Swetha
Must Watch Movie In OTT: కొన్ని సినిమాలను జాగ్రత్తగా ఓపికగా చూస్తే కానీ అర్థంకావు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. మరి ఈ మూవీ ఏంటో ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
Must Watch Movie In OTT: కొన్ని సినిమాలను జాగ్రత్తగా ఓపికగా చూస్తే కానీ అర్థంకావు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. మరి ఈ మూవీ ఏంటో ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
Swetha
అమ్మాయిలు తప్పక చూడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు అమ్మాయిలు చేయని తప్పులకు బలి అవుతూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో.. చూస్తూనే ఉన్నాము. అలాంటి సంఘటనలను ఇప్పటివరకు చాలానే సినిమాలలో చూపించారు. టెక్నాలజీ వలన చాలా మంది జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటి సంఘటనల గురించి డిస్కస్ చేసిందే. అయితే కొన్ని సినిమాలు జాగ్రత్తగా చూస్తే కానీ అర్థంకావు. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. మరి ఈ సినిమా ఏంటి.. ఈ సినిమాను మీరు చూశారా లేదా ? ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే… ఈ మూవీ స్టార్టింగ్ లో షబ్బీర్ అనే ఓ కుర్రాడు బస్సు లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. బస్సు కండెక్టర్ అతనిని ఎక్కడో చూసినట్లు ఉందని చెప్పడంతో వెంటనే అతను బస్సు దిగి పారిపోతాడు. ఇలా ఎక్కడికి వెళ్లినా కానీ వారం రోజులకు మించి ఆ ఊరిలో ఉండడు. అక్కడ ఎవరైనా తనని గుర్తుపడితే.. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా అతను దుర్గా పట్టణం అనే ఊరికి వెళ్తాడు. అక్కడ అతనిని ఎవరు గుర్తుపట్టకపోవడంతో అక్కడే ఎదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ సూజీదార అనే ఓ నాటకం జరుగుతుంది. ఆ నాటకంలో లీలావతి అనే అమ్మాయి మొదటి బహుమతి గెలుచుకుంటుంది. అయితే ఆమెను గణేష్ అనే అతను ప్రేమిస్తూ ఉంటాడు. అయితే లీల ఉండే ఇంటి పక్కనే షబ్బీర్ ఉంటాడు.
కట్ చేస్తే.. అదే ఊరిలో రంగ అనే అతను కూడా నాటకాలు వేస్తూ ఉంటాడు. అతనికి భార్య మీద చాలా అనుమానం.. ఇంట్లో ఉంచి తాళం వేసి మరి బయటకు వస్తాడు. షబ్బీర్ ఇంటి పక్కనే రంగ ఉంటాడు. ఆమె భార్య ఇంట్లో నుంచి షబ్బీర్ ను పలకరిస్తుంది. ఇక కథ ఇలా ముందుకు సాగుతూ ఉండగా.. షబ్బీర్ తో ఆ ఇద్దరు క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ ఊరికి అనుకోకుండా పోలీసులు వస్తారు. అతను ఆ పోలీసులను చూసి భయపడి పారిపోతాడు. అసలు షబ్బీర్ ను ఎందుకు అందరు గుర్తుపడుతున్నారు ? అతని జీవితంలో ఏం జరిగింది ? రంగ భార్యకు షబ్బీర్ కు ఇదివరకే సంబంధం ఉందా ? అసలు కథ ఏమై ఉంటుంది ? ఇవన్నీ తెలియాలంటే “సూజీదారం” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కూడా చూడండి.. వీడియో కాల్స్ లోనే ప్రేమ.. ఆ తర్వాత.. OTTలో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్..!