iDreamPost
android-app
ios-app

ఈ మూవీ అర్ధం చేసుకోవడం అంత ఈజీ కాదు .. OTT లో హర్రర్ సైన్స్ ఫిక్షన్ మూవీ

  • Published Jul 09, 2024 | 12:59 PM Updated Updated Jul 09, 2024 | 12:59 PM

OTT Suggestion - Sci-Fi Horror Film: హర్రర్ సినిమాలు ప్రేక్షలకు ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగిస్తూనే ఉంటాయి. వీటితో పాటు ఇంట్రెస్ట్ కలిగించే మరొక జోనర్ సైన్స్ ఫిక్షన్ డ్రామాస్. మరి సైన్స్ ఫిక్షన్ కథలకు హర్రర్ ఎలిమెంట్స్ జోడిస్తే.. అవి చూడడానికి ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే.

OTT Suggestion - Sci-Fi Horror Film: హర్రర్ సినిమాలు ప్రేక్షలకు ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగిస్తూనే ఉంటాయి. వీటితో పాటు ఇంట్రెస్ట్ కలిగించే మరొక జోనర్ సైన్స్ ఫిక్షన్ డ్రామాస్. మరి సైన్స్ ఫిక్షన్ కథలకు హర్రర్ ఎలిమెంట్స్ జోడిస్తే.. అవి చూడడానికి ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే.

  • Published Jul 09, 2024 | 12:59 PMUpdated Jul 09, 2024 | 12:59 PM
ఈ మూవీ అర్ధం చేసుకోవడం అంత ఈజీ కాదు .. OTT లో హర్రర్ సైన్స్ ఫిక్షన్ మూవీ

ఇప్పుడు ఓటీటీ లో హర్రర్ సినిమాలతో పాటు.. సైన్స్ ఫిక్షన్ సినిమాలకు కూడా స్పెషల్ క్రేజ్ ఉంది. ప్రేక్షకులంతా వారం వారం ఓటీటీ లోకి వచ్చే సినిమాలను చూడడంతో పాటు.. ఇంకా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏమైనా ఉన్నాయేమో అని సెర్చ్ చేసే పనిలో ఉంటున్నారు. అటువంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. ఓటీటీ లో లెక్కపెట్టలెన్నని సినిమాలు.. మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఓ వారం ఓటీటీ కొత్త సినిమాలు రిలీజ్ కాకపోయినా కానీ.. ఎంచక్కా ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న ఇంట్రెస్టింగ్ మూవీస్ చూసేయొచ్చు. ఇక ఇప్పుడు హర్రర్ తో పాటు.. సైన్స్ ఫిక్షన్ మూవీస్ కు కూడా ప్రేక్షకులు బాగా అట్ట్రాక్ట్ అవుతున్నారు.. మరి అలాంటిది సైన్స్ ఫిక్షన్ కథలకు.. హర్రర్ ఎలిమెంట్స్ జోడిస్తే.. ఆ సినిమాలు చూడడానికి ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ స్టార్టింగ్ లో రెండు బస్సులలో స్కూల్ స్టూడెంట్స్ అంతా కలిసి ఓ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. ఇక వారాంత బస్సు లో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటే.. మిట్సుకా మాత్రం డైరీ రాసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో.. తన ఫ్రెండ్ తన చేతిలో ఉండే పెన్ లాక్కుని కింద పడేస్తుంది. మిట్సుకా కిందకి ఒంగి ఆ పెన్ తీసుకుని పైకి లేచే లోపే ఆ రెండు బస్సులో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా సగానికి కట్ అయిపోయి ఉంటారు. ఆమెకు అసలు అక్కడ ఏం జరిగింది అనేది అస్సలు అర్ధం కాదు. దీనితో ఆ బస్సు దిగి ఆమె పారిపోతుంది.. ఆమెను ఓ గాలి వెంటాడుతూ ఉంటుంది. ఆ గాలి తాకిన ప్రతి ఒక్కరు కూడా సగానికి కట్ అయిపోతూ ఉంటారు. ఎలాగూ దాని నుంచి తప్పించుకుని.. ఓ స్కూల్ కు వెళ్తుంది. అక్కడ కొంతమంది అమ్మాయిలు మేము నీ ఫ్రెండ్స్ అంటూ వస్తారు. కానీ మిట్సుకా కు మాత్రం అక్కడ ఎవరు తెలియదు.

Tag Movie

కట్ చేస్తే.. అక్కడినుంచి వారంతా కలిసి బయటకు వెళ్లి తిరిగి వస్తారు. వారు తిరిగి వచ్చి చూసేసరికి.. ఆ స్కూల్ లో టీచర్స్ అంతా గన్స్ తీసుకుని స్టూడెంట్స్ ను చంపడానికి వెంటపడుతూ ఉంటారు. మిట్సుకా అక్కడినుంచి కూడా తప్పించుకుని.. బయటపడుతుంది. అక్కడినుంచి ఓ పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది. కట్ చేస్తే అక్కడ ఓ పోలీస్ ఆఫీసర్ మిట్సుకా కు పెళ్లి అంటూ ఓ చర్చిలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పెళ్ళికొడుకు స్థానంలో ఓ బాక్స్ లో నుంచి పంది బయటకు వస్తుంది. దీనితో ఆమె భయపడి అక్కడ ఉన్న వారందరిని చంపి పారిపోతుంది. కట్ చేస్తే ఆమె రూపం మళ్ళీ మారిపోతుంది.

ఆమె అక్కడ నుంచి ఓ చీకటి ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది. అసలు ఆమెకు ఏమైంది? ఎందుకు అన్ని రూపాలు మారుస్తుంది ? అసలు కథ ఏమై ఉంటుంది ? వినడానికి కాస్త కంఫ్యూజింగ్ గా అనిపించినా కూడా.. సినిమా చివరి వరకు చూస్తే మాత్రం ఓ క్లారిటీ వస్తుంది. ఇవన్నీ తెలియాలంటే “ట్యాగ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. అయితే ఈ పేరుతో చాలానే సినిమాలు వచ్చాయి. ఇది 2015 లో వచ్చిన సినిమా. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరు చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చూడండి..  కంటికి కనిపించని శత్రువుతో పోరాటం .. OTT లో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్