Swetha
OTT Phycho Thriller Movie: ఎప్పటికప్పుడు ఓటీటీ లో వస్తున్న అప్ డేట్స్ ను ఫాలో అవుతూనే.. ఇంకా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఎమున్నాయా అని సెర్చ్ చేస్తుంటారు మూవీ లవర్స్. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్.
OTT Phycho Thriller Movie: ఎప్పటికప్పుడు ఓటీటీ లో వస్తున్న అప్ డేట్స్ ను ఫాలో అవుతూనే.. ఇంకా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఎమున్నాయా అని సెర్చ్ చేస్తుంటారు మూవీ లవర్స్. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్.
Swetha
ప్రతి వారం ఓటీటీ వచ్చే సినిమాలను చూస్తూనే.. ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయేమో అని సెర్చ్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. అటువంటి వారికోసమే ఈ మూవీ సజ్జెషన్స్. ఈ మధ్య కాలంలో ఓటీటీ అప్ డేట్స్ తో పాటు.. ఓటీటీ లో మంచి మంచి సినిమాలు ఏమున్నాయో కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉంది. అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఒకటి. ఇప్పుడు సాధారణంగా బయట అంతా టెక్నాలజీ మీదే నడుస్తున్న సంగతి తెలియనిది కాదు. దానివలన ఎన్నో స్కామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ స్కామ్స్ చేసేవాడే సైకో కిల్లర్ అయితే! ఎలా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కాన్సెప్ట్ కూడా ఇదే. మరి ఈ సినిమా ఏంటో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. సాధారణంగా మనకు అవసరం లేని వస్తువులను.. ఆన్ లైన్ లో సెకండ్ హ్యాండ్ కు అమ్మేస్తూ ఉంటాము. అలాగే ఓ వ్యక్తి మ్యాక్ బుక్ ను సెకండ్ హ్యాండ్ కు యాప్ లో అమ్మకానికి పెడతాడు. అందుకోసం అతనికి మెసేజ్ చేసే వారిలో అబ్బాయిలను వదిలేసి.. అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటాడు. అలా ఆ మ్యాక్ బుక్ పై ఓ అమ్మాయి ఇంట్రెస్ట్ చూపించి.. తన ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్లిన వెంటనే ఆ అమ్మాయిని చంపేసి ఫ్రిడ్జ్ లో పెడతాడు. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ లో.. తన ఇంట్లో ఉండే వస్తువులన్నిటిని అమ్మేస్తాడు. ఈ క్రమంలో.. సూ హ్యూన్ అనే ఒక మహిళకు ఇతను వాషింగ్ మిషన్ అమ్ముతాడు. అలాగే ఆమెకు వాషింగ్ మిషన్ తో పాటు ఇతర వస్తువులను కూడా అమ్ముతాడు. అయితే సూ హ్యూన్ మాత్రం ఆమె వాషింగ్ మిషన్ సరిగా పని చేయకపోడంతో.. ఆ యాప్ లో అతనిపై నెగెటివ్ రివ్యూస్ ఇస్తుంది.
దీనితో ఇంకా ఆ కిల్లర్ సూ హ్యూన్ ను టార్గెట్ చేస్తాడు. సూ హ్యూన్ మాత్రం అతను కిల్లర్ అని తెలియక అతనికి వార్నింగ్ ఇస్తుంది. అయితే ఆ కిల్లర్ మాత్రం ఈమెను అందరిలా కాకుండా.. కాస్త డిఫరెంట్ పైగా ట్రీట్ చేస్తాడు. ఆమె ఇచ్చిన వార్నింగ్స్ ను పట్టించుకోకుండా తన ఇంటికి డైలీ ఫుడ్ ఆర్డర్లు పంపిస్తూ ఉంటాడు. పైగా ఆమెతో ప్రేమగా మాట్లాడి డబ్బులు పంపించమని అడుగుతాడు. అలాగే ఆమె సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ చేసి.. బాయ్ ఫ్రెండ్ కావాలంటూ ఓ పోస్ట్ కూడా పెడతాడు. ఇక అప్పటినుంచి ఆమె జీవితం కష్టంగా మారుతుంది. అసలు ఆ కిల్లర్ ఎవరు ? ఎందుకు అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు ? సూ హ్యూన్ అతని నుంచి తప్పించుకుందా లేదా? ఆ తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే “టార్గెట్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ సినిమా కూడా చూడండి.. సీరియల్ కిల్లర్ సినిమాలు ఇష్టమా? OTTలో ఇంత మంచి మూవీ ఎలా మిస్ అయ్యారు!