Swetha
ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి నిత్యం అనేక సినిమాలు, సిరీస్ లు వస్తూ ఉంటాయి. కానీ, ఈ సారి రాబోయే సినిమా మాత్రం అందరికి ప్రత్యేకమే.. అదే రామ మందిర అయోధ్య పేరుతో రాబోతున్న డాక్యుమెంటరీ.. మరి ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ వివరాలను చూసేద్దాం.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి నిత్యం అనేక సినిమాలు, సిరీస్ లు వస్తూ ఉంటాయి. కానీ, ఈ సారి రాబోయే సినిమా మాత్రం అందరికి ప్రత్యేకమే.. అదే రామ మందిర అయోధ్య పేరుతో రాబోతున్న డాక్యుమెంటరీ.. మరి ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ వివరాలను చూసేద్దాం.
Swetha
ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో అనేక సినిమాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రేమ కథా చిత్రాలైతే మరికొన్ని యాక్షన్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్స్ మరికొన్ని. వీటిలో మరికొన్ని నిజ జీవితాలను ఆధారంగా తీసుకుని రూపొందించిన చిత్రాలు కూడా ఉంటాయి. అలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ చూసేందుకు మరింత ఆసక్తిని కలిగిస్తాయని చెప్పి తీరాలి. అయితే ఇప్పటివరకు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో వచ్చిన రియల్ లైఫ్ స్టోరీస్ ఒక ఎత్తైతే.. త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న ఒక డాక్యుమెంటరీ మూవీ మరొక ఎత్తు. ఈ మూవీ అందరికి ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన డాక్యుమెంటరీ “రామ అయోధ్య”. మరి ఈ మూవీ ఎప్పుడు ఎక్కడ ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కాబోతుందనే వివరాల గురించి తెలుసుకుందాం.
అయోధ్య రామ మందిరం వెనుక ఉన్న కథలు నిన్న మొన్నటివరకు ప్రతి ఒక్కరు చర్చించుకుంటూనే ఉన్నారు. కోట్లాది మంది భారతీయుల కలకు నిదర్శనం అయోధ్యలో కొలువుతీరిన బాలరాముడు. ఐదువందల సంవత్సరాలుగా ఎంతో మంది భక్తులు పోరాటం చేశారు. దీని వెనుక ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎంతో మంది త్యాగాలు చేశారు. ఈ పోరాటం జరిగిన సమయంలో కొన్ని వేల మంది పోలిసుల లాఠీ దెబ్బలను కూడా తిన్నారు. ఈ పోరాటాలు రామ మందిర నిర్మాణ విషయాన్నీ కోర్టు మెట్ల వరకు తీసుకెళ్లాయి. చివరికి కొన్ని వివాదాస్పదమైన వాదనల తర్వాత.. ఎట్టకేలకు సుప్రీం కోర్టు కొన్ని కోట్ల మంది భారతీయుల కల నెరవేర్చే దిశగా.. అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి తీర్పుని ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 22వ తేదీన.. 51 అడుగుల పొడవైన బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే ఈ విషయాలన్నింటిని అందరికి పూర్తి స్థాయిలో తెలియజేసేలా.. దీనికి సంబంధించిన విషయాలను డాక్యుమెంటరీ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారట. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్బంగా.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహలో “రామ అయోధ్య” పేరుతో ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందని ఆహ ప్లాట్ ఫార్మ్ అధికారికంగా ప్రకటించింది.
ఏప్రిల్ 17 శ్రీరామనవమి సంధర్బంగా.. “బాల సుందరం, శ్రీరామ మందిరం!ఈ శ్రీరామనవమికి, అయోధ్య రామయ్య మీ ఇంటికి” అంటూ ట్వీట్ చేస్తూ .. ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలను ఆహా ఓటీటీ ప్రకటించింది. కాగా, ఈ డాక్యుమెంటరీకు నేషనల్ అవార్డు విన్నర్ సత్య కాశీ భార్గవ రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ గా వ్యవహరించగా.. కృష్ణ దర్శకత్వం వహించారు. అయోధ్య రామ మందిరం గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఈ డాక్యుమెంటరీ ద్వారా ప్రజల ముందుకు తీసుకురానున్నారు. అలాగే అయోధ్య పట్టణ విశేషాలను కూడా ఈ సినిమాలో అందరికి పరిచయం చేయనున్నారు. ఎన్నో కలను సాకారం చేసుకుని ఈనాడు అయోధ్యలో సేద తీరుతూ భక్తులను ఆశీర్వదిస్తున్న బాల రాముని కథను తెలుసుకునేందుకు.. ప్రేక్షకులు ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నారు. మరి “రామ అయోధ్య” డాక్యుమెంటరీ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
‘బాల’ సుందరం, శ్రీ’రామ’ మందిరం!🏹
ఈ శ్రీరామనవమికి, అయోధ్య రామయ్య మీ ఇంటికి..🙏
@SatyakashiB @kbaravi @krishnaSRam pic.twitter.com/UPjNgiTvku— ahavideoin (@ahavideoIN) April 12, 2024
Discover the captivating journey of Rama Ayodhya 🙌, a remarkable series unveiling the unparalleled qualities of Rama! 🌟
#RamaAyodhya Premiering exclusively on aha this April 17th! pic.twitter.com/6cpSwox4KX
— ahavideoin (@ahavideoIN) April 15, 2024