Tirupathi Rao
OTT Suggestions- Best Cop Thriller The Departed Movie: ఒక మంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్ డ్రామా కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? అయితే మీరు ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే. కావాల్సినంత యాక్షన్ తో పాటుగా.. మంచి ట్విస్టులు కూడా ఉంటాయి.
OTT Suggestions- Best Cop Thriller The Departed Movie: ఒక మంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్ డ్రామా కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? అయితే మీరు ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే. కావాల్సినంత యాక్షన్ తో పాటుగా.. మంచి ట్విస్టులు కూడా ఉంటాయి.
Tirupathi Rao
పోలీస్ స్టోరీలు అంటే చాలా మందికి ఒక ఎమోషన్ అనే చెప్పాలి. ఆ సినిమాల్లో ఉండే ఇన్వెస్టిగేషన్, యాక్షన్ అందరికీ తెగ నచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఒక్కో సీన్ కి వచ్చే ట్విస్టులకు పిచ్చెక్కిపోవాల్సిందే. అయితే మీరు ఆ రేంజ్ కాప్ స్టోరీ చూసి నిజంగానే చాలా రోజులు అయి ఉంటుంది. అలాగే అలాంటి ఒక మూవీ వచ్చి కూడా కొన్నేళ్లు అవుతోంది. అయితే మీరు గనుక పోలీస్ స్టోరీస్ లవర్స్ అయితే మీకోసం ఒక బెస్ట్ కాప్ యాక్షన్ డ్రామా తీసుకొచ్చాం. మీరు నిజంగా ఈ మూవీలో ప్రతి సీన్ ని, ప్రతి ట్విస్టుని ఎంజాయ్ చేస్తారు. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఇంతకీ నిజంగానే అన్ని ట్విస్టులు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకుందాం.
పోలీస్ స్టోరీస్ లో ఒక ట్విస్టు, ఒక డ్రామా క్రియేట్ చేయాలి అంటే అందులో కచ్చితంగా అండర్ కవర్ ఆపరేషన్ ఉండాలి. అలాగే ఒక గ్యాంగ్ ఉండాలి. అంతేకాకుండా.. పోలీసుల్లో కూడా ఒక కరప్టెడ్ కాప్ ఉండాలి. అచ్చం మన పోకిరీ సినిమాలోలాగా. ఇది కూడా మీకు అచ్చు అలాంటి ఒక ఫీల్ నే ఇస్తుంది. ఇందులో మన హీరో లియోనార్డో డికాప్రియో ఒక అండర్ కవర్ పోలీస్. అతను సౌత్ బోస్టన్ లో ఒక ఐరిష్ గ్యాంగ్ తో చేతులు కలుపుతాడు. అతను ఆ గ్యాంగ్ లో కలవడానికి కారణం.. వాళ్లని అన్నీ ఆధారాలతో చట్టం ముందుకు తీసుకురావడమే. అందుకోసం హీరో చాలానే కష్టపడతాడు. ఆ గ్యాంగ్ వద్ద మంచి మార్కులు కొట్టేయాడనికి కొన్ని క్రైమ్స్ కూడా చేస్తాడు. కొన్ని రోజులకు హీరో గ్యాంగ్ స్టర్ అయ్యాడేమో అనే భయం కలుగుతుంది.
సినిమా ఇలాగే వెళ్తే రొటీన్ అవుతుంది కదా. అందుకే పోలీసుల్లో కూడా ఒక తప్పుడు ఆఫీసర్ ఉంటాడు. అతను ఆ ఐరిష్ గ్యాంగ్ కోసం పని చేస్తూ ఉంటాడు. అతను ఈ గ్యాంగుకు అన్నీ వివరాలు ఇస్తూ ఉంటాడు. అలాగే గ్యాంగ్ లో ఒక అండర్ కవర్ పోలీస్ ఉన్నాడు అని కూడా చెబుతాడు. ఆ విషయాన్ని గ్యాంగ్ హెడ్ మన హీరో అయిన అండర్ కవర్ కాప్ తోనే చెప్తాడు. ఆ విషయం విన్న తర్వాత పోలీసు డిపార్ట్మెంట్లో ఒక బ్లాక్ షీప్ ఉందని హీరో తెలుసుకుంటాడు. ఇంకేముంది.. అందరూ ఒకరిని పట్టుకోవడానికి ఒకరు పోటీ పడుతూ ఉంటారు.
అవినీతి పోలీసు.. అండర్ కవర్ కాప్ ని పట్టించాలి అని ప్రయత్నాలు మొదలు పెడతాడు. మన హీరోనేమో.. అవినీతి పోలీసు ఎవరో కనుక్కోవాలి అని పోరాడుతూ ఉంటాడు. ఇలా ఈ సినిమాలో చాలానే ట్విస్టులు, యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఐఎండీబీలో 14 లక్షల మంది ఏకంగా 8.5/10 రేటింగ్ ఇచ్చారు. ఈ మూవీ పేరు “ది డిపార్టెడ్”. ఈ సినిమాని యూట్యూబ్ లో రెంట్ కు అందుబాటులో ఉంది. అదే ఉచితంగా కావాలి అంటే ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో చూడచ్చు. మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.