల్లలు ఉంటారు. ఆర్ట్ , హార్డీ , థామస్ .. అయితే ఆ పార్టీకి ముగ్గురు కపుల్స్ వస్తారు. వారిలో ఒకరికి కిట్టి అనే కూతురు ఉంటుంది. పార్టీ అయితే స్టార్ట్ అయింది కానీ.. ఒక్కరు కూడా హ్యాపీగా కనిపించరు. ఆర్ట్ , కిట్టి గొడవ పడుతూనే ఉంటారు. అయినా సరే వారిద్దరిని ఎవరు ఆపరు. ఇక డిన్నర్ లో కూడా అందరి ప్లేట్స్ లో కొంచెం కొంచెం ఆహరం మాత్రమే ఉంటుంది. ఇదిలా ఉంటే మరో వైపు ఆ దేశంలో ఓ విషపూరిత గ్య రిలీజ్ అవుతుంది. దాని వలన చాలా మంది చనిపోతూ ఉంటారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ.. దానిని కంట్రోల్ చేయడం ఎవరి వలన కాదు. దీనితో ఆ గ్యాస్ వలన చనిపోవడం కంటే కూడా.. ఎలాంటి నొప్పి లేకుండా ముందే చనిపోవడం బెటర్ అని అంతా అనుకుంటారు.

కట్ చేస్తే.. ఏకంగా ప్రభుత్వమే ప్రజలు చనిపోవడం కోసం ఎగ్జిట్ పిల్స్ ను ఇస్తుంది. ఈ పిల్ ను వేసుకోవడం కోసమే సైమన్ , నెల్ ఈ పార్టీని ఏర్పాటు చేస్తారు. అయితే ఆ సమయంలో వారి కొడుకు ఆర్ట్ ఆ ఎగ్జిట్ పిల్ ను వేసుకోను అని మారం చేస్తూ ఉంటాడు. కానీ అతని పేరెంట్స్ , అక్కడ ఉన్న వాళ్లంతా కూడా అతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు. అసలు అక్కడ ఏం జరిగింది ? వారంతా ఆ గ్యాస్ విడుదల కాకముందే చనిపోయారా ? లేదా గ్యాస్ విడుదల అయ్యాకా చనిపోయారా ? ఆ గ్యాస్ ను ఆపడం ఎవరి వలన సాధ్యం కాలేదా ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే.. “సైలెంట్ నైట్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. చనిపోతారని తెలిసినా సరే మనుషులు ఎలా దానిని రిసీవ్ చేసుకుంటారనేది ఈ సినిమాలో కాస్త కామెడీ టచ్ యాడ్ చేసి చూపించారు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి