Swetha
OTT Recent Emotional Drama: మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడు మైమరిపిస్తూనే ఉంటాయన్న విషయం తెలియనిది కాదు. ఈ క్రమంలో లేటెస్ట్ గా మరొక మలయాళ మూవీ సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.
OTT Recent Emotional Drama: మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడు మైమరిపిస్తూనే ఉంటాయన్న విషయం తెలియనిది కాదు. ఈ క్రమంలో లేటెస్ట్ గా మరొక మలయాళ మూవీ సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.
Swetha
ప్రస్తుతం ఓటీటీ లో ఎంటర్టైన్మెంట్ కు కొదవే లేదు. ఎవరికీ ఎప్పుడు బోర్ కొట్టి మూవీ చూడాలని అనిపించినా కానీ.. వెంటనే ఎదో ఒక కొత్త మూవీ ఉండనే ఉంటుంది. ఇక ప్రతి వారం ముందస్తు ఇన్ఫర్మేషన్ తో వచ్చే సినిమాలు , సిరీస్ ల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి కాకుండా కొన్ని సినిమాలు ఎటువంటి బజ్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ.. ప్రేక్షకులకు సర్ప్రైజ్ చేస్తాయి. పైగా ఆ సినిమాలు మంచి రెస్పాన్స్ ను కూడా అందుకుంటాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ.. సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.
మలయాళీ సినిమాలలో ఎదో మ్యాజిక్ ఉంటుంది.. అది ఏ జోనర్ అయినా కానీ.. క్యాస్టింగ్ ను బట్టి కాకుండా.. కథ స్క్రీన్ ప్లే తోనే ఇట్టే ప్రేక్షకులను మెప్పించేస్తాయి. ఈ సినిమాలు ప్రతి సారి ప్రేక్షకులను మైమరపిస్తాయన్న సంగతి తెలియనిది కాదు. ఇక ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యేది కూడా ఒక మలయాళీ సినిమానే. ఈ సినిమా పేరు “ఉళ్ళోజుక్కు”. కాగా ఈ సినిమాలో తెలుగులో అందరికి పరిచయం ఉన్న నటి ఊర్వశి , పార్వతి తిరువోరు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా జూన్ 21 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. విమర్శకుల నుంచి కూడా ప్రసంశలు అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సూపర్ హిట్ మూవీ సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ మలయాళ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి ఈ మూవీ కేవలం మలయాళంలోనే అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు తెలుగు కంటెంట్ కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. తెలుగు స్ట్రీమింగ్ కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు.
ఇక ఉళ్ళోజుక్కు సినిమా కథ విషయానికొస్తే .. బట్టల షాప్ లో అంజు అనే అమ్మాయిని ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. అతను హిందూ , ఈమె క్రిస్టియన్.. దీనితో ఇంట్లో వీరి పెళ్లికి ఎవరు ఒప్పుకోరు. అంజుకు స్టీఫెన్ అనే వ్యక్తితో పెళ్ళి చేస్తారు. కానీ పెళ్ళైన నెల, రెండు నెలలకే అతనికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి చనిపోతాడు. ఓ పక్క భర్త హాస్పిటల్ లో ఉన్నా సరే.. అంజు మాత్రం ఎవరికీ తెలియకుండా ఆమె ప్రేమించిన అబ్బాయిని కలుస్తూ ఉంటుంది. అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ .. దీనిని ఆమె తన అత్తగారికి చెప్పలేక బాధపడుతుంది.. మరో వైపు ఆమె అత్తగారు పెళ్ళికి ముందే తన కొడుకుకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు కోడలికి చెప్పలేదని.. కోడలు ఏముంటుందా అనే కంగారులో ఉంటుంది. ఇదిలా ఉంటే ఇంకో పక్క అంజు ప్రేమించిన అబ్బాయి.. స్టీఫెన్ ఆస్తి రాయించుకుని తనతో వచ్చేయమని అంజుని ఒత్తిడి చేస్తూ ఉంటాడు. స్టీఫెన్ మరణం కారణంగా ఈ ముగ్గురి జీవితాలు ఎలా మారిపోయాయి అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.