iDreamPost
android-app
ios-app

OTT Movie Suggestion: OTTలో స్టార్ సింగర్ మూవీ.. పాటలు మానేసి కుర్రాళ్లతో.. మామూలు మూవీ కాదు!

ఓటీటీ లో కేవలం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం ఉండే సినిమాలు కొన్నైతే.. కొన్ని కథలకు మాత్రం రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో చెక్ చేసేయండి.

ఓటీటీ లో కేవలం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం ఉండే సినిమాలు కొన్నైతే.. కొన్ని కథలకు మాత్రం రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో చెక్ చేసేయండి.

OTT Movie Suggestion: OTTలో స్టార్ సింగర్ మూవీ.. పాటలు మానేసి కుర్రాళ్లతో.. మామూలు మూవీ కాదు!

ఒక సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చాలి అంటే అందులో వారికి రియాలిటీకి దగ్గరగా ఉండే ఒక కనెక్టింగ్ పాయింట్ కావాలి. అలాగే కథలో ఒక మంచి కాన్ ఫ్లిక్ట్ కూడా ఉండాలి. అలాంటి కధలను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. అయితే అలాంటి సినిమాలు ఓటీటీల్లో చాలానే ఉన్నాయి. కానీ, మనమే సరిగ్గా చూడటం లేదు అనిపిస్తుంది. అలాంటి ఒక సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. అలాగే ఇది ఒక క్రేజీ మూవీ కూడా అవుతుంది. ఇది ఒక స్టార్ సింగర్ నేపథ్యంలో జరిగే కథ. సక్సెస్ వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ కూడా ఉంటుంది అనే విషయాన్ని చూపించారు.

హాలీవుడ్ సినిమాలు అంటే దాదాపుగా క్రేజీ రైడ్స్ లాగానే ఉంటాయి. యాక్షన్, థ్రిల్లర్స్ మాత్రమే కాకుండా.. ఎమోషన్, లవ్ స్టోరీస్ కూడా ఉంటాయి. అలాంటి కోవకు చెందిన ఒక సినిమాని మీకోసం తీసుకొచ్చాం. ఇది ఒక స్టార్ సింగర్ జీవితం నేపథ్యంలో సాగుతూ ఉండే కథ. ఇందులో ఆమె ఒక స్టార్ సింగర్ గా ఎలా ఎదిగింది? తన లైఫ్ లో ఎన్ని ఉన్నత శిఖరాలు తాకింది అనే విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే తన లైఫ్ లో ఎలా ఓడిపోయింది. ఎన్ని ఇబ్బందులు పడింది అనే విషయాన్ని కూడా చూపించారు. పెరుగుట విరుగుట కొరకే అనే సామెత తరహాలో ఆమె పాటలు పాడటం మానేస్తుంది. తన లైఫ్ ఒక ఘోరమైన టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఆమె తన జీవితం గురించే ఆలోచించడం మానేస్తుంది. అలాగే తన లైఫ్ లో సె*క్స్ కు ప్రాధాన్యం ఇస్తుంది. తనకు ఎవరు నచ్చితే వారితో తన కోరికలు తీర్చుకుంటూ ఉంటుంది.

ఒకప్పటి స్టార్ సింగర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అనే విషయాలు కాస్త ఆసక్తిగా అనిపిస్తాయి. అలాగే తన కజిన్ అంటూ ఒక అమ్మాయి ఆ సింగర్ లైఫ్ లోకి వస్తుంది. ఆ చిన్న చెల్లి వచ్చిన తర్వాత సింగర్ లైఫ్ ఊహించని మలుపులు తిరుగుతుంది. మరోసారి తన కెరీర్ మీద దృష్టి పెడుతుంది. కానీ, సక్సెస్ అయ్యిందా లేదా అనేది ఇక్కడ ఆసక్తిని కలిగించే అంశం. అలాగే ఈ మూవీలో చాలా పెద్ద సందేశమే ఉంటుంది. అలాగే జీవితం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే విషయాలను కూడా చూపిస్తారు. అలాగే సక్సెస్, ఫెయిల్యూర్ రెండూ శాస్వతం కాదు అనే విషయం అర్థమవుతుంది. ఈ మూవీ పేరు ‘డ్రై మార్టీనా’ ఇది 2018లోనే విడుదల అయ్యింది. అప్పటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. కాకపోతే కాస్త ఘాటుగా ఉండే సన్నివేశాలు ఉంటాయని చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ.. కథ, టేకింగ్ పరంగా ఈ డ్రై మార్టీనా వర్త వాచ్ మూవీ అనే చెప్పాలి. కాకపోతే ఈ సినిమాలో కాస్త ఘాటు సన్నివేశాలు ఉంటాయి. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు చూసే ప్రయత్నం చేస్తే మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి