Aditya N
గత డిసెంబర్ లో సలార్ మూవీకి పోటీ వచ్చిన డంకీ, సంకాంత్రి సమయంలో విడుదలైన గుంటూరు కారం సినిమాలు ఓటీటీల్లో సందడి చేయడంతో పాటు సత్తా చాటుతున్నాయి.
గత డిసెంబర్ లో సలార్ మూవీకి పోటీ వచ్చిన డంకీ, సంకాంత్రి సమయంలో విడుదలైన గుంటూరు కారం సినిమాలు ఓటీటీల్లో సందడి చేయడంతో పాటు సత్తా చాటుతున్నాయి.
Aditya N
సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నెట్ ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో తమ హవా నడిపిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ ఇటీవలే ఓటీటీలో విడుదలయిన సంగతి తెలిసిందే. అయితే డిజిటల్ రిలీజ్ తరువాత ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ ఛార్టుల్లో ఇప్పటికీ స్థానాన్ని సంపాదించుకుంటుంది.
ఈ నెల రెండో వారం (ఫిబ్రవరి 12-18, 2024) నెట్ ఫ్లిక్స్ లో గ్లోబల్ టాప్ 10 చార్ట్ లో గుంటూరు కారం 1.8 మిలియన్ వ్యూస్ సాధించి 8వ స్థానంలో నిలిచింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా హిందీ వెర్షన్ టాప్ 10 నాన్ ఇంగ్లిష్ ఫిల్మ్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. ఇక అదే సమయంలో షారుఖ్ ఖాన్ నటించిన డంకీ 4.9 మిలియన్ వ్యూస్ తో 5వ స్థానంలో నిలిచింది. జవాన్ తర్వాత షారుఖ్ ఖాన్ కు ఇది నెట్ ఫ్లిక్స్ లో మరో భారీ విజయంగా నిలిచింది. ఈ సినిమాల డిజిటల్ సక్సెస్ తో ఇద్దరు స్టార్స్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. సోషల్ మీడియాలో రెండు సినిమాలు ట్రెండ్ లో ఉండేలా చేస్తూ తన ఆనందాన్ని అందరితో పంచుకుంటున్నారు.
సాధారణంగా థియేటర్లలో సరిగా ఆడకపోతే ఆ సినిమాలు ఓటీటీ లేదా టీవీలో అంత పెద్దగా ఆదరణ తెచ్చుకోవనే ఒక అభిప్రాయం ఉంటుంది. అయితే గుంటూరు కారం, డంకీ సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కన్నా ఓటీటీ రిలీజ్ లో ఎక్కువ ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా మహేష్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ గుంటూరు కారం సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలవగా… షారుఖ్ ఖాన్ డంకీ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.