iDreamPost
android-app
ios-app

NRI హత్య చుట్టూ తిరిగే కథ. OTTలో గ్రిప్పింగ్ క్రైమ్ సిరీస్!

OTT Suggestions- Best Thriller Kohrra Series: ఓటీటీలో ఒక మంచి వెబ్ సిరీస్ ఒకటి అందుబాటులో ఉంది. పోలీసు ఇన్వెస్టిగేషన్ సిరీస్లు మీకు ఇష్టమైతే మాత్రం ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఒక హత్య చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది.

OTT Suggestions- Best Thriller Kohrra Series: ఓటీటీలో ఒక మంచి వెబ్ సిరీస్ ఒకటి అందుబాటులో ఉంది. పోలీసు ఇన్వెస్టిగేషన్ సిరీస్లు మీకు ఇష్టమైతే మాత్రం ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఒక హత్య చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది.

NRI హత్య చుట్టూ తిరిగే కథ. OTTలో గ్రిప్పింగ్ క్రైమ్ సిరీస్!

వెబ్ సిరీస్ మీద ఆసక్తి రావాలి అంటే అందులో మంచి గ్రిప్పింగ్ కథ ఉండాలి. ప్రతి ఎపిసోడ్ కి ఒక ట్విస్ట్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉండాలి. తర్వాతి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తి ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలి అంటే ఆ సిరీస్ మీకు నిద్ర పట్టకుండా చేయాలి. అలాంటి ఒక వెబ్ సిరీస్ చూడాలి అని మీరు అనుకుంటే మాత్రం.. ఈ సిరీస్ మీకోసమే. ఇది ఒక బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్. ఇందులో ఒక హత్య చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. కానీ, అది కేవలం ఒక ఎలిమెంట్ మాత్రమే. అసలు కథ ఆ హత్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క కథ బయటకు వస్తూ ఉంటే.. మీకు మబ్బులు విడితూ ఉంటాయి.

సాధారణంగా ఒక మంచి వెబ్ సిరీస్ ని మీరు చూడటం స్టార్ట్ చేస్తే.. అది కంప్లీట్ అయ్యే వరకు అది మీ మైండ్ లో నుంచి పోదు. అలాంటి వెబ్ సిరీస్లు ఓటీటీల్లో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కూడా ఈ వెబ్ సిరీస్లు చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ కథ కూడా. ఇందులో ఒక ఎన్నారై హత్య జరుగుతుంది. ఫ్రెండ్ పెళ్లికి ఇండియా వచ్చిన ఒక ఎన్నారై దారుణ హత్యకు గురవుతాడు. అతని కేసును ఛేదించే బాధ్యత హీరోకి వస్తుంది. అతని పైఅధికారులతో కలిసి కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఎక్కడా ఒక్క క్లూ కూడా దొరకదు. పైగా ఎన్నారై కాబట్టి ఒత్తిడి పెరిగిపోతుంది. ఇంక అతను ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాడు అనే దానిపై వెబ్ సిరీస్ నడుస్తూ ఉంటుంది. అయితే ఈ సిరీస్ లో కేవలం ఆ ఎన్నారై హత్య మాత్రమే కాదు.. ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి.

అసలు ఆ ఎన్నారై చనిపోయిన రాత్రి ఏం జరిగింది? అనే పాయింట్ మీద పోలీసులు పని చేస్తూ ఉంటారు. అందుకోసం పలు విధాలుగా కేసును దర్యాప్తు చేస్తుంటారు. ఎలాంటి ట్రిక్స్ వాడుతున్నారు? ఎలా ఆధారాలు సేకరిస్తున్నారు అనే పాయింట్ ఆసక్తిని కలిగిస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగా ఒక్కో కథ బయటకు వస్తూ ఉంటుంది. ఆ ఎన్నారై బంధువులు, స్నేహితుల్లో కూడా చాలానే రహస్యాలు ఉంటాయి. అంతేకాకుండా.. ఇన్వెస్టిగేషన్ చేసే ఒక పోలీసు జీవితంలో కూడా కొన్ని రహస్యాలు దాగి ఉంటాయి. వాటిపై కూడా ఈ కథ ఆధారపడి ఉంటుంది. మరి.. ఆ పోలీసు ఈ కేసును ఛేదించాడా? అనే విషయాలు తెలియాలి అంటే మీరు ఈ ‘కొహ్రా’ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్సో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.