Swetha
OTT Horror Suspense Thriller: హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ జోనర్స్ లో ఒక్కో సినిమా చూస్తే ఒక్కో కొత్త కాన్సెప్ట్ తెలుస్తూ ఉంటుంది. ఈ సినిమా చూస్తే మాత్రం అసలు శాపాలు ఉంటాయా.. ఉంటె ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఇలాంటి ఎన్నో డౌట్స్ వస్తాయి. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
OTT Horror Suspense Thriller: హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ జోనర్స్ లో ఒక్కో సినిమా చూస్తే ఒక్కో కొత్త కాన్సెప్ట్ తెలుస్తూ ఉంటుంది. ఈ సినిమా చూస్తే మాత్రం అసలు శాపాలు ఉంటాయా.. ఉంటె ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఇలాంటి ఎన్నో డౌట్స్ వస్తాయి. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
Swetha
దాదాపు హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల కాన్సెప్ట్స్ అన్నీ ఒకటే అయినా కూడా.. ప్రేక్షకులను చివరి వరకు ఎంగేజ్ చేస్తూ.. ఉంచారా లేదా అనే దానిపైనే మూవీ బజ్ ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. ఎందుకంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది అని అర్ధం చేసుకునే లోపే.. మైండ్ లో ఇంకొక ప్రశ్న మెదిలేలా చేసి.. అలా చివరి వరకు సస్పెన్స్ ఎలిమెంట్స్ తో మూవీ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే… మూవీ స్టార్టింగ్ లో తన నానమ్మను ఓ చిన్న పిల్లవాడు కథ చెప్పమని అడుగుతాడు. ఇక వాళ్ళ నానమ్మ కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. చాలా సంవత్సరాల క్రితం దేవ లోకానికి చెందిన దేవత భూలోకాన్ని చూడాలని అనుకుని.. వస్తుంది. భూలోకం బాగా నచ్చడంతో.. భూమి మీద ఒక అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అలా వారిద్దరికీ చాలా మంది పిల్లలు కూడా పుడతారు. కానీ ఆ పిల్లలు మనిషి రూపంలో, దైవ రూపంలో కాకుండా విచిత్రమైన రూపంలో జన్మిస్తారు. ఇక వారిలో వారు గొడవ పడుతూ వారికి ఉన్న శక్తుల వలన భూమి మీద అనేక రకాల విధ్వంసాలు సృష్టిస్తారు. దీనితో వారి వలన భూమి మీద మనుషులకు నష్టం కలుగుతుందని.. కన్నబిడ్డలని కూడా చూడకుండా వారిని శపిస్తుంది. వారిని పాతాళలోకంలోనూ, దండకారణ్యంలోను జీవించమని ఆమె దేవలోకానికి వెళ్ళిపోతుంది. కొన్నేళ్ళకు మనుషులు వీళ్ళను పూజించడం మొదలు పెడతారు. ఇలా అప్పటినుంచి ఆ గ్రామం వినాశనానికి గురి అవుతుంది. ఆ గ్రామంలో ఉన్న వారంతా కూడా శపించబడతారు.
కట్ చేస్తే కథను 12 ఏళ్ళ తర్వాత చూపిస్తారు. ఇక్కడ హీరోయిన్ కుమారి.. అదే గ్రామానికి చెందిన ధృవన్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుని.. అదే ఊరికి వెళ్తుంది. దారిలో ఒక ముసలావిడ ఆ ఊరికి వెళ్లోద్దని ఎంత చెప్పినా కూడా ఆమె వినకుండా.. అతనితో వెళ్తుంది. అయితే అప్పటికే ధృవన్ కుటుంబానికి అడవి జాతికి చెందిన మనుషులకు పగ ఉంటుంది. ఈ కుటుంబాన్ని ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామా అని.. వారంతా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక అక్కడికి వెళ్లిన దగ్గర నుంచి కుమారికి.. ఏవో ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది ? ఆ ఊరిని వేధిస్తున్న శాపం ఏంటి ? ఆ కుటుంబం వెనుక ఉన్న కథ ఏంటి ? కుమారికి అక్కడికి వెళ్లిన దగ్గర నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే “కుమారి” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ సినిమాను చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.