Swetha
Best Horror Movie In OTT: దెయ్యం కథలు ఇప్పటివరకు ఎన్నో చూసి ఉంటారు కానీ ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడు చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటో మీరు ఈ సినిమాను చూసారో లేదో ఓ లుక్ వేసేయండి.
Best Horror Movie In OTT: దెయ్యం కథలు ఇప్పటివరకు ఎన్నో చూసి ఉంటారు కానీ ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడు చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటో మీరు ఈ సినిమాను చూసారో లేదో ఓ లుక్ వేసేయండి.
Swetha
హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టమైతే కనుక.. ఈ సినిమాను మీరు అసలు మిస్ చేసి ఉండరు . ఒకవేళ మిస్ చేస్తే మాత్రం ఓ మంచి హర్రర్ సినిమాను మిస్ చేసినట్లే. అదేంటో కానీ ఎంత గుండె దడ పెంచేసిన కానీ.. వాటినే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఓటీటీ లో ఇప్పటివరకు ఇలాంటి సినిమాలను ఎన్నో చూసి ఉంటారు. కానీ ఇలాంటి సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ వినడానికి రెగ్యులర్ సినిమాలల అనిపించినా కూడా చూడడానికి మాత్రం చాలా డిఫ్ఫరెంట్ గా ఉంటుంది. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
ఈ సినిమా పదేళ్ల కుర్రాడు పీటర్ చుట్టూ తిరుగుతుంది. అతను ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటాడు. అమాయకంగా బెహేవ్ చేస్తూ ఉంటాడు. తానూ నిద్రపోతున్నప్పుడు ఓ గోడ చాటు నుంచి వింత వింత శబ్దాలు వస్తాయి. దానిని వాళ్ళ అమ్మకు చెప్తే.. ఇది పాత ఇల్లు కదా అలానే వస్తుందిలే అని ఎదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తుంది. కానీ ప్రతి రోజు అతను నిద్రపోయే ముందు గోడ చాటు నుంచి అతనిని పీటర్ అని ఎవరో పిలుస్తూ ఉండేవారు. వాళ్ళ డాడీకి చెప్పినా కూడా అలాగే కన్విన్స్ చేస్తాడు. పీటర్ స్కూల్ లో కూడా ఎవరితో కలవకుండా.. ఒంటరిగా ఉంటూ ఉంటాడు. అలాగే స్కూల్ లో ఎవరైనా పీటర్ ను ఏడిపించిన కూడా.. రోజు రాత్రి పూట గోడ చాటు నుంచి.. ఏమైంది అంటూ అతనిని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆ అదృశ్య శక్తే అతనికి దైర్యం చెప్తుంది.
అప్పటినుంచి పీటర్ ధైర్యవంతుడిగా మారి.. అందరిని కొడుతూ ఉంటాడు. దీనితో పీటర్ తండ్రికి కోపం వచ్చి అతనిని స్కూల్ మానిపించేసి.. ఇంటి కింద ఉన్న బేస్మెంట్ గదిలో బంధిస్తాడు. కొన్ని రోజులకు పీటర్ స్కూల్ టీచర్.. పీటర్ ను వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే అక్కడ ఆమెకు కొన్ని కొత్త అనుమానాలు మొదలవుతాయి. పీటర్ ఖచ్చితంగా ఎదో ప్రాబ్లమ్ లో ఉన్నాడని తెలుస్తుంది కానీ .. ఏమి చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దీ రోజులకు పీటర్ ను బేస్మెంట్ నుంచి తన గదికి తీసుకుని వస్తారు.
అక్కడ మళ్ళీ గోడ చాటు నుంచి ఆ అదృశ్య శక్తి.. పీటర్ ను ఇన్ని రోజులు ఏమైపోయావ్ అని ప్రశ్నిస్తుంది. అసలు నువ్వు ఎవరు అని అడిగితే నేను మీ అక్కను.. అమ్మానాన్నలు నన్ను చంపేశారు. నిన్ను కూడా చంపేస్తారు అని చెప్తుంది. అసలు ఆ గోడ వెనుక ఉంది ఎవరు! పీటర్ ఆ అదృశ్య శక్తిని ఎంత వరకు నమ్ముతాడు ! పీటర్ తల్లి దండ్రులు నిజంగా వాళ్ళ కూతురును చంపేస్తారా ! ఆ అదృశ్య శక్తి గోడ చాటు నుంచి బయటకు రాడానికి పీటర్ ను ఏ విధంగా మాయ చేస్తుంది ! అసలు ఆ తర్వాత ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే “కాబ్ వెబ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే.. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.