iDreamPost
android-app
ios-app

ఫోన్ యూజ్ చేస్తే సైకో కిల్లర్ చేతిలో చావే! OTT లో వణుకుపుట్టిస్తున్న మూవీ!

  • Published Jul 29, 2024 | 6:40 PM Updated Updated Jul 29, 2024 | 6:40 PM

OTT Psycho Killer Movie: సీరియల్ కిల్లర్ , సైబర్ క్రైమ్ ఈ రెండు ప్లాట్స్ మిక్స్ అయ్యి ఉన్న సినిమా ఇది. ఈ సినిమా చూస్తే మొబైల్ ఫోన్స్ వాడాలంటేనే భయపడతు ఉంటారు. అసలు ఈ సినిమా ఏంటి.. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

OTT Psycho Killer Movie: సీరియల్ కిల్లర్ , సైబర్ క్రైమ్ ఈ రెండు ప్లాట్స్ మిక్స్ అయ్యి ఉన్న సినిమా ఇది. ఈ సినిమా చూస్తే మొబైల్ ఫోన్స్ వాడాలంటేనే భయపడతు ఉంటారు. అసలు ఈ సినిమా ఏంటి.. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

  • Published Jul 29, 2024 | 6:40 PMUpdated Jul 29, 2024 | 6:40 PM
ఫోన్ యూజ్ చేస్తే సైకో కిల్లర్ చేతిలో చావే! OTT లో వణుకుపుట్టిస్తున్న మూవీ!

ప్రస్తుతం ప్రతి ఒక్కరు టెక్నాలజీతో రోజు కనెక్ట్ అయ్యే ఉంటున్నారు. నిత్యం సోషల్ మీడియాలో వారికి సంబంధించిన పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే అదే వారి ప్రాణాలకు అపాయం కలిగేలా చేస్తే! ఓ సీరియల్ కిల్లర్ ఇలాంటి వారిని టార్గెట్ చేస్తే! ఇప్పడు చెప్పుకోబోయే మూవీ ఇలాంటిదే. సీరియల్ కిల్లర్ , సైబర్ క్రైమ్ ఈ రెండు ప్లాట్స్ మిక్స్ అయ్యి ఒకే కథలో చూపిస్తే.. ఇంకా ఆ సినిమా నెక్ట్ లెవెల్ లో ఉంటుంది. మరి ఈ సినిమా ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి .

ఈ సినిమా కథ విషయానికొస్తే.. లినామి అనే మహిళ ఉదయం లేచిన దగ్గర నుంచి.. పడుకునే వరకు ఫోన్ తోనే కాలం గడిపేస్తుంది. తానూ ఏం చేస్తుంది.. ఎక్కడికి వెళ్ళింది .. ఎవరిని కలిసింది.. ఇలా ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీనితో తనకు సంబంధించిన ప్రతి విషయం అందరికి తెలుస్తుంది. ఈ క్రమంలో ఓరోజు ఆమె తన ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళి తిరిగి వస్తుండగా .. బస్సులో మొబైల్ మర్చిపోతుంది. ఆ ఫోన్ కాస్త సైకో కిల్లర్ కు దొరుకుతుంది. ఆ తర్వాత రోజు.. లినామి ఫ్రెండ్ ఆ మొబైల్ కు కాల్ చేస్తుంది. అప్పుడు ఈ సైకో కిల్లర్ అమ్మాయి గొంతులా మార్చి తనకు ఆ ఫోన్ బస్సులో దొరికిందని చెప్తాడు. వెంటనే ఈ విషయం లినామి కు చెప్తే ఆమె.. అతనిని దగ్గరలోని ఓ రెస్టారెంట్ కు తన ఫోన్ తీసుకురమ్మని చెప్తుంది. ఈలోపే సైకో కిల్లర్ ఆ ఫోన్ ను అన్ లాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది రాకపోవడంతో.. వెంటనే ఆ ఫోన్ ను పగలగొట్టేస్తాడు.

కట్ చేస్తే ఇక్కడ మరొక సీన్ ను చూపిస్తారు.. నగరంలో అక్కడక్కడ హత్యలు జరుగుతూ ఉంటాయి. అక్కడ కొండపైన ఓ మహిళ ఫింగర్స్ కట్ చేసి ముక్కలుగా పడేసిన మహిళ డెడ్ బాడీ కనిపిస్తుంది. అయితే ఆ కేసును సాల్వ్ చేసే ఆఫీసర్ వూజీ కి అక్కడ మొక్కలకు వేసే పురుగుల మందు డబ్బా కనిపిస్తుంది. ఆ డబ్బా పైన ఏడేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయినా అతని కొడుకు పేరు కనిపిస్తుంది. దీనితో ఆ ఆఫీసర్ కు అతని కొడుకుపై అనుమానం స్టార్ట్ అవుతుంది. మరొక వైపు ఆ సైకో కిల్లర్ లీనమి కి ఫిమేల్ వాయిస్ తోనే కాల్ చేసి.. మీ మొబైల్ పగిలిపోయింది.. బాగుచేయించడానికి షాప్ లో ఇచ్చాను వెళ్లి తీసుకోమని చెప్తాడు. లీనమి అక్కడకు వెళ్లేసరికి ఆ సైకో కిల్లర్ అక్కడ ఉంటాడు. మొబైల్ బాగుచేయడానికి పాస్ వర్డ్ కావాలని ఆమెనే అడిగి తెలుసుకుంటాడు. ఆ మొబైల్ లో ఓ సీక్రెట్ చిప్ ఇంస్టాల్ చేసి ఆమెకు ఇచ్చేస్తాడు.

ఇక అప్పటినుంచి ఆమెను ప్రతి సెకండ్ ఫాలో అవుతూనే ఉంటాడు. ఆమె ఏం చేస్తుంది.. ఎక్కడకి వెళ్తుంది.. ఇలా ప్రతిదీ అతనికి తెలిసిపోతుంది. ఇక మరో వైపు వూజీ ఆ కిల్లర్ ను కనిపెట్టే పనిలో ఉంటాడు. తన కొడుకు మీద అనుమానంతో అతని కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇక సీరియల్ కిల్లర్ ఓ బుక్ లో లినామి కి సంబంధించిన విషయాలు నోట్ చేసుకుంటాడు. అసలు ఆ తర్వాత ఏమైంది? ఎందుకు లీనమిని ఆ సైకో కిల్లర్ టార్గెట్ చేస్తాడు ? ఆ నగరంలో హత్యలు చేసేది.. లీనమిని ఫాలో అయ్యేది ఇద్దరు ఒకరేనా ! ఆమె ఫోన్ హ్యాక్ అయిందని ఆమెకు తెలుస్తుందా లేదా ? చివరికి ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే.. “అన్ లాక్డ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి.. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.