iDreamPost
android-app
ios-app

OTTలోకి భగవంత్ కేసరి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్

  • Published Nov 23, 2023 | 5:23 PM Updated Updated Nov 23, 2023 | 5:23 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా ఓటీటీలో విడుదలకు రంగం సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేదిని కూడా సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా ఓటీటీలో విడుదలకు రంగం సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేదిని కూడా సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది.

  • Published Nov 23, 2023 | 5:23 PMUpdated Nov 23, 2023 | 5:23 PM
OTTలోకి భగవంత్ కేసరి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్

థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయినా మూవీలు ఓటీటీ ప్లాట్ ఫామ్ పై కూడా తెగ సందడి చేస్తుంటాయి. థియేటర్లలో చూసినప్పటికే ఓటీటీలో చూసేందుకు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలానే మేకర్స్ కూడా తరచూ హీరోల ఫ్యాన్స్ కి, ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్ చెబుతుంటారు. తాజాగా నందమూరి నట సింహ బాలకృష్ణ అభిమానులు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఆయన నటించిన భగవంత్ కేసరి సినిమా ఓటీటీలో విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఫ్రైమ్ లో  స్ట్రీమింగ్ కానుంది. మరి.. ఏ తేదీనో .. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నందమూరి బాలకృష్ణ, అందాల భామ కాజల్ అగర్వాల్ జంటగా నటించిన మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఇందులో పెళ్లిసందడి ఫేమ్, కన్నడ భామ శ్రీలీల ప్రత్యేక పాత్రలో మెరిసింది. ఇక ఎన్నో అంచనాల మధ్య దసరకు భగవంత్ కేసరి థియేటర్లలో విడుదలైంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. 135 కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు పేర్కొన్నారు. అంతేకాక బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా భగవంత్ కేసరి నిలిచింది.

ఈ సినిమా రిలీజ్ అయ్యే చాలా రోజులు అయినా.. ఇంకా థియేటర్లకు ప్రేక్షకులు వస్తూనే ఉన్నారు. అలా ఇప్పటికే థియేటర్లో అలరిస్తోన్న ఈ సినిమా తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో.. భగవంత్ కేసరి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. కొన్ని రోజులు క్రితం నవంబర్‌ 23 లేదా నవంబర్‌ 25 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే తాజాగా అధికారికంగా భగవంత్ కేసరి సినిమా విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 24, శుక్రవారం నుంచే భగవంత్‌ కేసరిని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే అదనంగా కొన్ని సీన్లను ఓ పాటను యాడ్ చేసి..ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారు. భగవంత్‌ కేసరి సినిమాలో దంచవే మేనత్త కూతురా బిట్‌ సాంగ్‌ కూడా ఉందని టాక్. అయితే థియేటర్లలో ఆ పాటను ప్రదర్శించలేదు. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో మాత్రం ఆ సాంగ్‌ ఉండనుందని సమాచారం. దీనితో పాటు సెన్సార్ బోర్డ్ కట్ చేసిన కొన్ని డైలాగులును, సన్నివేశాలను కూడా ఇందులో చూపిస్తారనే టాక్ వినిపిస్తోంది.

మరి.. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే..భగవంత్‌ కేసరి మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించారు. అలాగే శరత్‌ కుమార్‌, రవి శంకర్‌, రఘుబాబు, శుభలేఖ సుధాకర్‌, జాన్‌ విజయ్‌, రాహుల్‌ రవి తదితరులు కీలక పాత్రలో నటించారు. షైన్‌ స్క్రీన్స్ నిర్మాణ సంస్థలో సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఎస్‌. థమన్‌ స్వరాలు అందించగా.. అవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక శుక్రవారమే భగవంత్ కేసరి మూవీని కుటుంబంతో కలిసి చూసేయోచ్చు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş