Swetha
ఓటీటీ లో చాలా కంటెంట్ ఉంది కాబట్టి.. ప్రేక్షకులు అప్పుడప్పుడు కొన్ని కొన్ని సినిమాలను సిరీస్ లను మిస్ చేసే అవకాశం ఉంది. అటువంటి వారికోసమే ఈ మూవీ సజ్జెషన్. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కనుక మిస్ చేశారేమో ఓ లుక్ వేసేయండి.
ఓటీటీ లో చాలా కంటెంట్ ఉంది కాబట్టి.. ప్రేక్షకులు అప్పుడప్పుడు కొన్ని కొన్ని సినిమాలను సిరీస్ లను మిస్ చేసే అవకాశం ఉంది. అటువంటి వారికోసమే ఈ మూవీ సజ్జెషన్. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కనుక మిస్ చేశారేమో ఓ లుక్ వేసేయండి.
Swetha
లాంగ్వేజ్ అనే బారియర్ ను కనుక దాటేస్తే … ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఓటీటీ లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఓటీటీ లకు ఆదరణ బాగా పెరిగిపోయిన సంగతి తెలియనిది కాదు . వీకెండ్ వస్తే ఏ ఓటీటీ లో ఏ సినిమాలు ఉన్నాయా అని సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో అప్పుడప్పుడు కొన్ని సినిమాలను, సిరీస్ లను మిస్ చేసే అవకాశం ఉంది. అటువంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. ఒకవేళ మీరు మిస్ చేసిన సినిమాలలో.. ఈ సినిమా మిస్ అయిందేమో ఓ లుక్ వేసేయండి . మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ఇప్పుడు చెప్పుకోబోయే కథ వింటే ఎవరైనా ఎవరినైనా సరదాగా తిట్టాలన్నా కూడా భయపడిపోతారు. ఈ మూవీ స్టోరీ ఏంటంటే.. స్పెయిన్ లోని ఓ చిన్న ఊరిలో సారా అనే ఓ టీనేజ్ అమ్మాయి ఉంటుంది. ఇంట్లో పేరెంట్స్ ఇల్లు స్కూల్ తప్ప ఆమెకు ఇంకేమి తెలీదు. తనకు మాత్రం తన ఫ్రెండ్స్ తో సరదాగా గడపాలని ఉంటుంది. కానీ తన ఫ్రెండ్స్ కు మాత్రం ఆమె లావుగా ఉందని పంది పిల్ల అని ఎక్కిరిస్తు ఉంటారు. ఆమెను వాళ్ళతో కలవనీయరు. రోసీ, క్లాడియా, మాకా అనే ఈ ముగ్గురు ఆమెను బాగా వెక్కిరిస్తూ ఉంటారు. ఒకరోజు సారా మధ్యాహ్నం స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేయాలనుకుంటుంది.అదే సమయంలో ఆ ముగ్గురు అమ్మాయిలు వచ్చి, మళ్లీ టీజ్ చేస్తూ ఉంటారు. వాళ్లు సారా బట్టలను కూడా తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు సారా బాగా అవమాన పడుతూ.. తన ఒంటి మీద ఉన్న స్విమ్మింగ్ డ్రెస్ తోనే రోడ్ పైన పరిగెడుతుంది.
ఆ ముగ్గురు మాత్రం కార్ లో వెళ్తూ సారాను టీజ్ చేస్తారు. ఇంతలో ఆ రోడ్ లో ఓ సైకో కిల్లర్ వ్యాన్ వెళ్తుంది. ఆ వ్యాన్ లో ఉన్న వ్యక్తి టవల్ ను కింద పడేసి వెళ్తాడు. సారా ఆ టవల్ ను తీసుకుని కప్పుకుని ఇంటికి పరిగెడుతుంది. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే ఆ ముగ్గురు అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారని అక్కడి వారంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సారా వాళ్ళ అమ్మ నువ్వు ఆరోజు పూల్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. దానికి సారా నేను అసలు ఎక్కడికి వెళ్లలేదని అబద్దం చెప్తుంది. పోలీస్ స్టేషన్ లో కూడా సారాపై అందరు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అసలు ఆ కిడ్నాప్ కి సారా కి సంబంధం ఏంటి ? ఆ సైకో కిల్లర్ ఎవరు ? సారా కు అతనికి ఎమన్నా సంబంధం ఉందా ? ఇవన్నీ తెలియాలంటే పిగ్గీ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇప్పటివరకు మిస్ అయితే వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.