iDreamPost
android-app
ios-app

OTTని వణికిస్తున్న రియల్ హార్రర్ మూవీ.. ధైర్యం ఉంటేనే చూడండి!

  • Published Jul 19, 2024 | 12:05 AMUpdated Jul 19, 2024 | 12:05 AM

OTT Must Watch Real Horror Movie : అసలు ఓటీటీ లో అచ్చం హర్రర్ సినిమాలే ఉన్నాయా అనే ఫీలింగ్ ఇప్పుడు అందరికి వచ్చేస్తుంది. ఎందుకంటే.. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అన్ని ఈ సినిమాలే ఉన్నాయి. వాటిలో ఈ సినిమాను కానీ మీరు మిస్ చేశారేమో ఓసారి చెక్ చేసేయండి.

OTT Must Watch Real Horror Movie : అసలు ఓటీటీ లో అచ్చం హర్రర్ సినిమాలే ఉన్నాయా అనే ఫీలింగ్ ఇప్పుడు అందరికి వచ్చేస్తుంది. ఎందుకంటే.. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అన్ని ఈ సినిమాలే ఉన్నాయి. వాటిలో ఈ సినిమాను కానీ మీరు మిస్ చేశారేమో ఓసారి చెక్ చేసేయండి.

  • Published Jul 19, 2024 | 12:05 AMUpdated Jul 19, 2024 | 12:05 AM
OTTని వణికిస్తున్న రియల్ హార్రర్ మూవీ.. ధైర్యం ఉంటేనే చూడండి!

ఈ హర్రర్ మూవీస్ లో ఎలాంటి మ్యాజిక్ ఉందో ఏమో తెలియదు కానీ.. ఇప్పుడు ఓటీటీ లో ఎక్కువగా హర్రర్ మూవీస్ నే చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు.. అసలు ఓటీటీ లో అచ్చం హర్రర్ సినిమాలే ఉన్నాయా అనే ఫీలింగ్ కూడా ఒక్కోసారి వచ్చేస్తుంది. చూసిన కొద్దీ తరగని ఎన్నో హర్రర్ సినిమాలు , సిరీస్ లు ఇప్పుడు ఓటీటీ లో సందడి చేస్తున్నాయి. ఇక వీటిలో కొన్ని నిజజీవిత సంఘటనలను ఆధారంగా తీసుకుని రూపొందిస్తు ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఇండోనేషియాలోని ఓ గ్రామంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా రూపొందించారు. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ మూవీని మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. బిమో, శ్రీ అనే భార్య భర్తలు ఉంటారు. వారు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఈ క్రమంలో బిమోకు ఓ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం వస్తుంది. కానీ ఆ ఊరిలో కనీస వసతులు కూడా ఉండవు. అయినా సరే.. జీతం ఎక్కువ ఉండడంతో.. కుటుంబ సమస్యలు తీరిపోతాయని.. అతను ఆ ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక భర్తతో పాటు శ్రీ కూడా ఆ గ్రామానికి వెళ్తుంది. అయితే వారు వెళ్లే దారిలో కార్ లో నుంచి చూస్తే.. వారికి గాలిలో ఎగురుతున్న ఓ తల కనిపిస్తుంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్లి చూస్తే.. అక్కడ ఓ శవపేటిక చెట్టుకు వేలాడుతూ కనిపిస్తుంది. దీనితో వారిద్దరూ భయపడిపోతారు. అక్కడికి వెళ్లిన తర్వాత.. కొంతమంది అది వారి ఊరి ఆచరమని చెప్తారు. అలాగే ఆ ఊరిలో చాలా మంది చేతబడి చేస్తారని కూడా చెప్తారు.

Horror Movie

ఆ ఊరిలోకి సాధారణంగా ఎవరు రారు.. అలాంటిది వీరిద్దరూ వెళ్లడంతో అంత ఆశ్చర్యపోతారు. అక్కడికి వారు వెళ్ళినప్పటినుంచి.. తంబీ అనే ఓ పెద్దావిడ వాళ్ళను గమనిస్తూ ఉంటుంది. ఆమె చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆమె కుయాంగ్ అని అందరు అనుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత రోజు బిమోతో పాటు.. శ్రీ కూడా తనతో స్కూల్ కు వెళ్తుంది. అయితే ఆ స్కూల్ కు ఓ హిస్టరీ ఉంటుంది. ఓ పెద్ద వరద వలన ఒకప్పుడు ఆ స్కూల్ మునిగిపోయి.. కొంతమంది స్టూడెంట్స్ చనిపోయారని.. ఇప్పటికి స్కూల్ లో ఆ పిల్లల ఆత్మలు తిరుగుతున్నాయని.. అంతా నమ్ముతూ ఉంటారు.

కట్ చేస్తే అదే సమయంలో అక్కడ ఓ స్టూడెంట్ కు దెయ్యం పడుతుంది. దీనితో వదిలించడానికి ఓ మంత్రగత్తెను పిలిపిస్తారు. అప్పుడు ఆమె శ్రీ ను చూసి ఆమె ప్రెగ్నెంట్ అని.. తన కడుపులో ఉన్న బిడ్డను కూయంగ్ ఎత్తుకుని వెళ్లాలని ప్రయత్నిస్తుందని చెప్తారు. దీనితో.. బిమో కుయాంగ్ ను చంపేద్దాం అని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శ్రీ ను అతను కాపాడాడా లేదా ? కథ ఎలా ముగిసింది తెలియాలంటే “కుయాంగ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. 

ఇది కూడా చూడండి.. OTT లో మోడ్రన్ దెయ్యం కథ.. ఆ 4రోజులు మగవారిని వేధించే ఆత్మ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి