Swetha
OTT Best Emotional Drama : ఎంత ఇన్వెస్టిగేషన్ , మర్డర్ మిస్టరీస్ , హర్రర్ మూవీస్ చూసినా కానీ.. ఓ మంచి ఎమోషనల్ డ్రామా చూస్తే మాత్రం మనసుకు హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీ మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.
OTT Best Emotional Drama : ఎంత ఇన్వెస్టిగేషన్ , మర్డర్ మిస్టరీస్ , హర్రర్ మూవీస్ చూసినా కానీ.. ఓ మంచి ఎమోషనల్ డ్రామా చూస్తే మాత్రం మనసుకు హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీ మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.
Swetha
ఓటీటీ లో రకరకాల జోనర్స్ లో ఎన్నో సినిమాలు , సిరీస్ లు ఉంటాయి. ఒక్కో జోనర్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఇక ఈ మధ్య అందరు హర్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ ను చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఎంత ఇన్వెస్టిగేషన్ , మర్డర్ మిస్టరీస్ , హర్రర్ మూవీస్ చూసినా కానీ.. ఓ మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చూస్తే మాత్రం.. మనసుకు హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూసారో లేదో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఓ లుక్ వేసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. కరుప్పు దురై అనే ఓ ముసలాయన ఉంటాడు. అతను మూడు నెలల నుంచి కోమాలో ఉంటాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు , ముగ్గురు కొడుకులు . అతను మూడు నెలల నుంచి కోమాలో ఉన్నా కూడా డాక్టర్స్ ఏమి చెప్పలేకపోతారు. అప్పటికే అతని కోడలు బంగారం తాకట్టుపెట్టి ఉంటుంది. కూతురు ఇల్లు అమ్మేస్తుంది. అయినా సరే ఆయన ఆరోగ్యం ఏ మాత్రం బాగుపడదు. దీనితో వారంతా ఆ పెద్దాయనతో ఆస్తి పేపర్స్ మీద సంతకం చేయించుకుని.. ఆయనను చంపేయాలని అనుకుంటారు. సరిగ్గా వారంతా ఈ డిస్కషన్ చేస్తున్నప్పుడే.. కరుప్పు దురై కోమాలో నుంచి బయటకు వస్తాడు. వీళ్ళ మాటలు అన్ని విని.. బాధతో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్లిన ప్రాంతంలో అక్కడ అతనికి ఓ చిన్న పిల్లడు పరిచయం అవుతాడు అతనే కుట్టి. అతను ఒక అనాధ . కుట్టి కి కరుప్పు దురై అంటే కాస్త అసూయా కలుగుతుంది. ఇక కరుప్పు దురై అక్కడే ఊరి గుడిలో పూజారికి సహాయం చేస్తూ ఉంటాడు.
ఇక అలా చేస్తూనే అతనికి బిర్యానీ తినాలని అనిపించి.. ఉదయం నుంచి మూడు సార్లు హోటల్ కు వెళ్లి వస్తాడు. ఇక సరిగ్గా బిర్యానీ రెడీ అయినా టైమ్ కి హోటల్ కు వెళ్లి ఆర్డర్ చేస్తాడు. అదే టైమ్ కు కుట్టి అక్కడకు వచ్చి.. ముందు డబ్బులు ఉన్నాయో లేదో కనుక్కోండి అని అంటాడు. అయితే కరుప్పు దురై దగ్గర అన్ని డబ్బులు లేకపోవడంతో .. బిర్యానీ తినకుండానే బయటకు వచ్చేస్తాడు. కానీ కుట్టి మాత్రం అతను బిర్యానీ తిని గుడికి వచ్చాడని ఆ గుడి పూజారితో చెప్తాడు. దీనితో కరుప్పు దురై కూడా బయటకు వెళ్ళిపోతాడు. దీనితో ఆరోజు మరొకరికి పొలంలో సహాయం చేయడంతో.. అతనికి కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బు తీసుకుని మళ్ళీ హోటల్ కు వెళ్లి బిర్యానీ తింటాడు. ఇక ఆ తర్వాత కుట్టి.. కరుప్పు దురై ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఈ క్రమంలో కుట్టి కరుప్పు దురై కు ఉన్న చిన్న చిన్న కోరికలన్నీ లిస్ట్ రాసుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది ? కుట్టి కరుప్పు దురై కోరికలను తీరుస్తాడా ? కరుప్పు దురై కోసం అతని కుటుంబ సభ్యులు వెతుకుతారా లేదా ? చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే “K.D” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి.
ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కూడా చూడండి.. OTTలో అవికా గోర్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.. ఒక్కసారైనా చూడాల్సిందే!