Swetha
OTT Best Feel Good Movie: భార్య భర్తల మీద వచ్చే సమస్యల మీద ఇప్పటివరకు చాలానే సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం ఓ మంచి ఫీలింగ్ కలుగుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ సారి చెక్ చేసేయండి.
OTT Best Feel Good Movie: భార్య భర్తల మీద వచ్చే సమస్యల మీద ఇప్పటివరకు చాలానే సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం ఓ మంచి ఫీలింగ్ కలుగుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ సారి చెక్ చేసేయండి.
Swetha
ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో వారం వారం వచ్చే సినిమాలే కాకుండా.. ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు , సిరీస్ లు కూడా ఉన్నాయి. అయితే కొన్ని సార్లు అనుకోకుండా కొన్ని మంచి సినిమాలను మిస్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఆ సినిమాలకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో కనిపించినప్పుడు ఆ సినిమా కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు.. మూవీ లవర్స్. ఇక ఇప్పటివరకు భార్య , భర్తల సమస్యల మీద ఎన్నో మూవీస్ వచ్చాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా చూస్తే మాత్రం ఓ మంచి ఫీలింగ్ వస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఓ లుక్ వేసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ లో హీరోయిన్ తండ్రి చనిపోవడంతో.. ఆమె తన అమ్మకు ఎక్కువగా దగ్గరగా ఉంటుంది. అప్పటికే వాళ్ళ అమ్మకు క్యాన్సర్ ఉండడంతో ఇంకా జాగ్రత్తగా చూసుకుంటుంది. కట్ చేస్తే ఇక్కడ నుంచి గతాన్ని చూపిస్తారు. గతంలో హీరోకు 26ఏళ్ళు వచ్చినా కానీ గర్ల్ ఫ్రెండ్ ఉండదు. అతనికి సరిగా మాట్లాడడం అందరిలా ఉండకపోవడం వలన అలా జరుగుతుంది. ఇక హీరోయిన్ కు అప్పటికే ఓ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. కానీ అతను కేవలం ఆమెను ఫిజికల్ రిలేషన్ కోసమే ప్రేమిస్తాడు. దీనితో ఈ విషయం అర్ధమైన హీరోయిన్ అతనికి బ్రేక్ అప్ చెప్పేస్తుంది. దీనితో కొన్ని నెలలు ఆమె డిప్రెషన్ లో ఉంటుంది. అప్పటికే తన తల్లికి క్యాన్సర్ ఉండడంతో .. తల్లి చెప్పినట్లు వేరొకరితో పెళ్ళికి ఒప్పుకుంటుంది. కట్ చేస్తే ఆమెకు.. హీరో తోనే అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతుంది. కానీ పెళ్లి తర్వాత.. ఆమె అతనితో సరిగా ఉండదు. వాళ్ళిద్దరి మధ్య మిస్ అండర్ స్టాండింగ్స్ వస్తూనే ఉంటాయి. హీరో తన భార్యతో మాట్లాడానికి ట్రై చేసినా కానీ.. ఆమెలో మాత్రం ఎలాంటి చలనం ఉండదు.
ఈ క్రమంలో హీరో ప్రతిసారి ఆమెను ఇంప్రెస్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో ఓ రోజు వాళ్లిద్దరూ బయటకు వెళ్ళినపుడు అక్కడ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ ను పలకరిస్తాడు. దీనితో ఆమెను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వలన.. హీరోకు హీరోయిన్ గురించి అసలు నిజం తెలుస్తుంది. ఇక అప్పటినుంచి మెల్లగా వాళ్లిద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. కానీ అతనితో ఫిజికల్ రిలేషన్ కు మాత్రం అసలు ఒప్పుకోదు.. ఆ తర్వాత ఏం జరిగింది ! వాళ్ళిద్దరు కలిసే ఉంటారా లేదా ! చివరికి ఏం జరిగింది ! ఆమెకు మరేమైనా గతం ఉందా ! వీళ్లిద్దరు కలుస్తారా లేదా ! ఇవన్నీ తెలియాలంటే “మలై నేరతు మాయకం” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటి వరకు ఈ సినిమాను ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.