iDreamPost
android-app
ios-app

OTT Best Horror Movie: OTTలో చేతబడి చుట్టూ తిరిగే హర్రర్ మూవీ.. చూస్తే భయానికి స్పెల్లింగ్ రాసేస్తారు!

  • Published May 24, 2024 | 8:43 PM Updated Updated May 24, 2024 | 8:43 PM

OTT Movie Suggestion: హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉంటె కనుక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను అసలు మిస్ కాకండి. ఒకవేళ ఆల్రెడీ ఈ సినిమాను చూసినా కానీ మళ్ళీ చూడాలని అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

OTT Movie Suggestion: హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉంటె కనుక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను అసలు మిస్ కాకండి. ఒకవేళ ఆల్రెడీ ఈ సినిమాను చూసినా కానీ మళ్ళీ చూడాలని అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published May 24, 2024 | 8:43 PMUpdated May 24, 2024 | 8:43 PM
OTT Best Horror Movie: OTTలో చేతబడి చుట్టూ తిరిగే హర్రర్ మూవీ.. చూస్తే  భయానికి స్పెల్లింగ్ రాసేస్తారు!

హర్రర్ సినిమాలంటే కేవలం దెయ్యాలు మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ జోనర్ సినిమాలలో కనిపించే ప్రతి పాత్ర కూడా ప్రేక్షకుల గుండెల్లో దడ పుట్టించేస్తుంది. మరి ఇలాంటి సినిమాలను ఎవరు మాత్రం చూడకుండా ఉండరు. అందుకే హారర్ సినిమాలకు ఆదరణ బాగా పెరిగిపోతుంది. హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉంటె కనుక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను అసలు మిస్ కాకండి. ఒకవేళ ఆల్రెడీ ఈ సినిమాను చూసినా కానీ మళ్ళీ చూడాలని అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ మూవీ స్టార్టింగ్ లో ఓ దంపతులు తమ కొడుకుని తీసుకుని ఆత్మలతో మాట్లాడే ఓ లేడీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే వారు అక్కడికి రావడానికంటే మూడు రోజుల ముందు నుంచి వారి కొడుకు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దానికి ఆత్మలతో మాట్లాడే ఆ లేడీ ఏమన్నా సొల్యూషన్ చెప్తుందేమో అని వెళ్తారు. అలాగే ఆమె ఈ సమస్యను సాల్వ్ చేస్తున్న క్రమంలో అక్కడికి ఓ ఘోర ప్రేతాత్మ వచ్చి అక్కడున్న అందరిని కొట్టి ఆ అబ్బాయిని భూమిలోకి ఈడ్చుకుని వెళ్తుంది. కట్ చేస్తే.. సీన్ ను నలభై ఏళ్ళ తర్వాతకు వస్తుంది. ఇక్కడ క్రిస్టెన్ అనే ఓ లోకల్ బ్యాంక్ లో పని చేసే అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి లోన్ ఆఫీసర్ గా పని చేస్తూ ఉంటుంది. తనకు ఆ బ్యాంక్ అసిస్టెంట్ అవ్వాలని అనుకుంటుంది. ఇదే విషయాన్నీ తన మేనేజర్ తో చెప్తే… నువ్వు టఫ్ డెషిషన్స్ తీసుకోలేవు అని చెప్పి ఆమెను తిట్టిపోస్తాడు. ఆమె ప్లేస్ లో అదే ఆఫీస్ లో పని చేసే మరో లేడీకి అవకాశం ఇవ్వాలని అనుకుంటాడు.

ఈ క్రమంలో ఓ రోజు ఆ బ్యాంక్ లో ఓ ముసలావిడ వస్తుంది. తానూ తన ఇంటి లోన్ ను కట్టలేకపోతున్నాని.. లోన్ ఎక్స్టెన్షన్ చేయమని అడుగుతుంది. కానీ క్రిస్టెన్ ఈసారి టఫ్ డెసిషన్ తీసుకుందాం అని డిసైడ్ అవుతుంది. దీనితో ఆ ముసలావిడకు ఆమె లోన్ ఎక్స్టెన్షన్ చేయడం అవ్వదు అని చెప్తుంది. దీనితో ఆ ముసలావిడ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఆమెను తిట్టి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఈ క్రమంలోనే ఆ సాయంత్రం వర్క్ అయినా తర్వాత క్రిస్టెన్ ఇంటికి వెళ్తున్న దారిలో ఈ ముసలావిడ క్రిస్టెన్ ను భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ ఆ ముసలావిడా క్రిస్టెన్ డ్రెస్ నుంచి చిన్న బటన్ ను తీసుకుని.. ఏవో మంత్రాలు చదివి అక్కడినుంచి వెళ్ళిపోతుంది.

దీనితో క్రిస్టెన్ భయంతో ఓ స్పిరిట్యుయల్ అడ్వైసర్ దగ్గరకు వెళ్తుంది. అతను క్రిస్టెన్ పై ఎవరో చేతబడి చేశారని చెప్తాడు. అప్పటినుంచి ఆమెకు వింత వింత అనుభవాలు ఎదురౌతాయి. దానికి కారణం ఆ ముసలావిడ అని తెలుసుకుని . ఆమెకు క్షమాపణ చెబుదాం అని వెళ్తే ఆమె అక్కడ చనిపోయి ఉంటుంది. ఈ సమస్య నుంచి ఆమె ఎలా బయటపడింది ? ఆ ముసలావిడ క్రిస్టెన్ కు ఎందుకు చేతబడి చేసింది ? మూవీ స్టార్టింగ్ లో చూపించిన సీన్ కు ఈమె జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధం ఏంటి ? అసలు ఆ ముసలావిడ ఎవరు ? చివరికి కథ ఎలా ముగుస్తుంది ? ఇవన్నీ తెలియాలంటే “డ్రాగ్ మీ టు ది హెల్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇప్పటివరకు మిస్ చేసి ఉంటే కనుక వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.