iDreamPost
android-app
ios-app

ఆ ఊరికి వెళ్లడమే కానీ తిరిగి రావడం కుదరదు. OTT లో ఈ మూవీ ఒంటరిగా చూడలేరు

  • Published Jul 15, 2024 | 3:25 PM Updated Updated Jul 15, 2024 | 3:25 PM

OTT Best Horror Movie : ఓటీటీ లో ఇప్పటివరకు ఇలాంటి సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. కొన్ని సినిమాలు చూడడానికి చాలా భయంకరంగా ఉంటూ ఉంటాయి. కచ్చితంగా ఈ సినిమాను ఒంటరిగా అయితే చూడలేరు. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం .

OTT Best Horror Movie : ఓటీటీ లో ఇప్పటివరకు ఇలాంటి సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. కొన్ని సినిమాలు చూడడానికి చాలా భయంకరంగా ఉంటూ ఉంటాయి. కచ్చితంగా ఈ సినిమాను ఒంటరిగా అయితే చూడలేరు. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం .

  • Published Jul 15, 2024 | 3:25 PMUpdated Jul 15, 2024 | 3:25 PM
ఆ ఊరికి వెళ్లడమే కానీ తిరిగి రావడం కుదరదు. OTT లో ఈ మూవీ ఒంటరిగా చూడలేరు

ఇప్పుడు అందరు.. దాదాపు వాచ్ ఎలోన్ మూవీస్ ను చూస్తున్నారు. ఈ సినిమాలన్నీ కూడా రొ*మాంటిక్ జోనర్ లో ఉంటూ ఉంటాయి. కానీ కొంతమంది హర్రర్ , క్రైమ్ థ్రిల్లెర్స్ లో కూడా ఒంటరిగా చూడడానికి ఇష్టపడుతున్నారు కొందరు. కానీ ఇప్పడు చెప్పుకోబోయే సినిమాను మాత్రం అసలు ఒంటరిగా చూడలేరు. ఇలాంటి సినిమాలు ఓటీటీ లో చాలానే ఉన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం చాలా డిఫరెంట్. ఇప్పటివరకు ఈ సినిమాను మిస్ చేస్తే మాత్రం మంచి హర్రర్ థ్రిల్లర్ ను మిస్ చేసినట్లే. అసలు ఈ సినిమా ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. రోజ్ అనే అమ్మాయి తన కూతురుకు ఉండే ప్రాబ్లమ్ గురించి తెలుసుకోవడానికి.. సైలెంట్ హిల్ అనే ఊరికి వెళ్తుంది. ఆమె కూతురు పేరు షరాన్ , షరాన్ ను రోజ్ దత్తత తీసుకుంటుంది. ఇక ఆమె సైలెంట్ హిల్ కు వెళ్లే దారిలో ఆమె కార్ కు యాక్సిడెంట్ అవ్వడంతో స్పృహ తప్పి పడిపోతుంది. లేచి చూసే సరికి షరాన్ కూడా కనిపించదు. అప్పుడు కానీ అర్ధం కాదు అది ఒక ఘోస్ట్ టౌన్ అని.. మూవీ స్టార్టింగ్ లో రోజ్ ఎక్కడికో వెళ్ళిపోయినా షరాన్ ను వెతుక్కుంటూ.. అరుస్తూ వెళ్తుంది. అప్పుడే షరాన్ ఎదో నదిలో దూకబోతున్నట్లు కనిపిస్తుంది. వెంటనే ఆమెను ఆపుతుంది. షరాన్ ఎప్పుడు కూడా సైలెంట్ హిల్ సైలెంట్ హిల్ అని కలవరిస్తూ ఉంటుంది. అందుకే వారు అక్కడికి బయల్దేరి వెళ్తారు. అయితే వారు దారిలో వెళ్ళేటప్పుడు ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగినప్పుడు.. అక్కడ ఓ పోలీస్ ఆఫీసర్ కు ఆమెపై అనుమానం కలిగి.. ఆమెను ఫాలో చేస్తుంది. ఇక ఆ తర్వాత యాక్సిడెంట్ అవ్వడం, ఆమె స్పృహ తప్పి పడిపోడం జరుగుతాయి.

ఆ తర్వాత రోజ్ ఆ ఊరిలోకి వెళ్తుంది. అక్కడ ఆమెకు విచిత్ర సంఘటనలు ఎదురౌతాయి. చనిపోయిన కొంతమంది వ్యక్తులు , చిన్న పిల్లలు ఇలా అనేక రకాల పరిస్థితులు ఎదురౌతాయి. ఇంతలో ఒక ఆమె అక్కడకు వచ్చి సైలెంట్ హిల్ డోర్స్ క్లోజ్ అయిపోయాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదని చెప్తుంది. దీనితో రోజ్ ఆ అమ్మాయిని షరాన్ కోసం అడుగుతుంది. కానీ ఆమెకు ఏమి ఆన్సర్ రాదు. వెంటనే షరాన్ ఫోటో చూపిస్తే.. ఈమె మీ అమ్మాయి కాదు.. మా అమ్మాయి అని ఆ అమ్మాయి చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత రోజ్ భర్త తన భార్య కూతురు కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. అసలు షరాన్ కు ఏమైంది ? ఎందుకు అక్కడకు వెళ్ళగానే ఆమె మిస్ అయింది ? రోజ్ షరాన్ ను కనిపెట్టింది లేదా ? అసలు ఆ సైలెంట్ హిల్ ఎందుకు అలా అయింది ? దాని వెనుక ఉన్న కథేంటి ? ఆ పోలీస్ ఆఫీసర్ రోజ్ కు హెల్ప్ చేస్తుందా ? ఆ తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే “సైలెంట్ హిల్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేస్ లో అందుబాటులో ఉంది. అలాగే యూట్యూబ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చూడండి.. గోడ చాటున ఉండే దెయ్యం కథ.. OTT లో ఎప్పుడు చూడని హర్రర్ మూవీ