iDreamPost
android-app
ios-app

మరికొన్ని గంటల్లో OTTలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడచ్చంటే?

OTT New Releases- Prithviraj Sukumaran The Goat Life: పృథ్వీరాజ్ సుకుమారన్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా ఉన్న ది గోట్ లైఫ్ ఏకంగా 113 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇంకా కేవలం కొన్ని గంటల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది.

OTT New Releases- Prithviraj Sukumaran The Goat Life: పృథ్వీరాజ్ సుకుమారన్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా ఉన్న ది గోట్ లైఫ్ ఏకంగా 113 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇంకా కేవలం కొన్ని గంటల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది.

మరికొన్ని గంటల్లో OTTలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడచ్చంటే?

ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు వస్తూనే ఉన్నాయి.. వస్తూనే ఉంటాయి కూడా. అయితే కొన్ని సినిమాలను మాత్రం అస్సలు మిస్ కాకూడనివి ఉంటాయి. మీరు థియేటర్లో చూసినా కూడా మరోసారి ఓటీటీలో కూడా చూడాలి అని ఫిక్స్ అవుతూ ఉంటారు. అలాంటి మూవీనే ఆడు జీవితం (గోట్ లైఫ్) మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పృథ్విరాజ్ సుకుమారన్ యాక్టింగ్ స్కిల్స్ కి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. అతడిని నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కించిన చిత్రం ఇది. ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు కూడా.

ఆడు జీవితం అనే సినిమాకి వరల్డ్ వైడ్ గా మంచి అప్లాజ్ లభించింది. ఇది రియల్ లైఫ్ స్టోరీ కావడంతో మరింత మంది కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాని ఆడుజీవితం అనే 2008నాటి బెంజిమన్ రాసిన మలయాళం పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. ఆ పుస్తకాన్ని నజీబ్ అనే ఒక మలాయళీ ఇమిగ్రెంట్ జీవితం ఆధారంగా రాశారు. అతను నిజ జీవితంలో ఒక వలస కూలీగా సౌదీకి వెళ్లి ఎన్ని కష్టాలు పడ్డాడు? అతని జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి? గొర్రెల కాపరిగా తాను, తన జీవితం ఎలా సాగింది అనే పాయింట్ మీద ఈ సినిమా నిర్మించారు. ఇప్పటికీ చాలా మంది ఇలాంటి వలస కూలీగా వెళ్తూనే ఉన్నారు. అక్కడ ఎలాంటి ఉద్యోగం ఉంటుంది? ఎంత జీతం ఇస్తారు? ఇవేమీ వారికి తెలియదు. కేవలం ఏజెన్సీలు చెప్పే మాటలు నమ్మి జీవితాలను కష్టాల పాలు చేసుకుంటున్నారు. తాజాగా ఒక తెలుగు వ్యక్తి కువైట్ లో నరక యాతన పడుతున్నా అంటూ వీడియో పెడితే.. అతడిని స్వగ్రామానికి తీసుకొచ్చారు.

ఈ ఆడు జీవితం సినిమాలో హీరోకి ఇలా హెల్ప్ చేసే వాళ్లు కూడా ఉండరు. ఎన్నిసార్లు తప్పించుకోవాలని ప్రయత్నించినా ప్రతిసారి తీసుకొచ్చి అక్కడే పడేసేవాళ్లు. తింటానికి తిండి ఉండదు. తాగడానికి నీళ్లు ఉండవు. కొన్నాళ్లకు అతను కూడా గొర్రెల మాదిరిగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇలాంటి ఒక ఛాలెంజింగ్ పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ ఎంతో అద్భుతంగా నటించాడు. క్యారెక్టర్ కోసం కొన్నిరోజుల పాటు ఏమీ తినకుండా ఉపవాసం కూడా ఉన్నాడు. ఆకలితో అలమటిస్తూ ఉండే సీన్ చేయడానికి పృథ్వీరాజ్ నిజంగానే ఏం తినకుండా కేవలం లిక్విడ్స్ తీసుకుంటూ ఉన్నాడంట. అందుకే ఆ మూవీ అంత హిట్ అయ్యింది. ఈ సినిమా జులై 19 నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అంటే జులై 18 అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. మరి.. మీరు ఈ ది గోట్ లైఫ్ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.