iDreamPost
android-app
ios-app

కలలను దొంగతనం చేసే హీరో.. ఇది కలా! నిజమా! OTT లో వెరైటీ sci-fi థ్రిల్లర్

  • Published Jul 29, 2024 | 6:51 PM Updated Updated Jul 29, 2024 | 6:51 PM

OTT Best Sci-Fi Movie : కొన్ని సినిమాలు ఒక్కసారి చూస్తే అసలు ఏమి అర్థంకాదు.. కాస్త కన్ఫ్యుజింగ్ గా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. సాధారణంగా అందరు కలలు కంటూ ఉంటారు. కానీ వాటిని మరొకరు దొంగలించగలరా ! అసలు ఈ మూవీ ఏంటి ఈ మూవీని మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

OTT Best Sci-Fi Movie : కొన్ని సినిమాలు ఒక్కసారి చూస్తే అసలు ఏమి అర్థంకాదు.. కాస్త కన్ఫ్యుజింగ్ గా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. సాధారణంగా అందరు కలలు కంటూ ఉంటారు. కానీ వాటిని మరొకరు దొంగలించగలరా ! అసలు ఈ మూవీ ఏంటి ఈ మూవీని మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

  • Published Jul 29, 2024 | 6:51 PMUpdated Jul 29, 2024 | 6:51 PM
కలలను దొంగతనం చేసే హీరో.. ఇది కలా! నిజమా! OTT లో వెరైటీ sci-fi థ్రిల్లర్

సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఓ పట్టాన అర్థంకావు. కొన్ని సినిమాలను ఒకటికి రెండు సార్లు చూడాల్సి వస్తుంది . అయినా సరే కాస్త కన్ఫ్యుజింగ్ గా ఉంటూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూస్తే కానీ అందులోని లాజిక్స్ అర్ధం కావు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా కాస్త అలాంటిదే. కొంచెం ట్రిక్కీ గా ఉంటుంది. అర్ధం కాదులే అని లైట్ తీసుకుంటే మాత్రం ఓ మంచి సైన్స్ ఫిక్షన్ మూవీని మిస్ అయినట్లే. అయితే సాధారణంగా అందరికి కలలు వస్తూ ఉంటాయి. కొందరికి అవి నిజం అవుతూ ఉంటాయి కూడా. కానీ ఒకరి కలలను మరొకరు దొంగిలించడం గురించి ఎప్పుడైనా విన్నారా అసలు అలా కూడా జరుగుతుందా.. ఈ సినిమాలో అలానే జరుగుతుంది. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. దీనిని అర్ధం చేసుకోవడం కాస్త కష్టం.. కానీ క్లియర్ గా లాజిక్స్ అర్ధం చేసుకుంటూ చూస్తే మాత్రం. ఈ సినిమా వారం వరకు మైండ్ లో నుంచి పోదు. అసలు కథ ఏంటంటే.. సైటు అనే ఓ బిజినెస్ మ్యాన్ హీరో అయినా కాబ్ కు ఒక టాస్క్ ఇస్తాడు. అదేంటంటే.. ఫిషర్ అనే ఓ రిచ్ కిడ్ మైండ్ లో ఓ ఆలోచనను నింపి అతని సామ్రాజ్యాన్ని నాశనం చేయాలి. కాబ్ ఓ సముద్రం వద్దన పడిపోయినప్పుడు.. సైటు మనుషులు అతనిని తీసుకుని వెళ్ళి ఈ టాస్క్ అప్పగిస్తాడు. అసలు హీరో ఎందుకు అలా పడిపోయాడు అనేది మూవీ లాస్ట్ లో అర్ధమౌతుంది. అయితే ఇక్కడ హీరోకు ఓ స్పెషల్ స్కిల్ ఉంటుంది. ఒక మనిషిలో ఆలోచనని దొంగతనం చేయగలడు.. అలాగే అదే మనిషిలో కొత్త ఆలోచన కూడా నింపగలడు. కలల్ని దొంగిలించడం , మెదడులో ఉండే రహస్యాలని కనిపెట్టడంలో ఇతను ఎక్స్పర్ట్.

అయితే కాబ్ ఓసారి సైటు దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ను దొంగలించాలని అనుకుంటాడు. ఇలా డ్రీమ్ లోకి వెళ్ళడానికి ఓ స్పెషల్ మిషన్ అవసరం అవుతుంది. అయితే సైటు దీనిని కనిపెట్టేస్తాడు. దీనితో కాబ్ ఓడిపోతాడు. అయితే సైటు ఓ బిజినెస్ మ్యాన్.. అతని బిజినెస్ కు ఎలాంటి అడ్డు రాకుండా.. తనకు పోటీగా ఉన్న ఫిషర్ బిజినెస్ ను నాశనం చేయాలని. అందుకోసమే సైటు కాబ్ కు ఈ టాస్క్ అప్పగిస్తాడు. దీనికి ఓ టీం అవసరం అవుతుంది. ఇక్కడ రకరకాల మనుషులు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అయితే కలలు చాలా రకాలుగా ఉంటాయి. దీనిని కాబ్ అక్కడ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అసలు ఇదంతా పాజిబుల్ అవుతుందా ? నిజంగా కలలను దొంగిలించడం కుదురుతుందా ? కాబ్ సైటు ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేస్తాడా లేదా ? చివరికి ఏమౌతుంది ? ఇవన్నీ తెలియాలంటే ‘ఇన్సెప్షన్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే ఓ మంచి సైన్స్ ఫిక్షన్ మూవీని మిస్ అయినట్లే. కాబట్టి వెంటనే ఈ సినిమాను చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.