iDreamPost
android-app
ios-app

OTTలో బెస్ట్ మైథలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. మీరు ఎలా మిస్ అయ్యారు?

  • Published Jun 15, 2024 | 3:50 PMUpdated Jun 15, 2024 | 3:50 PM

OTT Best Murder Mystery Thriller : ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చిన ప్రతి సినిమాను ఆదరిస్తున్న సరే.. కేవలం కంటెంట్ ఉన్న కొన్ని సినిమాలకు మాత్రమే పాపులారిటీ పెరుగుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ లిస్ట్ లోకి యాడ్ అవుతుంది. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Murder Mystery Thriller : ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చిన ప్రతి సినిమాను ఆదరిస్తున్న సరే.. కేవలం కంటెంట్ ఉన్న కొన్ని సినిమాలకు మాత్రమే పాపులారిటీ పెరుగుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ లిస్ట్ లోకి యాడ్ అవుతుంది. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 15, 2024 | 3:50 PMUpdated Jun 15, 2024 | 3:50 PM
OTTలో బెస్ట్ మైథలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. మీరు ఎలా మిస్ అయ్యారు?

క్రైమ్ థ్రిల్లర్ , మర్డర్ మిస్టరీస్ కు.. ట్విస్టెడ్ ఎలిమెంట్స్ తో పాటు.. మైథలాజిని జోడిస్తే.. ఇంకా అసలు ఆ కథలకు తిరుగే ఉండదు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. ప్రతి వారం ఓటీటీ లోకి వచ్చే కొత్త కంటెంట్ ను చూస్తున్న ప్రేక్షకులు.. కొన్ని సినిమాలను మాత్రం అనుకోకుండా మిస్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ సినిమా గురించి ఎక్కడైనా బజ్ నడిచినప్పుడు అరే దీన్నెలా మిస్ చేశాం అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా గురించి కూడా ఇలానే సెర్చ్ చేసి ఉంటారు. మరి ఈ మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను .. మీరు చూశారో లేదో చెక్ చేసేయండి. మరి ఇంతకీ ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

2020 లో అసుర అనే ఓ మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చింది. అప్పట్లో ఈ సిరీస్ ఊహించని విజయాన్ని అందుకుంది. అప్పటివరకు ఎవరు టచ్ చేయని… ఓ సరికొత్త పాయింట్ ను టచ్ చేసారు మేకర్స్. ఇక అసుర మొదటి సీజన్ ను చూసిన వారు.. రెండవ సీజన్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు అసుర సిరీస్ కు రెండవ సీజన్ అసుర -2 కూడా వచ్చేసింది. ఈ రెండు సీజన్స్ కూడా ఓని సేన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం జియో సినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను చూడకపోతే మాత్రం.. మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. అసలు ఈ సిరీస్ కథేంటి అనే విషయానికొస్తే..

అసుర మొదటి సీజన్ ను చూసిన వారికి.. రెండవ సీజన్ చాలా త్వరగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు లోకంలో మంచి కంటే చెడే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దానిని అడ్డుకోడానికి కల్కి వచ్చినపుడు.. అతనిని కూడా చంపేసి.. దేవతలపై పాగా తీర్చుకోవాలని అనుకుంటాడు శుభ్ జోషి. ఇక అతని నుంచి … ముగ్గురు సామాజిక వేత్తలను కాపాడేందుకు.. తన కూతురును త్యాగం చేస్తాడు.. ఫొరెన్సిక్ ఎక్స్‌పర్ట్‌ నిఖిల్ నాయర్. ఆ తర్వాత అతను డిప్రెషన్ లోకి వెళ్తాడు. దింతో నిఖిల్ భార్య అతని నుంచి విడాకులు కోరుతుంది. మరోవైపు.. తనకు ఇష్టమైన వారందరిని కోల్పోయిన బాధలో.. సీబీఐ ఆఫీసర్ రాజ్ పుత్ ధనుంజయ్, అకా డీజే కూడా ఓ మఠంలోకి వెళ్లి ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నిస్తుంటారు. సరిగ్గా అదే సమయంలో శుభ్ జోషి ముగ్గురిని చంపి సిబిఐ కు పని పెంచుతాడు. అసలు శుభ్ జోషిని పట్టుకునేందుకు పోలీస్ యంత్రాంగం ఏం చేసింది ! నిఖిల్ భార్య సహాయంతో ఈ కేసు ఎంతవరకు ముందుకు వెళ్ళింది ! శుభ్ జోషి ఎలా ఉంటాడో వారు కనిపెట్ట గలిగారా లేదా ! అతని మాస్టర్ ప్లాన్స్ ఏంటి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి