iDreamPost
android-app
ios-app

అక్కడ మనుషుల్లో ఉన్నది దెయ్యమా! దేవుడా! OTT అంతుచిక్కని మూవీ

  • Published Jul 27, 2024 | 8:50 PMUpdated Jul 27, 2024 | 8:50 PM

OTT Best Suspense Thriller : అసలు దేవుడు , దెయ్యాలు ఉన్నాయా.. ఉంటే వారంతా ఎక్కడ ఉంటారు ఎన్ని రూపాలలో ఉంటారు . ఇలాంటి సందేహాలు అందరికి వచ్చే ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీ ఏంటి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ సారి చెక్ చేసేయండి.

OTT Best Suspense Thriller : అసలు దేవుడు , దెయ్యాలు ఉన్నాయా.. ఉంటే వారంతా ఎక్కడ ఉంటారు ఎన్ని రూపాలలో ఉంటారు . ఇలాంటి సందేహాలు అందరికి వచ్చే ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీ ఏంటి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ సారి చెక్ చేసేయండి.

  • Published Jul 27, 2024 | 8:50 PMUpdated Jul 27, 2024 | 8:50 PM
అక్కడ మనుషుల్లో ఉన్నది దెయ్యమా! దేవుడా! OTT అంతుచిక్కని మూవీ

కొన్ని సినిమాలు మన లాజిక్ కు అర్ధం కావు కానీ.. సినిమా పూర్తిగా చూస్తే మాత్రం మనకి ఉన్న అన్ని ప్రశ్నలకు క్లారిటీ వచ్చేస్తుంది. అసలు దేవుడు , దెయ్యాలు ఉన్నాయా.. ఉంటే వారంతా ఎక్కడ ఉంటారు ఎన్ని రూపాలలో ఉంటారు . ఇలా చాలా మందికి అనేక సార్లు ప్రశ్నించుకుని ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. ఈ సినిమా చూస్తున్నంత సేపు మధ్య మధ్యలో కొన్ని లాజిక్స్ చూసే వారి ఊహకు అందవు కానీ.. మూవీ అంతా చూస్తే మాత్రం ఓ క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. థాయిలాండ్ లోని నార్త్ ఈస్ట్ ప్రాంతంలోని ప్రజలు కొంతమంది విచిత్ర దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. పైగా ఆ ప్రాంతంలో కొంతమంది మంత్రగత్తెలు ఉంటారు. తరతరాలుగా కొంతమంది విచిత్ర దేవతలు , దేవుళ్ళు ఆ ప్రాంతంలోని కొందరిని సెలక్ట్ చేసుకుని వారితో పాటు వారి ఇంట్లోనే ఉంటారని .. వారిని ఆవహించి వారికి మంత్రం శక్తులు వచ్చేలా చేస్తారని అక్కడ వారంతా నమ్ముతారు. దీనితో 2018 లో ఓ టీం వీరి మీద ఓ డాక్యుమెంటరీ తీయాలని.. అక్కడకు వచ్చి నిమ్ అనే ఓ మంత్రగత్తెను.. తన జీవితంలో ప్రతి రోజు ఏం జరుగుతుందా అని షూట్ చేయడానికి ఒప్పిస్తారు. ఈ క్రమంలో నిమ్ తనలో ఆవహించిన దేవుడు భయన్ అని.. తరతరాలుగా తమ కుటుంబంలోని ఆడవారిని ఆవహిస్తు ఉంటాడని చెప్తుంది. అలాగే సినిమాలలో చూసినట్లు దేవుడు ఆవహించినట్లు ఊగిపోతూ ఉండరని కూడా చెప్తుంది.

దీనితో ఆ డాక్యుమెంటరీ టీం నిమ్ ను అనేక ప్రశ్నలు వేస్తారు. ఆమె కూడా ఓపికగా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే ఉంటుంది. ఓ రోజు నిమ్ తో పాటు.. ఆ డాక్యుమెంటరీ టీమ్ అంతా కలిసి తన కుటుంబంలోని ఓ వ్యక్తి అంత్యక్రియలకు వెళ్తారు. అయితే అక్కడ వారికి ఓ అమ్మాయి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమెకు ఏమైందో నిమ్ కు అర్ధమౌతుంది. డాక్యుమెంటరీ టీమ్ అంతా ఈ విషయాలన్నింటిని రికార్డు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమైంది ? నిజంగా ఈ వింత దేవుళ్ళు ఉన్నారా ? డాక్యుమెంటరీ టీమ్ దీని నుంచి ఏం ప్రూవ్ చేయాలనీ అనుకున్నారు ? చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే “ది మీడియం” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి