iDreamPost
android-app
ios-app

Bujji And Bhairava Review: బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ రివ్యూ

  • Published Jun 01, 2024 | 2:43 PMUpdated Jun 01, 2024 | 2:43 PM

ఇప్పటివరకు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఏ సినిమా చేయనంత ప్రమోషన్ .. ఇప్పుడు కల్కి మూవీ టీమ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీ లో ఈ సినిమాకు సంబంధించిన బుజ్జి&భైరవ యానిమేటెడ్ సిరీస్ ను రిలీజ్ చేసింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూ లో చూసేద్దాం.

ఇప్పటివరకు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఏ సినిమా చేయనంత ప్రమోషన్ .. ఇప్పుడు కల్కి మూవీ టీమ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీ లో ఈ సినిమాకు సంబంధించిన బుజ్జి&భైరవ యానిమేటెడ్ సిరీస్ ను రిలీజ్ చేసింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూ లో చూసేద్దాం.

  • Published Jun 01, 2024 | 2:43 PMUpdated Jun 01, 2024 | 2:43 PM
Bujji And Bhairava Review: బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ రివ్యూ

ప్రస్తుతం అభిమానులతో పాటు.. సినీ ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తున్న సినిమా.. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న “కల్కి 2898AD”. ఈ సినిమా కోసం ఎంతో మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక్కొక్కటిగా వస్తున్న అప్ డేట్ ప్రేక్షకులను మరింత ఎక్సయిటింగ్ కు గురి చేస్తున్నాయంటే.. ఇక తాజాగా వచ్చిన అప్ డేట్ ఎవరు ఊహించనటువంటిది. తాజాగా కల్కి సినిమా నుంచి బుజ్జి అనే స్పెషల్ కార్ గురించి రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత “బుజ్జి అండ్ భైరవ” పేరుతో ఓ యానిమేటెడ్ వెబ్ సిరీస్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ యానిమేటెడ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.

బుజ్జి అండ్ భైరవ సిరీస్ కథేంటంటే:

సిరీస్ ను 2896 AD నుంచి చూపించడం స్టార్ట్ చేస్తారు. అంటే కల్కి సినిమా జరిగే కాలానికి రెండేళ్లు ముందు అన్నమాట. గత కొన్నేళ్లుగా కార్గో వెహికల్స్ లో పనిచేసే ఏఐ మెషిన్ అయిన బుజ్జికి ప్రమోషన్ వస్తుంది. దీనితో ఓ కాంప్లెక్స్ మెంబర్ అయిన వ్యక్తికీ ప్రవేట్ వెహికల్ గా మారడానికి రెడీ అయిపోతుంది బుజ్జి. ఈ క్రమంలో లాస్ట్ కార్గో డెలివరీ చేయడానికి వెళ్తున్నపుడు.. కొంతమంది రెబెల్స్ అట్టాక్ చేసి ఆ షిప్ ను కూల్చేస్తారు. దీని వలన బుజ్జికి కాంప్లెక్స్ సిటీతో సంబంధం కట్ అయిపోయి స్క్రాప్ లోకి వెళ్ళిపోతుంది. ఇక మరో వైపు కాశీ పట్టణంలో సరదాగా తిరుగుతూ దొంగలను, దోపిడీ దారులను పట్టుకుంటూ బాగా డబ్బు సంపాదించి.. ఎలాగైనా కాంప్లెక్స్ మెంబర్ అవ్వాలని అనుకుంటూ ఉంటాడు భైరవ(ప్రభాస్).

కానీ అతను ఏ పని చేసినా.. అతనికి వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉండేది. పైగా ఆ ఇంటి యజమాని(బ్రహ్మానందం) కు కూడా ఇంటి అద్దె చెల్లించడు. ఓరోజు అలానే దొంగలను పట్టుకునే క్రమంలో.. తన బైక్ పాడైపోవడంతో.. దానిని స్క్రాప్ కు వేయడం కోసం వెళ్తాడు. అక్కడ భైరవకు బుజ్జికి పరిచయం ఏర్పడుతుంది. బుజ్జి ఆలోచనతో భైరవ ఓ స్పెషల్ కార్ ను ఎలా తయారు చేశాడు ? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి ? కల్కి ప్రపంచాన్ని ఏ విధంగా చూపించారు ? అనేదే ఈ సిరీస్ కథ.

బుజ్జి అండ్ భైరవ సిరీస్ ఎలా ఉందంటే!

ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇలాంటి ప్రమోషన్ ను ఎప్పుడు ఎవరు చూసి ఉండరు. ఇటీవల ఎప్పుడో రిలీజ్ అయినా బాహుబలి సినిమాకు యానిమేటెడ్ వెర్షన్ ను రిలీజ్ చేస్తేనే ప్రేక్షకులంతా.. ఆశ్చర్యపోయారు. అలాంటిది ఇప్పుడు అసలు ఇంకా థియేటర్ లో రిలీజ్ కానీ.. ఓ భారీ బడ్జెట్ మూవీకి.. రిలీజ్ కు ముందే ఇలా యానిమేటెడ్ సిరీస్ ను రిలీజ్ చేయడం అనేది. ఓ కొత్త కాన్సెప్ట్ అని చెప్పి తీరాలి. ఇప్పటికే కల్కి సినిమాపైన అందరికి ఎన్నో ఆశలు , ప్రశ్నలు , అనుమానాలు , సందేహాలు ఉన్నాయి. వీటి అన్నిటిని మైండ్ లో ఉంచుకుని .. ఒకేసారి తెరపైన చూస్తున్నపుడు ఏవైనా లాజిక్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అసలు కల్కి ప్రపంచం ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నమే ఈ “బుజ్జి అండ్ భైరవ” యానిమేటెడ్ సిరీస్.

కల్కి ప్రపంచం అన్నారు కదా అని మొత్తం కథను అయితే రివీల్ చేయరు కదా.. అందుకోసమే ఈ సిరీస్ లో కేవలం కార్గో షిప్ లో ఉన్న బుజ్జి, కాశీ పట్టణంలో ఉన్న భైరవ ఈ రెండు క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయనేది మొదటి రెండు ఎపిసోడ్స్ లో చూపించారు. ఇక ప్రభాస్ యాక్షన్ సీన్స్ కు ఎంటర్టైన్మెంట్ కూడా జోడించడంతో కాస్త చూడడానికి ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలాగే బ్రహ్మానందం.. కామెడీ కూడా అందరిని నవ్విస్తుంది. గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ ఈ సిరీస్ ను ఎంతో అద్భుతమైన ఎడిటింగ్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిందని చెప్పి తీరాలి. ఇక మెయిన్ గా బుజ్జికి డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేష్ వాయిస్ ఆ పాత్రకు సరిగ్గా సరిపోయింది. బుజ్జి , భైరవ ఇద్దరికీ ఒకే రకమైన లక్ష్యాలు కానీ దారులు మాత్రం వేరు. వీరిద్దరూ కలిసి ఎలా తమ లక్ష్యాలను ఛేదించారనేది తర్వాత కథ. కల్కి సినిమా ఎలా ఉండబోతుంది అనేది.. సింపుల్ గా ఈ సిరీస్ ద్వారా అర్థమయ్యేలా చూపించారు.

మరి బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి