iDreamPost
android-app
ios-app

OTT Suggestion: కంటికి కనిపించని శత్రువుతో పోరాటం .. OTT లో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్

  • Published Jul 08, 2024 | 3:39 PM Updated Updated Jul 08, 2024 | 3:39 PM

OTT Best Sci-Fi Thriller Series : హర్రర్ , సస్పెన్స్ , కామెడీ సినిమాలతో పాటు.. సైన్స్ ఫిక్షన్ సినిమాలకు కూడా ప్రేక్షకులు ఈ మధ్య ఎక్కువగానే చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను మీరు చూసారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Sci-Fi Thriller Series : హర్రర్ , సస్పెన్స్ , కామెడీ సినిమాలతో పాటు.. సైన్స్ ఫిక్షన్ సినిమాలకు కూడా ప్రేక్షకులు ఈ మధ్య ఎక్కువగానే చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను మీరు చూసారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 08, 2024 | 3:39 PMUpdated Jul 08, 2024 | 3:39 PM
OTT Suggestion: కంటికి కనిపించని శత్రువుతో పోరాటం .. OTT లో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్

ఓటీటీ లో చాలా సినిమాలు , సిరీస్ లు చాలానే రిలీజ్ అవుతూ ఉన్నాయి. కానీ, ప్రతి వారం రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు.. ఇంకా ఏమన్నా ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ ఓటీటీ లో ఉన్నాయేమో అని సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. అటువంటి వారికోసమే ఈ మూవీ సజ్జెషన్. ఇక ఈ మధ్య కాలంలో టెక్నాలజీ గురించి ఎక్కువ తెలుసుకోవాలని అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే సైన్స్ ఫిక్షన్ సినిమాలపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హర్రర్ , సస్పెన్స్ , కామెడీ సినిమాలతో పాటు సైన్స్ ఫిక్షన్ సినిమాలకు కూడా ఇప్పుడు బాగా క్రేజ్ పెరిగింది. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా ఇలాంటిదే. మరి ఈ సిరీస్ ను మీరు చూశారో లేదో.. ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సిరీస్ పేరు “అండర్ ది డోమ్” . ఈ సిరీస్ మొత్తం మూడు సీజన్స్ ఉంది. మూడు సీజన్స్ కలిపి 39 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ సిరీస్ మొదటి సీజన్ గురించి చెప్పుకుందాం. ఈ సిరీస్ కథేంటంటే.. ఈ సిరీస్ లో బార్బీ అనే ఓ వ్యక్తిని చూపిస్తారు. అతను ఓ అడవిలో ఓ మనిషి డెడ్ బాడీని పాతి పెడుతూ కనిపిస్తాడు. అతని ఒంటిపై కూడా చాలానే గాయాలు ఉంటాయి. అతను ఆ డెడ్ బాడీని పాతి పెట్టేసి.. చెస్టర్స్ మిల్ అనే టౌన్ కు వెళ్తాడు. ఈ క్రమంలో అతను ఓ యాక్సిడెంట్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ టౌన్ లో భూకంపం వస్తుంది. అప్పుడు ఎదో గుర్తుతెలియని ఓ ఆబ్జెక్ట్ ఆకాశం నుంచి భూమి మీదకు వస్తుంది. అది వచ్చిన కాసేపటికే భూకంపం తగ్గిపోతుంది. అయితే ఆ ఇన్విజిబుల్ ఆబ్జెక్ట్ కారణంగా ఆ ఊరికి టౌన్ లో శాటిలైట్ సిగ్నల్స్ తో సహా అన్ని పోతాయి. అది డోమ్ అని కాసేపటికి అందరు గుర్తిస్తారు. డోమ్ కు బయట ఉన్న వారు మాత్రమే సేఫ్ గా ఉంటారు. దీనితో పోలీసులు అక్కడ ఎమెర్జెన్సీ ఎలెర్ట్ ను ప్రకటిస్తారు.

Under the Dome

ఇక మరోవైపు.. జూనియర్ , యాంజి అనే ఇద్దరు లవర్స్ ను చూపిస్తారు. వీరిద్దరికి ఎదో గొడవ జరిగి విడిపోతారు. ఇక్కడే మరొక క్యారెక్టర్ ను చూపిస్తారు. నోరే అనే అమ్మాయి.. తన ఇద్దరు అమ్మలతో కలిసి చెస్టర్స్ మిల్ చూసేందుకు వస్తుంది. కానీ అక్కడ ఎమెర్జెన్సీ ఎలెర్ట్ ప్రకటించినట్లు ఆమెకు అక్కడకు వచ్చే వరకు తెలియదు. దీనితో అక్కడ జరుగుతున్న సంఘటనలు చూసి ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. మరోవైపు టౌన్ లోపల యాంజి.. బార్బీతో ప్రేమలో పడుతుంది. దీనితో జూనియర్ బార్బీ కి వార్నింగ్ ఇస్తాడు . అయితే అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కేవలం ఆ టౌన్ మేయర్ కు మాత్రమే తెలుసు. కానీ ఎవరికీ చెప్పడు.

అసలు ఆకాశం నుంచి ఊడిపడిన ఆ డోమ్ ఏంటి ? అక్కడికి ఎలా వచ్చింది ? ఎలా వచ్చింది ? మరి కొంతమంది మాత్రం ఇవేం పట్టనట్లు అక్కడ పార్టీ చేసుకుంటూ ఉంటారు. వాళ్లంతా ఎందుకు అలా బెహేవ్ చేస్తారు ! ఆ టౌన్ మేయర్ ఎందుకు ఎవరికీ ఏమి చెప్పడు ? అసలు బార్బీకి దీనికి సంబంధం ఏంటి ? అసలు ఈ కథ ఏంటి ? తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను చూడకపోతే మాత్రం.. వెంటనే అన్ని సీజన్స్ ను చూసేయండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సిరీస్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Jojobet GirişBetcioivermectin tabletpokerklaspokerklaspokerklasmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş