iDreamPost
android-app
ios-app

చివరికి ఆ అమ్మాయి చేసిన పనికి షాక్.. OTT లో బెస్ట్ ఫీల్ గుడ్ మూవీ

  • Published Jul 11, 2024 | 4:45 PM Updated Updated Jul 11, 2024 | 4:45 PM

OTT Feel Good Movie : కొన్ని సినిమాలు మొదట చూడడానికి కాస్త బోర్ కొట్టినా కానీ.. చూస్తున్న కొద్దీ ఆ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంటాయి. ఇక ఆ క్లైమాక్స్ అసలు ఎవరు ఊహించలేరు అనేలా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Feel Good Movie : కొన్ని సినిమాలు మొదట చూడడానికి కాస్త బోర్ కొట్టినా కానీ.. చూస్తున్న కొద్దీ ఆ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంటాయి. ఇక ఆ క్లైమాక్స్ అసలు ఎవరు ఊహించలేరు అనేలా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 11, 2024 | 4:45 PMUpdated Jul 11, 2024 | 4:45 PM
చివరికి ఆ అమ్మాయి చేసిన పనికి  షాక్.. OTT లో బెస్ట్ ఫీల్ గుడ్ మూవీ

ఓటీటీ లో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ తో పాటు.. అసలు ఎటువంటి మర్డర్స్ లేకుండా కూడా చివరి వరకు కూడా సస్పెన్స్ తో ఆ సినిమాను చూసేలా చేస్తుంటాయి కొన్ని సినిమాలు. ఇలాంటి సినిమాలు ఓటీటీ లో చాలానే ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు మొదట చూడడనికి కాస్త బోర్ కొట్టినా కానీ.. చూస్తున్న కొద్దీ ఆ సినిమాపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇక ఆ సినిమాలలో క్లైమాక్స్ అయితే ఎవరు ఊహించలేరు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఓ మంచి ఫీల్ గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. లేదా ఇన్స్పిరేషనల్ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా చూసేయండి. మరి ఈ సినిమా ఏంటి… ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలు చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. అర్చన అనే అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి . ఆమెకు అప్పటికే ముప్పై పెళ్లి చూపులు జరిగి ఉంటాయి. అది ఆమె 31 వ పెళ్లి చూపులు.. దీనితో ఆమె హడావిడిగా రెడీ అవుతూ ఉంటుంది. కానీ ఆ పెళ్లి చూపులకు వచ్చే వారు అర్చన వాళ్ళ ఇంటికి రాకుండా మరొక పెళ్లి చూపులకు వెళ్తారు. కనీసం వీళ్లకు ఎటువంటి అప్ డేట్ ఇవ్వరు. ఆమె ఒక స్కూల్ టీచర్.. దీనితో వెంటనే ఆమె ఇంకా స్కూల్ కి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే.. ఒక అతను ఆమెతో తన అన్న కూతురు గురించి.. కంప్లైంట్ చెప్తూ ఉంటాడు. అంతా వినేసి ఇక అర్చన కూడా క్లాస్ కు వెళ్లి లెసన్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇతను అక్కడికి కూడా వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు. అర్చన వీళ్లిద్దరి గొడవకు ఫుల్ స్టాప్ పెడుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె జాబ్ పోయే పరిస్థితి వస్తుంది. ఆమె ఆ స్కూల్ నుంచి రిసైన్ చేసి వచేస్తుంది.

ఇక ఆమెకు ఓ ఫారెన్ సంబంధం ఫిక్స్ అవుతుంది. అయితే పెళ్ళికొడుకు మాత్రం డైరెక్ట్ గా పెళ్ళికి మాత్రమే వస్తానని చెప్తాడు. అయినా సరే ఆమె ఈ పెళ్ళికి ఓకే అంటుంది. ఆ ఇంట్లో ఇంకా పెళ్లి సందడి మొదలవుతుంది. మరో రెండు రోజుల్లో పెళ్లి అనగా.. ఇంకాస్త సందడి సందడిగా ఉంటుంది. మరోవైపు పెళ్లి పనులన్నీ కూడా ఆమె చూసుకుంటూ ఉంటుంది. అయితే అక్కడకు వీళ్ళతో సంబంధం లేని ఓ పెద్దాయన వస్తాడు. కట్ చేస్తే.. ఆమె పెళ్లి కొడుకు వాళ్ళ తరపు నుంచి ఓ కాల్ వస్తుంది. వారంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నామంటూ.. తమ కొడుకు అతను ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోయాడని చెప్తాడు.

దీనితో ఆమెకు ఏం చేయాలో అర్ధం కాదు. ఆ విషయాన్నీ ఎవరికీ చెప్పాలో తెలియక ఆమెలో ఆమె బాధపడుతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే అక్కడకు స్కూల్ లో గొడవపడిన ఆ వ్యక్తి అక్కడకు వచ్చి.. అర్చనను ప్రేమిస్తున్నాని చెప్తాడు. ఆ తర్వాత అర్చన ఏం చేసింది ? తెల్లారితే పెళ్లి కానీ పెళ్లి కొడుకు లేడనే విషయం ఎవరికీ తెలియదు.. మరి అక్కడ ఏం జరుగుతుంది? ఆమె ఈ విషయం అందరికి ఈ విషయం ఎలా చెప్తుంది? ఇవన్నీ తెలియాలంటే “అర్చన 31 నాట్ ఔట్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. క్లైమాక్స్ లో ట్విస్ట్ అసలు ఊహించి ఉండరు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి..

ఇది కూడా చూడండి.. పెళ్లికి ముందే లవ్ స్టోరీ ఉందా.. OTTలో భార్యాభర్తలు కలిసి చూడాల్సిన మూవీ!