iDreamPost
android-app
ios-app

2 రోజుల్లో పెళ్లనగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ షాక్! OTT లో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్!

  • Published Jul 11, 2024 | 5:51 PM Updated Updated Jul 11, 2024 | 5:51 PM

OTT Suspense Thriller : ప్రేక్షకులలో సినిమాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. దర్శకులు కొన్ని ప్రయోగాత్మకమైన చిత్రాలతో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Suspense Thriller : ప్రేక్షకులలో సినిమాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. దర్శకులు కొన్ని ప్రయోగాత్మకమైన చిత్రాలతో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 11, 2024 | 5:51 PMUpdated Jul 11, 2024 | 5:51 PM
2 రోజుల్లో పెళ్లనగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ షాక్! OTT లో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్!

కేవలం హాలీవుడ్ , బాలీవుడ్ లోనే కాకుండా.. తెలుగులో కూడా ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ జోనర్ లో చాలానే సినిమాలు వచ్చాయి. వచ్చిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఎదో ఒక కోణంలో మెప్పిస్తునే ఉంది. దీనితో ప్రేక్షకులకు సినిమాపై పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. దర్శకులు కొన్ని ప్రయోగాత్మకమైన చిత్రాలతో ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలు కూడా బాగానే క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో… ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు.. ఈ సినిమా కథేంటో చూసేద్దాం.. ఈ సినిమా అంతా కూడా చాలా తక్కువ క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీలో హీరోయిన్ మీరాకు రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా.. రెండు రోజుల ముందు హైదరాబాద్ నుంచి విజయవాడ కు వస్తుంది. ఆల్రెడీ ఇంటి దగ్గర పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. తెల్లారితే పెళ్లి కొడుకు కూడా ఇంటికి వచ్చేస్తాడు. అలానే మరోవైపు ఆమె ఫ్రెండ్స్ అంతా సంగీత్ కోసమని హోటల్ కు చేరుకుంటూ ఉంటారు. ఇక మీరా కూడా పెళ్ళికి కావాల్సిన వస్తువులు తీసుకుని.. హైదరాబాద్ నుంచి బయల్దేరుతుంది. ఈ లోపే ఆమెకు ఓ కాల్ వస్తుంది. దీనితో ఆమెకు ఒక్కసారిగా షాక్ తగుల్తుంది. ఆ కాల్ హైదరాబాద్ రాయ్ దుర్గ్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తుంది. మ్యాటర్ ఏంటంటే.. మీరా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. దానికి ముందు అతను సోషల్ మీడియాలో వారిద్దరూ గతంలో కలిసి దిగిన ఫొటోస్ ను షేర్ చేస్తాడు.

Mrs Meeraa

దీనితో మీరానే అతనిని మోసం చేసిందని.. పోలీసులు ఆమెను అనుమానిస్తారు. మీరాను అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ కు రమ్మని ఆర్డర్ వేస్తారు. దీనితో మీరాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఓ వైపు ఇంటి నుంచి కాల్స్ , మరోవైపు పోలీస్ కేస్ , పెళ్ళికి ముందు అఫైర్ ఉందని.. పెళ్ళికొడుకుకు తెలిస్తే ఏమౌతుందా అనే కంగారు. వీటి నుంచి మీరా ఎలా బయటపడింది ? అసలు పెళ్లికి ముందు మీరా ఎందుకు హైదరాబాద్ కు వెళ్ళింది ? మీరా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ది ఆత్మహత్యా ! లేక హత్యా ! అసలు వారిద్దరూ ఎందుకు విడిపోతారు ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే “హలో మీరా” అనే ఈ సినిమాను చూడాల్సిందే. పైగా ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి..

ఇది కూడా చూడండి.. ఆ అమ్మాయితో మాట్లాడితే ప్రాణాలు పోవాల్సిందే.. OTTలో వణికించే హారర్ థ్రిల్లర్!