iDreamPost
android-app
ios-app

భార్య శవంతో బిర్యానీ వండిన పోలీస్.. OTT లో డార్క్ మర్డర్ మిస్టరీ

  • Published Jul 09, 2024 | 4:29 PM Updated Updated Jul 09, 2024 | 4:29 PM

OTT Dark Murder Mystery Thriller: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అన్నీ కూడా ఒక్కోటి ఒక్కో విధంగా ఉంటూ ఉంటాయి. ఈ జోనర్ లో ఎన్ని మూవీస్ చూసిన కానీ ఇంకా చూడాలనే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Dark Murder Mystery Thriller: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అన్నీ కూడా ఒక్కోటి ఒక్కో విధంగా ఉంటూ ఉంటాయి. ఈ జోనర్ లో ఎన్ని మూవీస్ చూసిన కానీ ఇంకా చూడాలనే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 09, 2024 | 4:29 PMUpdated Jul 09, 2024 | 4:29 PM
భార్య శవంతో బిర్యానీ వండిన పోలీస్.. OTT లో డార్క్ మర్డర్ మిస్టరీ

కొన్ని సినిమాలు స్టార్టింగ్ బోర్ కొట్టిన కూడా.. చివరి వరకు చూస్తే మాత్రం.. ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎందుకు చూడలేదు అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి సినిమాలు ఓటీటీ లో చాలానే ఉన్నాయి. సరిగ్గా సెర్చ్ చేస్తే ఒక్క క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్ లోనే రకరకాల సినిమాలు , సిరీస్ లు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. ఈ సినిమా ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఈ మూవీ స్టార్టింగ్ లో ఓ కొండపైన ఒక కుక్క ఎదో గుర్తుతెలియని శవం యొక్క పాదాన్ని గుర్తుపడుతుంది. కట్ చేస్తే మధు అనే ఓ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ ఎక్కడానికి ఇంటి నుంచి బయల్దేరి వెళ్తాడు. దారిలో అతను అడవి ప్రాంతం మార్గంలో నడుచుకుంటూ వెళ్తాడు. అలా నడుస్తూ వెళ్లే క్రమంలో దారిలో అతనికి రక్తం మరకలు కనిపించడంతో భయంతో వేరే ప్రాంతానికి వెళ్ళి.. మందు తాగుతూ ఉంటాడు. ఈ క్రమంలో అప్పుడే డ్యూటీ ఫినిష్ చేసుకుని వచ్చిన మరొక పోలీస్ ఆఫీసర్ అతనితో జాయిన్ అవుతాడు. మధు కూడా మెల్లాగా స్టేషన్ కు వెళ్తాడు. ఇక ఈ క్రమంలో అక్కడ ఉన్న వెంకయ్య మధుకు వంట చేసి పెడితే అతను తినకుండా కుక్కలకు పెట్టేస్తాడు. ఇక కొద్దీ సేపటికి ఆ ప్రాంతాన్ని చూడడానికి తన పై ఆఫీసర్ భార్య పిల్లలు వస్తారు. వారిలో ఒక అబ్బాయి మాత్రం ఎదో మర్చిపోయానంటూ తిరిగి ఇంటికి వెళ్తాడు. ఈలోపు భారీ వర్షం కారణంగా మధు వాళ్ళని స్టేషన్ లోకి తీసుకుని వెళ్తాడు. బయటకు వెళ్లిన ఆ అబ్బాయి మాత్రం పిడుగు పడి చనిపోతాడు. దీనితో అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తాడు.

Elaveezhapoonchira

అయితే మధు వచ్చేటప్పుడు మాంసం తీసుకుని వస్తాడు. ఆ నెక్స్ట్ డే వెంకయ్య ఆ మాంసాన్ని వండి పెడతాడు. కానీ దానిని కూడా మధు తినడు.. నిన్న చనిపోయిన ఆ బాబు శవాన్ని చూసిన తర్వాత నాకు ఏమి తినాలనిపించడం లేదని అబద్దం చెప్తాడు. ఈ క్రమంలో అక్కడ అనుకోకుండా ఓ కుక్క చనిపోయి ఉంటుంది. దానిని అక్కడే పాతి పెడతారు. అయితే అప్పుడే వారికి ఓ కేసు వస్తుంది. సిటీలో అక్కడక్కడ కొంతమంది అమ్మాయిల బాడీ పార్ట్స్ దొరుకుతూ ఉంటాయి. అతనితో పాటు సూరి అనే మరొక పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటాడు. అయితే సూరికి అక్కడ ఓ అమ్మాయి డెడ్ బాడీలోని చేయి దొరుకుతుంది.

దీని గురించి ఎలా అయినా పై అధికారులకు చెబుదాం అనుకుంటాడు. కానీ మధు ఆ విషయాన్నీ ఎవరికీ చెప్పనివ్వడు. బలవంతంగా సూరిని స్టేషన్ కు తీసుకుని వచ్చి అతను చేసిన బిర్యానీని వండి పెడతాడు. అసలు అక్కడ చనిపోయింది ఎవరు ? ఆ హత్యలు చేసింది ఎవరు ? మధు తీసుకొచ్చిన మాంసం ఎవరిదీ ? మధు సూరిని కూడా చంపేస్తాడా ? అసలు సూరికి బిర్యానీ ఎందుకు వండిపెడతాడు ? అక్కడ ఏం జరుగుతుంది ? ఆ తర్వాత కథ ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే “ఎలా వీజ పూంచిర” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి..

jojobet girişmarsbahiscasibomjojobet girişjojobet