Krishna Kowshik
ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రియాలిటీ స్టోరీలను తెరపైకి తీసుకు వస్తున్నారు దర్శక నిర్మాతలు. అలాంటి రియాలిటీ స్టోరీనే షీనా బోరా హత్య.
ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రియాలిటీ స్టోరీలను తెరపైకి తీసుకు వస్తున్నారు దర్శక నిర్మాతలు. అలాంటి రియాలిటీ స్టోరీనే షీనా బోరా హత్య.
Krishna Kowshik
ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌లో క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలదే హవా నడుస్తుంది. నిజ జీవితంలో జరిగిన కథలను.. తెరపైకి ఎక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. వాస్తవిక కథలను థ్రిల్లింగ్ జోడిస్తూ.. సినీ ప్రియులకు అందిస్తున్నారు. కేరళలో ఒకే కుటుంబంలో జరిగిన ఆరు హత్యల ఆధారంగా తెరకెక్కించిన తాజా డాక్యుమెంటరీ చిత్రం కర్రీ అండ్ సెనైడ్. అలాగే.. తెలంగాణలో సంచలనం సృష్టించిన స్వాతి రెడ్డి ఘటనను మూలంగా తీసుకుని కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ రూపొందించారు. ఈ రెండు ఓటీటీల్లో విశేషమైన వ్యూస్ రాబట్టుకున్నాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును వెబ్ సిరీస్ రూపంలో తీసుకు వస్తున్నారు.
‘ద ఇంద్రాణీ ముఖర్జీ.. బర్రీడ్ ట్రూత్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఫిబ్రవరి 23 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుందంటూ సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది కూడా. అయితే ఇప్పుడు దీని స్ట్రీమింగ్ ఆపేయాలంటూ సీబీఐ బృందం కోర్టు మెట్టెక్కింది. ఈ కేసు ఇప్పుడు ఇంకా కోర్టులో విచారణ కొనసాగుతూ ఉంది. ఈ నెల 20న ఈ కేసుకు సంబంధించిన హియరింగ్ జరగనుంది. ఈ కేసు తుది తీర్పు వెలువడే వరకు ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ నిలిపివేయాలంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.
2012లో ముంబయిలో మెట్రో వన్ (రిలయన్స్ ఇన్ ఫ్రా)లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న షీనా బోరా కనిపించకుండా పోయింది. 2015లో షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జీ, సవతి తండ్రి పీటర్ ముఖర్జీ, తల్లి కారు డ్రైవర్ అరెస్టు చేశారు. అప్పటి నుండి ఈ కేసు నడుస్తూనే ఉంది. కుమార్తెను మూడో భర్త పీటర్ ముఖర్జీని సోదరిగా చేసింది. అయితే ఆ తర్వాత షీనా ఆచూకీ కానరాలేదు. అయితే 2015లో ఇంద్రాణీ కారు డ్రైవర్ శ్యాంవర్ పింటూరామ్ రాయ్ ఓ కేసులో పట్టుబడగా.. అప్పుడు ఈ సంఘటన బయటకు వచ్చింది. ఈ కేసులో ఇంద్రాణీతో సహా ముగ్గుర్ని అరెస్టుచేయగా.. జైలులో ఉన్నారు. ఆరున్నరేళ్ల తర్వాత.. 2022 మే నెలలో జైలు నుండి విడుదలయ్యింది ఇంద్రాణీ. ఇప్పుడు ఈకేసు కోర్టులో ఉండటంతో.. స్ట్రీమింగ్ ఆపేయాలంటూ.. కోర్టుకు వెళ్లింది సీబీఐ.