iDreamPost
android-app
ios-app

సాఫ్ట్ వేర్ ఆఫీస్ లో దెయ్యాలుంటాయా ! OTT లో విచిత్రమైన హర్రర్ మూవీ

  • Published Jul 27, 2024 | 8:57 PM Updated Updated Jul 27, 2024 | 8:57 PM

OTT Horror Movie : సాధారణంగా హర్రర్ మూవీస్ అంటే.. పెద్ద పెద్ద బూత్ బంగ్లాలు, ఎక్కడో ఊరికి దూరంగా పాడుపడిపోయిన బిల్డింగ్ లలోనే కథలను చూపిస్తూ ఉంటారు. కానీ ఈ మూవీ మాత్రం రొటీన్ కు భిన్నంగా ఓ రెగ్యులర్ ప్లేస్ లోనే దెయ్యలతో భయపెట్టేస్తారు. మరి ఈ మూవీ ఏంటి ఈ మూవీని మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

OTT Horror Movie : సాధారణంగా హర్రర్ మూవీస్ అంటే.. పెద్ద పెద్ద బూత్ బంగ్లాలు, ఎక్కడో ఊరికి దూరంగా పాడుపడిపోయిన బిల్డింగ్ లలోనే కథలను చూపిస్తూ ఉంటారు. కానీ ఈ మూవీ మాత్రం రొటీన్ కు భిన్నంగా ఓ రెగ్యులర్ ప్లేస్ లోనే దెయ్యలతో భయపెట్టేస్తారు. మరి ఈ మూవీ ఏంటి ఈ మూవీని మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

  • Published Jul 27, 2024 | 8:57 PMUpdated Jul 27, 2024 | 8:57 PM
సాఫ్ట్ వేర్ ఆఫీస్ లో దెయ్యాలుంటాయా ! OTT లో విచిత్రమైన హర్రర్ మూవీ

ఒక్కోసారి మూవీ లవర్స్ కు అచ్చం ఓటీటీ లో హర్రర్ మూవీస్ మాత్రమే ఉన్నాయా అని డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ.. కనీసం వారానికి ఓ హర్రర్ మూవీ అయినా రిలీజ్ అవుతూనే ఉంది. దీనితో రెగ్యులర్ కాన్సెప్ట్స్ తో కాకుండా డిఫరెంట్ ప్లాట్స్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. సాధారణంగా హర్రర్ మూవీస్ అంటే.. పెద్ద పెద్ద బూత్ బంగ్లాలు, ఎక్కడో ఊరికి దూరంగా పాడుపడిపోయిన బిల్డింగ్ లలోనే కథలను కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ మూవీ మాత్రం ఇలా రెగ్యులర్ స్క్రీన్ ప్లే తో కాకుండా.. కాస్త డిఫరెంట్ గా రెగ్యులర్ ప్లేస్ లోనే దెయ్యలతో భయపెట్టేస్తారు. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. గురు ప్రసాద్ అనే అతను.. చెన్నైలోని ఓ ఐటీ కంపెనీకి టీమ్ లీడర్ గా ట్రాన్సఫర్ మీద వస్తాడు . ఇక అదే కంపెనీలో హరిణి అనే అమ్మాయి హెచ్ఆర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే ఆల్రెడీ గతంలో వీరిద్దరికి పరిచయం ఉంటుంది . అలాగే వీరిద్దరి మధ్య ఓ పెద్ద గొడవ కూడా అవుతుంది. దీనితో ఒకరిపై ఒకరు కోపంతో , పగతో.. రివెంజ్ తీర్చుకోవాలని చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ రోజు గురు ఇంపార్టెంట్ వర్క్ పని మీద నైట్ వరకు ఆఫీస్ లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అలాగే హరిణి కూడా వేరే వర్క్ వలన.. ఆ సమయం వరకు ఆఫీస్ లో ఉండిపోవాల్సి వస్తుంది. కట్ చేస్తే వారిద్దరూ అనుకోకుండా ఆఫీస్ లిఫ్ట్ లో స్ట్రక్ అయిపోతారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా వారిద్దరికీ అర్ధం కాదు.

ఏవో కొన్ని అదృశ్య శక్తులు వారిని అక్కడ బంధించినట్లుగా అనిపిస్తుంది. లిఫ్ట్ లో వారిద్దరికీ వింత సంఘటనలు ఎదురౌతాయి. ఇక ఇదే ఛాన్స్ అని గురు హరిణిని చంపడానికి కూడా వెనుకాడడు. ఆమెను చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అంతే కాకుండా అదే లిఫ్ట్ లో అంతకుముందే ఆ ఆఫీస్ లో పని చేసే ఓ ఇద్దరు చనిపోతారు. వారికి ఏమైంది అనే విషయాన్నీ బయటకు రానివ్వరు. అసలు అక్కడ ఏం జరుగుతుంది ? వారిని బంధించిన అదృష్ట శక్తులు ఏంటి ? వీరిద్దరూ ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారా లేదా ?చివరికి ఏమైంది ? అనేదే తెలియాలంటే “లిఫ్ట్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş