iDreamPost
android-app
ios-app

OTT లో తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ ‘వాలెంటైన్స్ నైట్’ .. దీనిని కానీ మిస్ చేశారా!

  • Published Aug 11, 2024 | 4:20 AM Updated Updated Aug 11, 2024 | 4:20 AM

OTT Telugu Suspense Thriller : రెగ్యులర్ హై సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసి బోర్ కొట్టేసి.. తెలుగులో మినిమమ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉండే సినిమా చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్. మరి ఈ సినిమా ఏంటో చూసేయండి.

OTT Telugu Suspense Thriller : రెగ్యులర్ హై సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసి బోర్ కొట్టేసి.. తెలుగులో మినిమమ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉండే సినిమా చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్. మరి ఈ సినిమా ఏంటో చూసేయండి.

  • Published Aug 11, 2024 | 4:20 AMUpdated Aug 11, 2024 | 4:20 AM
OTT లో తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ ‘వాలెంటైన్స్ నైట్’ ..  దీనిని కానీ మిస్ చేశారా!

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే అందరికి తమిళం, మలయాళ సినిమాలే గుర్తొస్తూ ఉంటాయి. వాటిలో మంచి సినిమాలే ఉన్నా కానీ.. తెలుగులో కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తోనే చాలా సినిమాలు ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలో అందరూ.. హై సస్పెన్స్ సినిమాలనే చూడడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో రెగ్యులర్ గా ఇలాంటి సినిమాలను చూసి బోర్ కొట్టి.. మినిమమ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఉండే సినిమా చూడాలంటే.. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ మంచి సజ్జెషన్. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది .ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. అజయ్ అనే అతను FM లో ఆర్ జే గా పని చేస్తూ ఉంటాడు. అప్పటికే అతను ప్రియ అనే అమ్మాయితో లవ్ లో ఉంటాడు. ఈ క్రమంలో వారిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. కానీ కొద్దీ రోజులకు.. మన పెళ్లి అవ్వడం కష్టం అని.. తనని మర్చిపోమని అజయ్ ప్రియతో చెప్తాడు.. దీనితో అసలు అక్కడ ఏం జరుగుతుందో ప్రియకు అర్థంకాదు. కట్ చేస్తే ఇక్కడ మరొక సీన్ ను చూపిస్తారు. రాఘవ అనే అతను అక్రమ వ్యాపారాలు చేస్తూ.. చాలా వేగంగా ఎదుగుతాడు. అతనికి వేద అనే అమ్మాయి ఉంటుంది. తల్లి లేకపోవడంతో.. రాఘవ వేదాను గారాబంగా పెంచుతాడు. దీనితో ఆమె డ్రగ్స్ కు బానిస అవుతుంది. ఈ విషయం తండ్రికి తెలియక.. వేదం ఎప్పుడు డబ్బులు అడిగినా ఇచ్చేస్తూ ఉంటాడు.

పైగా రాఘవ తన కూతురికి పెళ్ళి చేయాల్సిన వయసులో అతను.. మాయ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. అయితే వేద కు మాయ అంటే ఇష్టం ఉండదు. మరో వైపు ఆ సిటీ లో డ్రగ్స్ రాకెట్ విపరీతంగా పెరుగుతుంది. మైఖేల్ అనే అతను డ్రగ్స్ ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి.. దాదా అనే అతనికి అమ్మేస్తూ ఉంటాడు. ఇప్పుడు మైకేల్ ఫోకస్ వేద పై పడుతుంది. ఆమెను ఎలా అయినా దాదాకు అమ్మేయాలని చూస్తాడు. ఇదిలా ఉంటే వేద.. తన అమ్మ మాయ.. రాఘవ ఫ్రెండ్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు.. ఆ ఫోటోలు రాఘవకు చూపిస్తుంది. ఆ తర్వాత రాఘవ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ? వేద ను మైకేల్ ట్రాప్ చేశాడా లేదా ? అజయ్ ప్రియ ఎందుకు విడిపోతారు ? అసలు దాదా ఎవరు ? చివరికి కథ ఎలా ముగుస్తుంది ? ఇవన్నీ తెలియాలంటే “వాలెంటైన్స్ నైట్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. టైమ్ పాస్ కు ఏదైనా మినిమమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూడాలంటే మాత్రం ఈ సినిమా చూసేయొచ్చు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş