Swetha
హర్రర్ సినిమాలంటే అందరికి ఇష్టమే.. కానీ కొంతమంది మాత్రం మరి ఎక్కువ భయపెట్టకుండా ఉండే సినిమాలను చూడాలనుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ చూడొచ్చు అనే విషయాలను చూసేద్దాం.
హర్రర్ సినిమాలంటే అందరికి ఇష్టమే.. కానీ కొంతమంది మాత్రం మరి ఎక్కువ భయపెట్టకుండా ఉండే సినిమాలను చూడాలనుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ చూడొచ్చు అనే విషయాలను చూసేద్దాం.
Swetha
ఈ మధ్య చాలా మంది హర్రర్ సినిమాలంటే ఇష్టమే.. అలాగే భయం కూడా.. ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలన్నీ కూడా విపరీతమైన కొత్త కొత్త హర్రర్ ఎలిమెంట్స్ ని చూపిస్తూ.. గుండె దడ పెంచేసేలా తీస్తున్నారు. కానీ ఇవన్నీ కాకుండా హర్రర్ సినిమా అయి ఉండాలి కానీ, ఎక్కువ భయం ఉండేలా ఉండకూడదు అనే వారికీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఓ మంచి సజ్జెషన్ అని చెప్పి తీరాలి. ఇప్పటి వరకు ఈ సినిమాను కనుక మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి. పైగా ఈ సినిమా స్టోరీ రొటీన్ కి భిన్నంగా ఉంటుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అని విషయాలను చూసేద్దాం.
ప్రపంచంలో తల్లి బిడ్డలకు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, సొంత కూతురిని తన తల్లే చంపాలని అనుకుంటుందా అసలు అది ఎక్కడైన జరుగుతుందా.. అవును ఈ సినిమాలో అలానే జరుగుతుంది. తల్లి కూతుళ్ళ అనుబంధం పైన ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ, ఈ సినిమా మాత్రం రొటీన్ కి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాల తల్లీ కూతుళ్ళ మధ్య అనుబంధం, ఆప్యాయత లాంటివి ఏమి ఉండవు .. కేవలం వాళ్ళిద్దరి మధ్యన కేవలం పగ మాత్రమే ఉంటుంది. పైగా ఆ తల్లి చనిపోయినా కూడా తన కూతురి మీద పగ తీర్చుకోడానికి మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ సినిమా పేరు ఏంటంటే “ఉమ్మ”. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటె మాత్రం వెంటనే చూసేయండి. అసలు ఈ సినిమాను ఎందుకు చూడాలి. ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే..
ఈ సినిమాలో అమాండ, క్రిస్ అనే తల్లి కూతుళ్లు సిటీకి దూరంగా ఓ ఫార్మ్ హౌస్ లో జీవిస్తూ ఉంటారు. వీరిద్దరూ తేనే బిజినెస్ చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే అమాండాకు ఎలక్రాట్రానిక్ వస్తువులంటే అసలు నచ్చదు.. దీనితో ఇంట్లో ఉన్న ఎలెక్ట్రిక్ వస్తువులన్నిటిని ఇంటి బేస్మెంట్ కో వేసి తాళం వేస్తుంది. వారిద్దరూ కనీసం ఎవరితో కలవకుండా ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు తయారు చేసే తేనెను వారే ఇతరుల దగ్గరకు తీసుకుని వెళ్లి అమ్ముతూ ఉంటారు. అలాగే ఓ రోజు.. క్రిస్ డ్యానీ అనే వ్యక్తిని కలవడానికి వెళ్ళినపుడు ఓ కొరియన్ వ్యక్తి తనను అడ్రస్ అడుగుతాడు. కొరియన్ భాష క్రిస్ కు రాదు కాబట్టి కామ్ గా ఉంటుంది. కానీ ఆ కొరియన్ వ్యక్తి వచ్చేది క్రిస్ ఇంటికే. అతను అమాండా బాబాయ్.. అయితే తన తల్లి చాలాకాలం క్రితం చనిపోయిందని, కూతురిగా అమ్మ అస్థికలకు అమాండ పూజ చేస్తే తన తల్లి ఆత్మ శాంతిస్తుందని.. చెప్పి తనతో పాటూ తెచ్చిన ఓ బాక్స్ ను అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ అప్పటినుంచే ఆ ఇంట్లో అసలు సమస్యలు మొదలవుతాయి. ఆమెకు తన తల్లి ఆత్మ కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది ! ఆత్మ వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురుపడ్డాయి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.