iDreamPost
android-app
ios-app

OTTల్లో పిల్లలు ఇష్టపడే 5 బెస్ట్ కార్టూన్స్ మూవీస్ ఇవే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Jul 26, 2024 | 2:00 AMUpdated Jul 26, 2024 | 2:00 AM

Kids Movies OTT: చాలామంది పిల్లలకు కార్టూన్స్ సినిమాలంటే.. ఆల్ టైమ్ ఫేవరెట్ అనే చెప్పవచ్చు. మరి, అలాంటి ఆసక్తి కలిగించే అద్భుతమైన ఐదు కార్టూన్ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఇంతకి అవి ఏ ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Kids Movies OTT: చాలామంది పిల్లలకు కార్టూన్స్ సినిమాలంటే.. ఆల్ టైమ్ ఫేవరెట్ అనే చెప్పవచ్చు. మరి, అలాంటి ఆసక్తి కలిగించే అద్భుతమైన ఐదు కార్టూన్ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఇంతకి అవి ఏ ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jul 26, 2024 | 2:00 AMUpdated Jul 26, 2024 | 2:00 AM
OTTల్లో పిల్లలు ఇష్టపడే 5 బెస్ట్ కార్టూన్స్ మూవీస్ ఇవే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రస్తుతం థియేటర్స్ కన్నా ఓటీటీ ఆదరణ ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఓటీటీలో థియేటర్స్ కు మించి వివిధ జోనర్స్ లో సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటిలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే మనకు తెలిసినవి, మనం చూసినవి ఉంటాయి. ఇక మనకు తెలియకపోయినవి, మనం చూడకపోయినవి చాలానే మిగిలి ఉంటాయి. ఎందుకంటే. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అనేది ఒక సముద్రం లాంటింది. ఇందులో రోజుకు డజన్ల కొద్ది సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కాగా, వీటిలో టాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజ్ లో సినిమాలు కూడా అలరిస్తుంటాయి. అయితే అలాంటి వాటిలో పిల్లలు ఎక్కువగా కార్టూన్స్ సినిమాలను ఇష్టపడుతుంటారు. మరి, మీ పిల్లలు చూడాల్సిన, వారికి ఆసక్తికరమైన ఐదు సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. మరీ, అవేంటో తెలుసుకుందాం.

చాలామంది పిల్లలకు కార్టూన్స్ సినిమాలంటే.. ఆల్ టైమ్ ఫేవరెట్ అనే చెప్పవచ్చు. ఇక ఇలాంటి సినిమాలో టీవిలో వస్తునే రెప్ప వాల్చకుండా పిల్లలు అందులో లీనమైపోతారు. మరి, అలాంటి సినిమాలకు మించేలా ఆసక్తి కలిగించే అద్భుతమైన ఐదు కార్టూన్ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఇంతకి అవి ఏ ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆన్‌వార్డ్ మూవీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 

ఆన్‌వార్డ్ మూవీ.. ఇది ఒక అడ్వెంచర్ ఫిలిమ్. దీనిని 2020లో డాన్ స్కాన్లాన్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను  అమెరికన్ యానిమేటెడ్ అర్బన్ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్, పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించింది. కాగా, ఇందులో ఓ ఎమోషనల్ జర్నీ ఉంటుంది. తోబుట్టువుల బంధాన్ని, కుటుంబ బలాన్ని ఈ చిత్రం హైలైట్ చేసి చూపించారు. ఇక ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

 ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్: అమెజాన్ ప్రైమ్

ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్.. ఇదొక స్ఫూర్తిదాయకమైన యదార్థ గాథ. అయితే  ఈ మూవీని  2006లో గాబ్రియేల్ ముసినో తెరకెక్కించారు.  కాగా, ఇందులో కొడుకుకుకు మంచి జీవితాన్ని అందించాలని ఆరాటపడే తండ్రి కథ సాగుతుంది. పైగా ఇందులో తండ్రి చేసే పోరాటాలు, అతను సాధించిన విజయాలను ఈ చిత్రం చూపిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

డోలిటిల్:

డోలిటిల్.. ఇది ప్రేక్షకులను  కొత్త ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా. దీనిని 2020లో అమెరికాన్ దర్శకుడు స్టీఫెన్ గఘన్ తెరకెక్కించారు. ఇక ఇందులో అద్భుతమైన సాహసంతో పాటు జంతు రాజ్యాన్ని తెరపై చూపిస్తుంది. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్ పాపులర్ యాక్టర్ రాబర్ట్ డౌనీ జూనియర్ నటించారు.  ముఖ్యంగా ఈ సినిమా పిల్లలకు ఎంతగానో నచ్చుతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

స్టార్ గర్ల్:

స్టార్ గర్ల్.. ఈ సినిమాలో తన కాళ్లపై తాను స్వతంత్రంగా నిలబడి సాగే ఓ అమ్మాయి కథ. అయితే ఈ  మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ రెండు ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. అలాగే ఈ సినిమా పిల్లలకు ఎంతగానో నచ్చుతుంది.

ఓరియన్ అండ్ ది డార్క్: నెట్ ఫ్లిక్స్

ఓరియన్ అండ్ ది డార్క్.. ఈ సినిమా 2024లో అమెరికన్ యానిమేటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ చిత్రంగా తెరకెక్కింది. దీనిని సీన్ చార్మట్జ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ నిర్మించింది. అయితే ఈ సినిమాలో చిన్ననాటి భయాలు , ముఖ్యంగా చీకటికి భయపడే పిల్లల గురించి చూపిస్తుంది. అలాగే పిల్లలకు చీకటి భయాన్ని పోగొట్టే ప్రయత్నమే ఈ సినిమా. కాగా, ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి