iDreamPost
android-app
ios-app

వింత జీవులు మనుషుల్లా మారి దాడి చేస్తే!.. OTT లో వెరైటీ సర్వైవల్ థ్రిల్లర్

  • Published Jul 24, 2024 | 12:45 AMUpdated Jul 24, 2024 | 12:45 AM

OTT Best Suspense Thriller : అడవుల్లో తిరిగే వింత జీవుల చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇప్పటివరకు చాలానే చూసి ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Suspense Thriller : అడవుల్లో తిరిగే వింత జీవుల చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇప్పటివరకు చాలానే చూసి ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 24, 2024 | 12:45 AMUpdated Jul 24, 2024 | 12:45 AM
వింత జీవులు మనుషుల్లా మారి దాడి చేస్తే!.. OTT లో వెరైటీ సర్వైవల్ థ్రిల్లర్

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడడానికి కారణం లేకపోలేదు. ఇప్పటివరకు ఓటీటీ లో ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసే ఉంటారు. ఎందుకంటే ఈ సినిమాలు అన్నీ కూడా.. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. మామూలుగానే ప్రతి ఒక్కరికి తమ జీవితాలలో తర్వాత ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఓ సినిమాలో అన్ని ట్విస్ట్ లు సస్పెన్స్ లను చూపిస్తూ ఉంటే.. వాటిని చివరి వరకు చూడకుండా ఎలా వదిలిపెడతారు. ఇక వీటిలో అడవుల్లో తిరిగే వింత జీవుల చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇప్పటివరకు చాలానే చూసి ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే కథ కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే… జాన్ అనే అతను అడవిలో పరిగెడుతూ ఉంటాడు. అతను ఎంత పరిగెత్తినా కానీ అతనికి 108 నెంబర్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దానిని దాటి ముందుకు వెళ్ళలేడు. ఇంతలోనే ఓ వింత క్రియచేర్ అతని దగ్గరకు వచ్చి లాక్కెళ్లిపోతుంది. ఇక్కడ మరొక కథను చూపిస్తూ ఉంటారు. మీనా అనే అమ్మాయి ఓ పెట్ షాప్ లో పని చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ కస్టమర్ కు గోల్డెన్ రిట్రైవర్ డాగ్ ను డెలివర్ చేయమని పంపిస్తాడు ఆమె ఓనర్. దీనితో ఆమె వెళ్తున్న దారిలో ఆమెకు కొన్ని అనుమానాస్పద సంఘటనలు ఎదురౌతాయి. అక్కడ మీనాకు ఓ క్యాబిన్ లో ఓ ముసలావిడ కనిపిస్తుంది. దీనితో భయంతో మీనా ఆ బామ్మా దగ్గరకు వెళ్తుంది. ఆమె నేను రోజు ఇక్కడే ఉంటానని.. రోజు కొన్ని వింత జీవులు నన్ను చూస్తూ ఉంటాయని… వాటిని వాచర్స్ అని అంటూ ఉంటామని.. మీనాకు చెప్తుంది.

ఆ తర్వాత తనతో ఉన్న ఓ కుర్రాడిని మీనాకు పరిచయం చేస్తుంది. అలాగే అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉంటారు. దీనితో అక్కడ ఎదో తేడాగా ఉంది అనుకుని మీనా ఆ తర్వాత రోజు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది. కానీ ఆ బామ్మ తో పాటు ఉన్న కుర్రాడు , మరో అమ్మాయి మీనాను ఆపేస్తారు. వాచర్స్ గురించి చెప్పినా వినకుండా.. మీనా వాచర్స్ ఉండే గోతిలోకి దిగుతుంది. వెంటనే అవి ఆ క్యాబిన్ పై దాడి చేస్తాయి. అప్పటినుంచి మీనా వాచర్స్ ఉన్నాయని నమ్ముతుంది. దీనితో ఆ వాచర్స్ నుంచి తప్పించుకోవడం కోసం వారు పరిశోధనలు మొదలు పెడతారు. వాళ్ళ నలుగురు అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు. అలాగే ఆ వాచర్స్ ను ఎలాగైనా నాశనం చేయాలనీ డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? వాళ్ళు వాచర్స్ నుంచి ఎలా తప్పించుకున్నారు ? అసలు వాచర్స్ ఎలా పుట్టుకొచ్చాయి ? ఇవన్నీ తెలియాలంటే “ది వాచర్స్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. OTT లో బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఒక మూవీ లో ఇన్ని ట్విస్ట్ లా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి