iDreamPost
android-app
ios-app

జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పైనే ఎల్లో మీడియా తహతహ

జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పైనే ఎల్లో మీడియా తహతహ

భారత రాజ్యాంగంలోని అనేక అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అలాగే కేంద్ర జాబితాలోని అంశాలు కూడ తక్కవేం కాదు. రాష్ట్ర జాబితాలో కూడా అనేక అంశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ రాష్ట్ర జాబితా అప్రస్తుతం. ఎందుకంటే రాష్ట్ర జాబితా అంశాలు పూర్తిగా రాష్ట్ర పరిధిలోనే ఉంటాయి. కనుక రాష్ట్రానిదే నిర్ణయాధికారం.

అయతే కేంద్ర, ఉమ్మడి జాబితాలకు సంబందించి అలా కాదు. కేంద్ర జాబితా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. నిర్ణయాధికారం కూడా కేంద్రానిదే. ఇటొచ్చి కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఉమ్మడి జాబితా ఉంటుంది. ఈ జాబితాలో కేంద్ర, రాష్ట్రాల రెండింటికి నిర్ణయాధికారం ఉంటుంది. అలాగే దేశ రాజ్యాంగంలో సమాఖ్య వ్యవస్థ స్పష్టంగా చెప్పబడింది. ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాలను తెలియజేస్తుంది. అందుకే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కలిసి తమకు రావల్సిన నిధులు, ఇతరత్రా విజ్ఞప్తులు చేస్తారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసి తమ రాష్ట్రానికి సాయం చేయాలని అడుగుతారు. ఇందులో కొత్తేమీ లేదు.

అయితే కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావల్సిన నిధులు ఇవ్వాలని కోరేందుకు ఇటీవలి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేసేందుకు నిర్ణయించారు. షెడ్యూల్ ఖరారు అయిన తరువాత అదికాస్తా వాయిదా పడింది. ఇలా గతంలో చంద్రబాబు పర్యటనలు కూడా వివిధ కారణాల రీత్యా వాయిదా పడ్డాయి. ఇది సహజమే. ఒక్కోసారి అనివార్య కారణాల రీత్యా ప్రముఖుల పర్యటనలు, సందర్శనాలు వాయిదా పడతాయి.

అయితే సిఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దుపై కల్పిత కథనాలు రాసేందుకు ఎల్లో మీడియా తహతహ పడింది. ఏవేవో ఊహించుకొని చాటబారడంతా కథనాలు రాసేశాయి. అయితే ఇదే ఎల్లో మీడియా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రద్దు అయిన ఢిల్లీ పర్యటన గురించి ఇలాంటి ఊహాజనిత కథనాలు ఎందుకు రాయలేదు…?

చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు 2017 జూలై 17న ఆయన ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. అందుకోసం జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని కూడా రద్దు చేసారు. చివరి నిమిషంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు అయింది. దీన్నీ నాడు ఎల్లో మీడియా కనీసం మొదటి పేజీలో కూడా రాయలేదు. కాని ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటన వాయిదాను పతాక శీర్షికగా రాసింది. కల్పతాలు, ఉహాలు జోడించే నాలుగు కాలమ్స్ ఐటమ్ రాసింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు జరిగినప్పుడు సింగిల్ కాలమ్ కూడా పూర్తిగా రాయలేదు.

ఎల్లో మీడియా ఏం రాసిందంటే…!

సిఎం జగన్ పైనా, వైసిపి ప్రభుత్వంపైనా ఎల్లో మీడియా మొదట నుంచి విషం చిమ్ముతుంది. జగన్ ఏ మంచి పని‌చేసినా దానిపై కోడి గుడ్డుపై ఈకలు తీసే విధంగా విమర్శలు చేస్తూ కథనాలు రాస్తుంది. ఎక్కడైనా మీడియా అనేటప్పుడు మంచి చేసినప్పుడు పొగడాలి. చెడు చేసినప్పుడు విమర్శించాలి. అయితే ఏపిలో మాత్రం ఎల్లో మీడియా ప్రతిదాన్ని మంచి, చెడు అని తేడా లేకుండా విమర్శించుకుంటూ పోతుంది. అందులో భాగంగానే ఇటీవలి సిఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దుపై అవాకులు, చెవాకులు రాసింది. కథ అంతా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైపే తిప్పింది.

అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులను కలవాలంటే ఆ రాష్ట్ర బిజెపి నేతల ప్రమేయమేంటీ..? అలా ఉండదు. ఎందుకంటే పార్టీలు వేరైనా రాజ్యాంగ బద్ధంగా..ప్రజల చేత ఎన్నికోబడే ప్రభుత్వానికి నాయకత్వం వహించే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి…ఆ రాష్ట్ర బిజెపి నేతలు అభిప్రాయాన్ని తీసుకొని, వారు సరేనంటే అపాయింట్మెంట్ ఇవ్వడమనేది జరిగితే…అనధికారికంగా ఆ రాష్ట్రంలో బిజెపి పాలిస్తున్నట్లు అవుతుంది.

అయితే ఎల్లో మీడియా ఇక నుంచి సిఎం జగన్ కు అపాయింట్మెంట్ ఇవ్వాలంటే…రాష్ట్ర బిజెపి నేతల అభిప్రాయం బట్టీ ఉంటుందని తోచింది రాసేసింది. అలాగే గవర్నర్ పై కూడా పేర్కొంది. గవర్నర్ పై బిజెపి నేతలు అసంతృప్తితో ఉన్నారని రాసింది. ఇలా ఎదో ఒకటి‌ ఊహించుకొని సిఎం జగన్ పై విషం గక్కుతూ ఎల్లో మీడియా తన పేపర్ పేజీలను నింపుకుంది. అంతేతప్ప ఇందులో ఒక్కటి కూడా వాస్తవం అనడానికి ఆస్కారం లేదు.