iDreamPost
android-app
ios-app

OTTలో వణికించే ఆత్మల కథ ‘1408’.. ఒంటరిగా చూడకండి

  • Published Aug 13, 2024 | 11:30 PM Updated Updated Aug 13, 2024 | 11:30 PM

OTT Best Horror Movie: హర్రర్ మూవీస్ అంటే ఇష్టపడే వారికోసం.. మరొక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి చూసేద్దాం. ఈ మూవీ చూస్తే.. అసలు పూర్తిగా హర్రర్ సినిమాల మీద ఉండే డౌట్స్ అన్నీ కూడా తీరిపోతాయి. మరి ఈ సినిమా ఏంటో చూసేయండి.

OTT Best Horror Movie: హర్రర్ మూవీస్ అంటే ఇష్టపడే వారికోసం.. మరొక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి చూసేద్దాం. ఈ మూవీ చూస్తే.. అసలు పూర్తిగా హర్రర్ సినిమాల మీద ఉండే డౌట్స్ అన్నీ కూడా తీరిపోతాయి. మరి ఈ సినిమా ఏంటో చూసేయండి.

  • Published Aug 13, 2024 | 11:30 PMUpdated Aug 13, 2024 | 11:30 PM
OTTలో వణికించే ఆత్మల కథ ‘1408’..  ఒంటరిగా చూడకండి

అసలు ఆత్మలు దెయ్యాలు ఉన్నాయా.. ఉంటే అవి మనుషులకు నిజంగానే హాని కలిగిస్తాయా.. అవి ఎక్కడ ఉంటాయి. హర్రర్ సినిమాలలో చూపించేవన్నీ నిజాలా లేక కల్పిత కథలా.. ఇలాంటి డౌట్స్ ఇప్పటివరకు చాలా మందికి వచ్చి ఉంటాయి. కానీ సమాధానాలు మాత్రం తెలిసి ఉండదు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ చూస్తే మాత్రం వీటిపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. మూవీ స్టార్టింగ్ లో మైక్ అనే వ్యక్తి ఓ హోటల్ ను వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ మేడ మీద ఉండే ఒక రూమ్ కావాలని అడుగుతాడు. వాళ్ళు ఆ రూమ్ లో దెయ్యం కనిపిస్తుందని ఎవరికీ ఇవ్వడం లేదని చెప్పినా సరే.. మైక్ పట్టుబట్టి మరి అదే రూమ్ కి వెళ్తాడు. ఆ రూమ్ లోకి వెళ్లి ఓ వీడియో రికార్డర్ తో ఆ రూమ్ లో దెయ్యం ఉందా లేదా అని తెలుసుకుంటూ ఉంటాడు. ఈలోపే తెల్లారిపోతుంది. మైక్ అక్కడి నుంచి వస్తూ.. అక్కడ భయపడాల్సింది ఏమి లేదని వీడియో రికార్డు చేస్తాడు. అయితే తను ఒక రచయిత.. ఇలా హాంటెడ్ హౌసెస్ పై రీసెర్చ్ చేసి.. అక్కడ దెయ్యాలు ఉన్నాయా లేదా అనే దానిపైన బుక్స్ రాస్తూ ఉంటాడు. కట్ చేస్తే.. ఓసారి మైక్ తన రీసెర్చ్ లో భాగంగా.. మరొక హాంటెడ్ హోటల్ కు వెళ్తాడు. అక్కడ కూడా దెయ్యం లేదని నిరూపించి ఓ బుక్ రాయాలని అనుకుంటాడు.

కానీ అక్కడ మైక్ కు కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురౌతాయి. ఈ క్రమంలో అదే రూమ్ లో గతంలో 56 ఆత్మహత్యలు జరిగాయనే విషయం తెలుస్తుంది. దీనితో ఆ ఆత్మహత్యలు ఎలా జరిగాయి.. ఎందుకు జరిగాయి అనే కోణంలో పరిశోధన మొదలు పెడతాడు.. అయితే అక్కడ ఏకంగా మైక్ ను సూసైడ్ చేసుకునేలా.. ఆ ఆత్మలు ప్రేరేపిస్తాయి. పైగా మైక్ ఫ్యామిలీ కూడా అదే రూమ్ లో చనిపోయినట్లు అతనికి కనిపిస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది ? ఆ తర్వాత ఏమైంది ? మైక్ ఆ రూమ్ లో ఉన్న రహస్యాన్ని కనుక్కున్నాడా లేదా ? ఇవన్నీ తెలియాలంటే.. “1408” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.