iDreamPost
android-app
ios-app

OTT Suggestions: OTTలో అవికా గోర్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.. ఒక్కసారైనా చూడాల్సిందే!

  • Published Jul 05, 2024 | 3:06 PM Updated Updated Jul 05, 2024 | 3:06 PM

OTT Best Family Emotional Drama : కామెడీ , హర్రర్ , సస్పెన్స్ మూవీస్ తో పాటు .. కొన్నిసార్లు ఎమోషనల్ మూవీస్ ను చూడడానికి కూడా ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను , మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Family Emotional Drama : కామెడీ , హర్రర్ , సస్పెన్స్ మూవీస్ తో పాటు .. కొన్నిసార్లు ఎమోషనల్ మూవీస్ ను చూడడానికి కూడా ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను , మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 05, 2024 | 3:06 PMUpdated Jul 05, 2024 | 3:06 PM
OTT Suggestions: OTTలో అవికా గోర్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.. ఒక్కసారైనా చూడాల్సిందే!

ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాస్ బోర్ కొడుతూ ఉంటాయని.. వీటిని చూడడానికి ప్రేక్షకులు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ రెగ్యులర్ గా కామెడీ , హర్రర్ , సస్పెన్స్ సినిమాలు చూసి బోర్ కొడితే మాత్రం.. మళ్ళీ ఇలాంటి ఎమోషనల్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాస్ నే చూసేందుకు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి వాటికి తెలుగు సినిమాలు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటాయి. మంచి మంచి కంటెంట్ తో ఎన్నో తెలుగు సినిమాలు , సిరీస్ ఓటీటీలో ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా విషయానికొస్తే.. 2014 లో మరాఠిలో బాగా హిట్ అయినా మూవీ ‘హ్యాపీ జర్నీ’. ఇక అదే మూవీని మలయాళంలో ‘కూడె’ అనే పేరుతో రూపొందించగా ఈ సినిమా కూడా బాగానే హిట్ టాక్ సంపాదించుకుంది. దీనితో ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. తెలుగులో ఈ సినిమా పేరు “#బ్రో” . కాగా తెలుగులో ఈ సినిమాలో అవికా గోర్ , నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించింది. మొత్తానికి ఈ సినిమా మరాఠీ మలయాళీ మేక్ ఓవర్ గా చెప్పొచ్చు. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వీడియోస్ ను చూస్తూ ఉంటారు, ఈ సినిమా ప్రస్తుతం సోని లివ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం.. వెంటనే చూసేయండి.

BRO Movie

ఇక బ్రో మూవీ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీలో అవికా పుట్టినప్పటినుంచే లంగ్స్ సమస్యతో బాధపడుతూ ఉంటుంది. చిన్నపటినుంచి కూడా ఆమె కుటుంబం మొత్తం ఆమె కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అప్పటికే తనకు ఓ అన్న కూడా ఉంటాడు. అతనే నవీన్ చంద్ర. అయితే తన చెల్లి ట్రీట్మెంట్ కు డబ్బులు సరిపోకపోవడంతో.. తన తండ్రి అతనిని కుటుంబానికి దూరంగా.. డబ్బు సంపాదించడానికి దుబాయ్ కు పంపిస్తాడు, అప్పటికే నవీన్ చంద్ర ఊరిలో ఓ అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. తన చెల్లి మీద ఉన్న ఇష్టంతో.. కుటుంబం కోసం అతను దుబాయ్ కు వెళ్తాడు. అందరూ అంతలా కష్టపడినా కానీ కొన్నాళ్లకు ఆమె చనిపోతుంది. దీనితో చెల్లిని ఆఖరి సారి చూసుకోవడం నవీన్ చంద్ర ఇండియాకు తిరిగి వస్తాడు. అయితే చనిపోయిన అవికా మాత్రం నవీన్ కు కనిపిస్తూనే ఉంటుంది ! ఆమె అతని అన్నకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది! ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామానా ! లేదా దెయ్యం కథా! అసలు తర్వాత ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.. https://www.sonyliv.com/movies/-bro-1000146082

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis girişesrar satın algrandpashabet