iDreamPost
android-app
ios-app

Manorathangal OTT: OTT లోకి కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ క్రేజి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Jul 16, 2024 | 2:41 PMUpdated Jul 16, 2024 | 2:41 PM

ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఓటీటీ కంటెంట్ లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. వెండితెరపై అలరించిన ఫేమస్ నటి నటులు సైతం ఓటీటీ లపై మొగ్గు చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ లెజండరీ నటులు.. కమల్ హాసన్ , మోహన్ లాల్ , మమ్ముట్టి కాంబినేషన్ లో ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతుంది.

ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఓటీటీ కంటెంట్ లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. వెండితెరపై అలరించిన ఫేమస్ నటి నటులు సైతం ఓటీటీ లపై మొగ్గు చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ లెజండరీ నటులు.. కమల్ హాసన్ , మోహన్ లాల్ , మమ్ముట్టి కాంబినేషన్ లో ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతుంది.

  • Published Jul 16, 2024 | 2:41 PMUpdated Jul 16, 2024 | 2:41 PM
Manorathangal OTT: OTT లోకి కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ క్రేజి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఓటీటీ కంటెంట్ కు చాలా డిమాండ్ ఉంటుంది. ఒకప్పుడు ఎప్పుడూ ఓసారి మాత్రం ఓటీటీ లో సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి వారం పదుల సంఖ్యలో ఎన్నో సినిమాలు , సిరీస్ లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అందులోను ఇప్పుడు స్వయంగా కొన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ .. కొన్ని వెబ్ సిరీస్ లను రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా వెబ్ సిరీస్ లకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరగడంతో.. తెలుగులో కూడా కొత్త కంటెంట్ వచ్చేస్తుంది. ఇక వెబ్ సిరీస్ లలో ఆంథాలజీ సిరీస్ లకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటున్నారు. ఎందుకంటే ఇవి అనేక కథలు కలిపి ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు వెండితెరపై అలరించిన ఫేమస్ నటి నటులు సైతం ఓటీటీ లపై మొగ్గు చూపిస్తున్నారు. ప్రముఖ లెజండరీ నటులు.. కమల్ హాసన్ , మోహన్ లాల్ , మమ్ముట్టి కాంబినేషన్ లో ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఎప్పుడైతే ఓటీటీ లకు డిమాండ్ పెరిగిందో.. అప్పటినుంచి ఓటీటీ లోకి కొత్త కంటెంట్ రావడమే కాకుండా.. వెండితెరపై అలరించిన ఎంతో మంది నటి నటులు.. ఓటీటీ లో కూడా ప్రేక్షకులను మెప్పించారు. దాదాపు ఇప్పుడు అందరు ఓటీటీ లవైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పడు ప్రముఖ స్టార్ నటి నటులు.. మమ్ముట్టి , కమల్ హాసన్ , మోహన్ లాల్ కలిసి ఓ ఇంట్రెస్టింగ్ ఆంథాలజీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ వెబ్ సిరీస్ పేరు.. “మనోరథంగల్”. ఈ మలయాళ వెబ్ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ 5 లో రిలీజ్ చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్ ను మళయాళంలోనే కాకుండా .. తెలుగు, తమిళం , కన్నడ , హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కు తీసురానున్నారు. ఈ వెబ్ సిరీస్ ను ఆగష్టు 15 నుంచి ప్రేక్షకుల ముందుకు తీసురానున్నారు మేకర్స్. మరి ఈ వెబ్ సిరీస్ ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

ఇక మనోరథంగల్ విషయానికొస్తే.. ఈ ఆంథాలజీ సిరీస్ ను మొత్తం 9 ఎపిసోడ్స్ ఉండగా .. దీనిని 8 మంది దర్శకులు తెరకెక్కించారట. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఇప్పటికే అందరిని ఆకట్టుకుంది. ఇక కమల్ హాసన్ , మమ్ముట్టి , మోహన్ లాల్ తో పాటు.. ఈ సిరీస్ లో ఫహద్ ఫాజిల్, మధూ, బిజూ మీనన్, అపర్ణ బాలమురళి, నదియా లాంటి నటి నటులు కూడా అలరించారు. మరి ఈసారి ఈ ఆంథాలజీ వెబ్ సిరీస్ ఎంత మందిని మెప్పిస్తుందో చూడాలి. మరి మనోరథంగల్ వెబ్ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి