iDreamPost
android-app
ios-app

OTTలో గోట్ లైఫ్ రేంజ్ మూవీ.. ఒంటె కోసం ప్రాణాలు పణంగా పెట్టి!

OTT Suggestions- Goat Life Like Dear Sara Movie: మీకు పృథ్వీరాజ్ సుకుమారన్ గోట్ లైఫ్ సినిమా నచ్చిందా? అయితే ఈ మూవీ మీకు అంతకు మించి నచ్చుతుంది. పైగా మీరు ఈ చిత్రాన్ని ఫ్రీగానే చూడచ్చు. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

OTT Suggestions- Goat Life Like Dear Sara Movie: మీకు పృథ్వీరాజ్ సుకుమారన్ గోట్ లైఫ్ సినిమా నచ్చిందా? అయితే ఈ మూవీ మీకు అంతకు మించి నచ్చుతుంది. పైగా మీరు ఈ చిత్రాన్ని ఫ్రీగానే చూడచ్చు. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

OTTలో గోట్ లైఫ్ రేంజ్ మూవీ.. ఒంటె కోసం ప్రాణాలు పణంగా పెట్టి!

సాధారణంగా సినిమాలు అంటే యాక్షన్, థ్రిల్లర్, లవ్ స్టోరీలు, సస్పెన్స్ డ్రామాలు చూస్తారు. కానీ, సరైన కథతో వచ్చిన ఒక సర్వైవల్ డ్రామా చూస్తే ఆ కిక్కు నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. అలాంటి ఒక సినిమా ఆడు జీవితం. ఈ మూవీ వచ్చిన తర్వాత సినిమా ప్రేక్షకులు అంతా పిచ్చెక్కిపోయారు. ఒక మనిషి జీవితంలో ఇంత కష్టాన్ని ఎలా భరించాడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమాలో సాంగ్స్, ఫైట్స్, లేనిపోని రొమ్యా*న్స్ అవసరమే లేదు. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకపోయినా కూడా కథ ఉంటే ఆడుతుంది అని నిరూపించిన చిత్రం ఇది. ఇలాంటి ఒక తరహాలోనే ఇంకో సినిమా ఉందని మీకు తెలుసా? అది కూడా మీరు ఫ్రీగానే చూసేయచ్చు.

ఆడు జీవితం సినిమాలో పృథ్వీరాజ్ సౌదీ వెళ్లి గొర్రెలకాపరిగా ఎడారిలో బిక్కు బిక్కు మంటూ జీవిస్తూ ఉంటాడు. అలాంటి ప్రాంతంలో మరో మనిషి ఉండడు. తన బతుకు కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో కూడా దాదాపుగా అదే తరహా కథ ఉంటుంది. కానీ, ఇందులో ఒక ఒంటె ప్రాణాల కోసం హీరో పోరాడుతూ ఉంటాడు. చిన్న ఒంటెను తీసుకొచ్చి ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. దానికి సారా అని పేరు కూడా పెట్టుకుంటారు. అది వారి ఇంట్లో ఒక సభ్యురాలిగా మారిపోతుంది. అయితే ఎడారుల్లో పెరిగే ఒంటెకు వీళ్ల ప్రాంతంలో ఉండే వాతావరణం, గడ్డి అస్సలు పట్టదు. అది కాస్త ఎత్తు పెరిగిన తర్వాత తీవ్రమైన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.

వైద్యుడు చూసి ఆ ఒంటెకు అక్కడి ఆహారం పడటం లేదు అని చెప్తాడు. అది ప్రాణాలతో ఉండాలి అంటే కచ్చితంగా ఎడారిలో ఉండాల్సిందే అంటూ చెప్పుకొస్తారు. అయితే దానిని తానే స్వయంగా తీసుకెళ్లి రాజస్థాన్ లో వదిలి వస్తాను అంటూ వెళ్తాడు. సారాని ఒక బండిలో ఎక్కించుకుని ప్రయాణం ప్రారంభిస్తాడు. అయితే అతనికి అస్సలు అదృష్టం కలిసి రాదు. అతను ఆ ఒంటెను కబేళాకు తీసుకెళ్తున్నాడు అనుకుంటారు. వేరే రాష్ట్రంలో కొందరు జీవ హింసను నిరసిస్తూ అన్ని వాహనాలు చెక్ చేస్తూ అడ్డగిస్తూ ఉంటారు. వారి నుంచి తప్పించుకున్నాడా? అసలు ఆ ఒంటెను రాజస్థాన్ తీసుకెళ్లాడా? అసలు వాళ్లిద్దరూ ప్రాణాలతో ఉన్నారా? ఒంటే కోసం అతను అంత రిస్క్ తీసుకున్నాడా? అసలు సారాని వదిలి రాగలిగాడా? ఇలాంటి చాలానే ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానం కావాలి అంటే మీరు ఈ డియర్ సారా సినిమా చూడాల్సిందే. ఈ మూవీని యూట్యూబ్ లో ఫ్రీగానే చూసేయచ్చు. ఎంతో ఎమోషనల్ గా సాగే సర్వైవల్ డ్రామా ఇది. మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.