iDreamPost
android-app
ios-app

5 కోట్ల బడ్జెట్.. 90 కోట్ల వసూళ్లు! ఆర్నెల్ల తర్వాత ఏకంగా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్!

  • Published Jan 28, 2024 | 11:25 AM Updated Updated Jan 28, 2024 | 11:30 AM

Baipan Bhaari Deva OTT Release: 5 కోట్లతో తెరకెక్కి.. 90 కోట్లు వసూల్ చేసిన సినిమా ఆర్నెల్ల తర్వాత ఏకంగా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వివరాలు..

Baipan Bhaari Deva OTT Release: 5 కోట్లతో తెరకెక్కి.. 90 కోట్లు వసూల్ చేసిన సినిమా ఆర్నెల్ల తర్వాత ఏకంగా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వివరాలు..

5 కోట్ల బడ్జెట్.. 90 కోట్ల వసూళ్లు! ఆర్నెల్ల తర్వాత ఏకంగా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్!

కరోనా పాండమిక్ కాలంలో ఓటీటీలకు విపరీతమైన ఆదరణ పెరిగింది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఓటీటీల హవా నడుస్తోంది. పెద్ద హీరోలు, హీరోయిన్ లు సైతం వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ.. ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యేందుకు చూస్తున్నారు. అయితే థియేటర్ల దగ్గర కొన్ని చిత్రాలకు పెద్దగా ఆదరణ లభించదు. కానీ ఆ మూవీ ఓటీటీలోకి వచ్చే సరికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక మరికొన్ని సినిమాలు థియేటర్లలో దుమ్మురేపి, OTTల్లో కూడా అదరగొడతాయి. తాజాగా అలాంటి సినిమానే ఏకంగా ఆర్నెల్ల తర్వాత రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 90 కోట్లను వసూల్ చేసింది. మరి ఇంతకీ ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

‘బైపన్ భారీ దేవ’ మరాఠీ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేదార్ షిండే దర్శకత్వం వహించగా.. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. గతేడాది జూన్ 30న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాక.. ఏకంగా రూ. 90 కోట్ల వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ఈ క్రమంలోనే మరాఠీలో అత్యధిక కలెక్షన్లు వసూల్ చేసిన రెండో చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకున్న ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒకటి కాదు.. ఏకంగా రెండు ఓటీటీల్లో ఈ చిత్రం సందడి చేస్తోంది.

Streaming on two OTTs simultaneously after six months

ఇదిలా ఉండగా.. రిలీజ్ అయిన ఆర్నెల్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతోంది ఈ బ్లాక్ బస్టర్ మూవీ. ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్ స్టార్ తో పాటుగా మరో ఓటీటీ అయిన హూలు యాప్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరాఠీతో పాటుగా హిందీ భాషలో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. తెలుగులో సబ్ టైటిల్స్ తో మాత్రమే చూసే వెసులుబాటు ఉంది. ఇదిలా ఉండగా.. హులు యాప్ లో కేవలం అమెరికాలో మాత్రమే ఉంది. దీంతో అక్కడ ఉన్నవారు మాత్రమే బైపన్ భారీ దేవ చిత్రాన్ని చూడొచ్చు. ఆరుగురు అక్కా చెల్లెళ్ల కథగా తెరకెక్కిన మూవీలో సుకన్య కులకర్ణి, శిల్పా నవల్కర్, సుచిత్ర బాండేకర్, దీపా పరాబ్, రోహిణి హట్టగండి, వందనా గుప్తే కీలక పాత్రల్లో నటించారు. మరి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ బ్లాక్ బస్టర్ ను మీరు కూడా చూసేయండి.