iDreamPost

OTT Best Suspense Thriller: ఆ అమ్మాయితో మాట్లాడితే ప్రాణాలు పోవాల్సిందే.. OTTలో వణికించే హారర్ థ్రిల్లర్!

  • Published Jun 08, 2024 | 8:04 PMUpdated Jun 08, 2024 | 8:04 PM

OTT Movie Suggestion: హర్రర్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టమైతే కనుక ఈ సినిమాను మిస్ చేయకూడదు. మిస్ చేస్తే మాత్రం ఓ మంచి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

OTT Movie Suggestion: హర్రర్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టమైతే కనుక ఈ సినిమాను మిస్ చేయకూడదు. మిస్ చేస్తే మాత్రం ఓ మంచి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published Jun 08, 2024 | 8:04 PMUpdated Jun 08, 2024 | 8:04 PM
OTT Best Suspense Thriller: ఆ అమ్మాయితో మాట్లాడితే ప్రాణాలు పోవాల్సిందే.. OTTలో వణికించే హారర్ థ్రిల్లర్!

ఏదైనా ఓ మూవీ కానీ, సిరీస్ కానీ.. కేవలం తెలుగులో ఉంటేనే చూస్తాము అనుకునే వారు మాత్రం ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు అందరు అన్ని భాషల చిత్రాలను , సిరీస్ లను బాగానే ఆదరిస్తున్నారు. పైగా ఇతర భాషల చిత్రాలను ఇంకాస్త ఎక్కువగానే ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఈ ఆదరణను చూసి ఎప్పుడో వచ్చిన సినిమాలను కూడా ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ కు తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా తెలుగులో అయితే లేదు. కానీ ఇంట్రెస్టింగ్ గా ఇంప్రెస్స్ చేసే విషయంలో అయితే ఏ మాత్రం లోటు చేయదు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

కథలోకి వెళ్తే .. మధుమిత , అరుణ్ భార్య భర్తలు, వారిద్దరూ ఓ రోజున ఓ ఫంక్షన్ కు వెళ్లడం కోసం బైక్ పైన బయల్దేరుతారు. అయితే దారిలో వారి బండి అనుకోకుండా స్కిడ్ అవుతుంది. దీనితో వారి బట్టలు పాడవుతాయి. ఓ పక్క ఫంక్షన్ కు వెళ్ళాలి కాబట్టి.. దగ్గరలో మధుమిత ఫ్రెండ్ చైత్ర ఇల్లు ఉంటె అక్కడికి వెళ్లి ఫ్రెష్ అయ్యి.. ఫంక్షన్ కు వెళ్దాం అనుకుంటారు. అలాగే చైత్ర ఇంటికి కూడా వెళ్తారు. కానీ అక్కడ వారికి కొన్ని వింత అనుభవాలు ఎదురౌతాయి. అసలు అక్కడ చైత్ర కనిపించదు. కానీ అక్కడ ఓ చైత్ర ఫోన్ మాత్రం మోగుతూ ఉంటుంది. అది తన హస్బెండ్.. దీనితో మధుమిత కాల్ లిఫ్ట్ చేసి.. అక్కడ సిట్యుయేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీనితో ఆమె హస్బెండ్ కంగారుగా.. చైత్రకు ఉన్న ఓ డిసీస్ గురించి చెప్తాడు. ఆమెకు సూసైడల్ థాట్స్ ఎక్కువని.. ఇప్పుడు కూడా మేడ పైన ఉంటుందని.. వెంటనే వెళ్లి ఆపమని చెప్తాడు.

దీనితో వీళ్ళు వెళ్లి చూస్తే.. పైన చైత్రను చూస్తారు. వీళ్ళు చూసే లోపే చైత్ర కిందకు దూకుతున్నట్లుగా అనిపిస్తుంది. వెంటనే కిందికి వచ్చి చూస్తే.. చైత్ర కనిపించదు. ఈలోపే మెయిన్ డోర్ లాక్ అయిపోతుంది. అదే సమయంలో అక్కడకు దివ్య అనే ఓ అమ్మాయి వస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ ఇదే ఇంట్లో బందీగా ఉన్నాడని ఎలా అయినా కాపాడాలని వారి ఇద్దరికీ చెప్తుంది. తీరా లోపలి వెళ్లి చూస్తే.. అతను అక్కడే కొన ఊపిరితో ఉంటాడు. చైత్ర కూడా పక్కనే ఉంటుంది. వీరిద్దరిని హాస్పిటల్ కు వెళ్తారు. దివ్య బాయ్ ఫ్రెండ్ కు ట్రీట్మెంట్ చేస్తారు. అలానే చైత్ర గురించి ఓ భయకరమైన నిజాన్ని బయటపెడతారు.

తనకు ఆత్మలు కనిపిస్తాయని.. ఆ ఆత్మలు తనను కూడా చనిపోమని ప్రేరేపిస్తాయని.. రీసెంట్ గా ఆమె ఫ్రెండ్స్ ఇద్దరు రోడ్ యాక్సిడెంట్ కు గురి అవ్వడం.. చూసి ఇలా బెహేవ్ చేస్తుందని చెప్పి.. వాళ్ళ ఫొటోస్ చూపిస్తాడు. తీరా చూస్తే ఆ ఫొటోస్ ఎవరివో కాదు.. మధుమిత, అరుణ్ లవి. దీనితో ఒక్క క్షణం దివ్యకు ఏమి అర్థంకాదు. అసలు వాళ్ళు మనుషులా దెయ్యాలా ! చైత్రకు ఏమౌతుంది! ఆ దెయ్యాలు చరిత్రతో పాటు దివ్యకు కూడా ఎందుకు కనిపిస్తున్నాయి! అలా కనిపించడం వలన వీళ్ళ ప్రాణాలకు కూడా ఏదైనా ప్రమాదం ఉందా ! దివ్య బాయ్ ఫ్రెండ్ కు ఏమౌతుంది! అతను ఎందుకు చైత్ర ఇంట్లో బందీగా ఉంటాడు ! ఇవన్నీ తెలియాలంటే తమిళ్ లో రిలీజ్ అయినా “చైత్ర” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైన మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి