iDreamPost
android-app
ios-app

OTT లో మోడ్రన్ దెయ్యం కథ.. ఆ 4రోజులు మగవారిని వేధించే ఆత్మ

  • Published Jul 18, 2024 | 3:00 AM Updated Updated Jul 18, 2024 | 3:00 AM

OTT Horror Suspense Thriller: హర్రర్ సినిమాలలో కనిపించే దెయ్యాలన్నీ కూడా ఎప్పుడో జరిగిన సంఘటనల కారణంగా పగతో రగిలిపోతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది స్టోరీ కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు చూసేద్దాం.

OTT Horror Suspense Thriller: హర్రర్ సినిమాలలో కనిపించే దెయ్యాలన్నీ కూడా ఎప్పుడో జరిగిన సంఘటనల కారణంగా పగతో రగిలిపోతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది స్టోరీ కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు చూసేద్దాం.

  • Published Jul 18, 2024 | 3:00 AMUpdated Jul 18, 2024 | 3:00 AM
OTT లో మోడ్రన్ దెయ్యం కథ.. ఆ 4రోజులు మగవారిని వేధించే  ఆత్మ

దెయ్యాలు , ఆత్మలు నిజంగా ఉన్నాయో లేదో తెలియదు కానీ.. కొన్ని సినిమాలు చూస్తే మాత్రం నిజంగానే దెయ్యాలు ఉన్నాయేమో అనే ఫీలింగ్ వస్తుంది. ఇక హర్రర్ సినిమాలల్లో కనిపించే దెయ్యాలన్నీ కూడా ఎప్పుడు జరిగిన సంఘటనల కారణంగా పగతో రగిలిపోతూ.. మళ్ళీ మళ్ళీ దానికి కారణం అయినా వారందరిని టార్గెట్ చేస్తూ ఉంటారు. దాదాపు హర్రర్ రివెంజ్ కథలన్నీ ఇలానే ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ కథ గురించే. ఈ సినిమాలో అయితే దెయ్యం కేవలం మగవారిని మాత్రమే టార్గెట్ చేస్తుంది. అసలు ఏంటి ఈ సినిమా.. ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. వీటి గురించి చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ కథ మొత్తం చండేరీ అనే ఓ విలేజ్ లో జరుగుతుంది. ఈ ఊరిలో విక్కీ అనే ఓ టైలర్ ఉంటాడు. తన అమ్మ చనిపోడంతో .. అతని నాన్న విక్కీని గారాబంగా పెంచుతూ ఉంటాడు . అయితే ఈ ఊరిలో బాగా కోపంతో ఉన్న ఓ స్త్రీ ఆత్మ ఉంటుంది. తాను పండగ సమయంలో మగవారిని వేధిస్తూ ఉంటుంది. అది ఆ ఊరిలో సంవత్సరానికి ఒకసారి 4 రోజుల పాటు ఓ పండగ జరుగుంతుంది. ఆ సమయంలో ఒంటరిగా తిరిగే మగవాళ్ళను ఈ దెయ్యం పట్టుకెళ్లిపోతుంది. దీనితో అక్కడ ప్రతి ఇంటి గోడ మీద ఓ స్త్రీ రేపు రా అని రాస్తూ ఉంటారు. ఇక ఆ ఊరిలో పండుగ సమయం వస్తుంది. దీనితో అందరు భయపడుతూ ఉంటారు. ఇదిలా ఉంటె.. విక్కీ ఆ ఊరిలో రమ్య అనే అమ్మాయి పరిచయం అవుతుంది. మొదటి చూపులోనే ఒకరి మీద ఒకరికి ఇష్టం కలుగుతుంది.

వీరిద్దరి మధ్య బాగా పరిచయం పెరుగుతుంది. అయితే అదే రోజు రాత్రి విక్కీ తన ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కడికో వెళ్తాడు. దీనితో ఆ ఊరిలో ఓ పెద్దాయన ఆ దెయ్యం గురించి హెచ్చరిస్తాడు. అలా ఒంటరిగా బయట తిరగొద్దు అనే చెప్తాడు. అయినా సరే వారు వినకుండా ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆ దెయ్యం ఈ ఫ్రెండ్స్ లో ఒకరిని ఎత్తికెళ్లిపోతుంది. దానిని ఎవరికీ ఎలా చెప్పాలో అర్థంకాదు. ఇక మరోవైపు రమ్య తనకు కావాల్సినవన్నీ విక్కీతో తెప్పించుకుంటుంది. కానీ ఆమె విక్కీకి తప్ప.. ఇంకెవరికి కనిపించదు. దీనితో విక్కీ ఫ్రెండ్స్ కు రమ్యనే దెయ్యం అని అనుమానిస్తారు. విక్కీ కోసం వెతికే ప్రయత్నంలో విక్కీ ఫ్రెండ్స్ ను కూడా ఆ దెయ్యం తీసుకుని వెళ్ళిపోతుంది. అసలు ఆ దెయ్యం ఎవరు ? ఎందుకు మగవారిని మాత్రమే ఆమె టార్గెట్ చేసింది ? మరి విక్కీ ని మాత్రం ఆ దెయ్యం ఎందుకు ఏమి చేయకుండా వదిలేస్తుంది ? దాని వెనుక ఉన్న కథ ఏంటి ? ఆ తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే “స్త్రీ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఇది కూడా చూడండి.. హత్యలు చేసే టీచర్.. OTT లో బెస్ట్ క్రైమ్ మూవీ! వణికిపోతారు!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş