iDreamPost
android-app
ios-app

నవ్విస్తూనే నోరెళ్లబెట్టేలా చేసే యాక్షన్ డ్రామా.. OTTలో ఉంది ఇంకా చూడలేదా?

OTT Suggestions- Best Fantasy Series One Piece: ఓటీటీలో ఒక మంచి సిరీస్ చూడాలి అని మీరు అనుకుంటున్నారా? మంచి కాదు.. అద్భుతమైన వెబ్ సిరీస్ ని తీసుకొచ్చాం. ఇది స్టార్ట్ చేస్తే ఆపడం మాత్రం కష్టమనే చెప్పాలి.

OTT Suggestions- Best Fantasy Series One Piece: ఓటీటీలో ఒక మంచి సిరీస్ చూడాలి అని మీరు అనుకుంటున్నారా? మంచి కాదు.. అద్భుతమైన వెబ్ సిరీస్ ని తీసుకొచ్చాం. ఇది స్టార్ట్ చేస్తే ఆపడం మాత్రం కష్టమనే చెప్పాలి.

నవ్విస్తూనే నోరెళ్లబెట్టేలా చేసే యాక్షన్ డ్రామా.. OTTలో ఉంది ఇంకా చూడలేదా?

యాక్షన్ సినిమాలు అంటే అందరికీ ఇష్టమే. అయితే అందులోనూ ఫుల్ ఆఫ్ యాక్షన్ తో వెబ్ సిరీస్ అయితే.. అబ్బో ఆ ఫీల్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఆ యాక్షన్ వెబ్ సిరీస్ లో ఫాంటసీ, సూపర్ న్యాచురల్ పవర్స్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకో.. ఇంక ఫుల్ మీల్స్ అని చెప్పాల్సిందే. అలాంటి ఒక ఫుల్ మీల్స్ లాంటి ఒక వెబ్ సిరీస్ ని మీకోసం తీసుకొచ్చాం. ఈ వెబ్ సిరీస్ అలా ఇలా ఉండదు. ఆ మాట మేము చెప్పడం లేదు. ఐఎండీబీలో 1.57 లక్షల మంది ఏకంగా 8.3 రేటింగ్ ఇచ్చేశారు. అంటే ఏ రేంజ్ లో ఉంటుందో.. మీరే అర్థం చేసుకోండి. బాగా ఫ్రీగా ఉన్నప్పుడే దీనిని చూడటం స్టార్ట్ చేయండి. అంటే స్టార్ట్ చేశాక మళ్లీ ఆపాలి అనిపించదు.

ఈ వెబ్ సిరీస్ గురించి మరీ ఎక్కువ పొగిడేస్తున్నాం అని అనుకోవద్దు. ఎందుకంటే కంటెంట్ లో విషయం ఉంది కాబట్టే.. ఈ రేంజ్ ఎలివేషన్స్ ఇస్తున్నాం. ఈ మూవీ మొత్తం ఒక కుర్రాడి కల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతను ఒక యంగ్ పైరెట్ కెప్టెన్. అతనికి ఒక క్రూ ఉంటుంది. ఆ సిబ్బందితో కలిసి తన కల సాధన కోసం బయలుదేరతాడు. ఒక గొప్ప పైరెట్ కింగ్ కావాలి అనేది అతని కోరిక. అందుకోసం సముద్రంలో తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడు. అయితే అతనికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తాను ఒక గొప్ప పైరెట్ కింగ్ కావడానికి ఒక నిధిని సొంతం చేసుకోవాలి అనుకుంటాడు.

ఈ సిరీస్ మొత్తం ఆ నిధి వేట చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వీళ్ల షిప్ పై కొందరు దాడులు చేస్తూ ఉంటారు. వాటి నుంచి తప్పించుకోవడం, వారిపై విజయం సాధించడం కోసం ప్రయత్నాలు చేయడం ఇలా కథ మొత్తం ఆసక్తిగా సాగుతుంది. అలాగే హీరోకే కాకుండా.. వాళ్ల క్రూ మెంబర్స్ కి కూడా కొన్ని శక్తులు ఉంటాయి. హీరో అయితే రబ్బర్ తో చేసిన వ్యక్తిలా ఉంటాడు. అలాగే వీళ్లకి ఎదురయ్యే శత్రువులు కూడా అంతే వింత శక్తులు, వింత ఆకారాలతో ఉంటారు. వారిపై విజయం సాధించడం కోసం హీరో టీమ్ చాలానే కష్టాలు పడాల్సి వస్తుంది. ఆఖరికి విజయం సాధించారా? అసలు ఆ నిధి ఏంటి? ఎందుకు అసలు హీరో పైరెట్ కింగ్ కావాలి అనుకున్నాడు? అనే విషయాలు తెలియాలి అంటే మీరు ఈ “వన్ పీస్” అనే సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.